మాజీ ఎమ్మెల్యే వుడా మాజీ చైర్మన్ డాక్టర్ రెహమాన్ మంగళవారం ఉదయం హోటల్ బుదిల్ పార్క్ సమావేశం ఏర్పాటు చేశారు

లోకల్ టైమ్స్ విశాఖపట్నం:,మాజీ ఎమ్మెల్యే వుడా మాజీ చైర్మన్ డాక్టర్ రెహమాన్ మంగళవారం ఉదయం హోటల్ బుదిల్ పార్క్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గారికి అన్నీ తెలుసు. కానీ దేన్నీ సవ్యంగా తీసుకువెళ్లరు. అనితన మనసులో ఉండేది వేరు. పైకి చెప్పేది వేరు. ఏపిని సన్ రైజ్ స్టేట్ అన్నారాయన. సన్ అంటే తన కొడుకు అన్నది ఆయన ఆలోచన. అని
కేసీఆర్ కు మంత్రి పదవి ఇస్తే ఈ రాజకీయాలే వేరుగా ఉండేవి.ఇపుడు కూడా అలాగే తప్పు చేస్తున్నారు. రాష్ట్రమంతటా అమరావతికి మద్దతుగా తిరుగుతానన్నారు. తిరగటం లేదేం విశాఖలో రాజధాని కావాలని ఎవరడిగారు అని చంద్రబాబుగారు ప్రశ్నిస్తున్నారు. మరి అమరావతిని చేయాలని ఎవరు అడిగారు.వశాఖ రాజధాని కావాలని 1953 లోనే చట్ట సభతీర్మానం చేసింది.అది ఎవరికీ తెలియదులే అని ఆయన అనుకున్నారు.
వేరే రాష్ట్రాలనుంచి, దేశాలనుంచి వచ్చి జగన్ కి తాము ఓటువేసింది ఇందుకేనా అని నిలదీస్తున్నారు. ఇది ఎవరు చేయిస్తున్నారని ప్రజలకు తెలిసిపోయింది.
చంద్రబాబుగారు ఉత్తరాంధ్రకు వచ్చి రాజధాని వద్దని ప్రజలతో అనిపించాలి.
చంద్రబాబు 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను చేరదీసి పదవులిచ్చిన మాట వాస్తవం. కానీ ఆయన జగన్ గారు టిడిపి ఎమ్మెల్సీలను కొనబోయారని ఆరోపించటం హాస్యాస్పదం.
మీరు అయిదేళ్లు ఓపిక పట్టండి – ప్రజలే తీర్పు ఇస్తారు అని రెహమాన్ అన్నారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started