త్వరలో ఏపీజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమం

లోకల్ టైమ్స్ విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఏ పీ జే యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం విశాఖపట్నం గాజువాక లో జరిగింది. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు మాట్లాడుతూ గ్రామీణ జర్నలిస్టులకు కనీస గౌరవ వేతనం, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రిటైర్ అయిన పాత్రికేయులకు పింఛన్ ఇవ్వాలని అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్ లకి అమలు చేయవలసిన సదుపాయాలు అన్నింటిని త్వరితగతిన అందించాలని కోరుతూ గ్రామీణ ప్రాంతం పాత్రికేయులకు కనీస గౌరవ వేతనం ఇచ్చినంత వరకు ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు ఎవరైనా మా యొక్క ఏపీ జే యు పోరాడుతుందని, అలాగే ఎంప్లాయిమెంట్ లేని పేపర్లను తొలగించాలని ప్రభుత్వం ఆలోచించే విధానం మార్చుకోవాలని అలాగే జీవో నెంబర్ 24 30 ను సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సూచన తెలియజేశారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులకు అన్ని విధాల న్యాయం జరిగే వరకు ఏపీజే యు పోరాడుతూనే ఉంటుందని పాత్రికేయ మిత్రులు ఎవరు నిరుత్సాహ పడనవసరం లేదు అని తెలియజేశారు, ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పూతీ వెంకటరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు మిత్రులకి అన్యాయం జరగకుండా అండగా ఉండి ఎన్ని పోరాటాలు చేయడానికేనా ఏపీ జే యు ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉంటుందని వెంకటరెడ్డి తెలియ చేశారు, త్వరలో విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నం అని ఆయన విలేకర్ల సమావేశంలో తెలియజేశారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started