కె కె రాజు ఆధ్వర్యంలో వంటా వార్పు

లోకల్.టైమ్స్ విశాఖపట్నం; శాసనమండలిలో ఆంద్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన ధోరణికి, ప్రసంగాలకు, విధానాలకు వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీ విధానాలను ఖండిస్తూ ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తూ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ శనివారం ఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో NH-5, తాటిచెట్లపాలెం జంక్షన్లో వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. ఆ పార్టీ కి విశాఖ జిల్లా నుండి 4 ఎం ఎల్ ఏ లను ప్రజలు గెలిపిస్తే ఈ విశాఖ కు పరిపాలన రాజధాని రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రజలు దృష్టిలో చంద్రబాబు ప్రజా ద్రోహి గా మిగిలిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ పార్టీ రాష్ట్ర, పార్లమెంట్,సిటీ, నాయకులు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,బూత్ కన్వీనర్లు,కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
