సంగారెడ్డి జిల్లాలో 7మున్సిపల్ ఎన్నికల్లో 6 టిఆర్ఎస్ ,కాంగ్రెస్ 1 కైవసం
టిఆర్ఎస్ మద్దతుతో గెలిచిన వార్డు మెంబర్ గా ఫోటో

సంగారెడ్డి: లోకల్ టైమ్స్ ప్రతినిధి :జనవరి 25: జనవరి 22న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని 7 మున్సిపాలిటీలలో ఆరు మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి అధిక మెజార్టీతో గెలుపొందగా ,నారాయణఖేడ్ మున్సిపాల్టీలో కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినట్లు జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి జిల్లా కలెక్టర్ శనివారం ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత ప్రకటించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులలో టిఆర్ఎస్ 18, కాంగ్రెస్ 12 ,బి జె పి 3, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 3 స్థానాల్లో గెలుపొందగా, సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులలో టిఆర్ఎస్ 13, కాంగ్రెస్ 9, బిజెపి 1, ఎం ఐ ఎం 2 ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందగా,అందొల్– జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులలో టిఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6 ,ఇండిపెండెంట్1, అభ్యర్థి గెలుపొందగా, ఐడీఏ బొల్లారం పరిధిలోని 22 వార్డులలో టిఆర్ఎస్ 17, కాంగ్రెస్ 2, బీజేపీ 3,స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందగా, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 17 వార్డులకు గాను టి ఆర్ ఎస్ 10 ,కాంగ్రెస్ 4, బిజెపి 1 ఇండిపెండెంట్ 2,అభ్యర్థులు గెలుపొందగా, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 24 వ వార్డు వార్డులకు గాను టిఆర్ఎస్ 14, కాంగ్రెస్ 6 ,బిజెపి 1, టిడిపి 2, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలుపొందగా, నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు 8 ,మంది గెలుపొందగా టిఆర్ఎస్ 7, మంది అభ్యర్థులు గెలుపొందిన ట్లు జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started