
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ ఘనవిజయం

లోకల్ టైమ్స్: నందిగామ:ఎస్ఎఫ్ఐ నందిగామ కమిటీ
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం
నందిగామ గాంధీ బొమ్మ సెంటర్ లో గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ గెలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు గెలుపు కోరుతూ టపాసులు కాల్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు
యూనివర్సిటీ లో గెలుపు కేంద్ర ప్రభుత్వనకి చెంపపెట్టు లాంటిది అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు అన్నారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ_. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించడం గొప్ప పరిణామని ఆయన అన్నారు. విద్యార్థి సంఘం ఎన్నికల్లో (ఎస్ఎఫ్ఐ) కూటమి విజయఢంకా మోగించిందిని బిజెపి అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపిని మట్టికరిపించి నాలుగు స్థానాల్లోనూ ఘన విజయం సాధించిందిని’ వారు తెలిపారు. గతంలో కూడా హైదరాబాద్, కేరళ, ఢిల్లీ , లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో మతోన్మాదనాకి వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా పోరాడడం జరుగుతుందిని, దేశ ప్రధాని నరేంద్రమోడీ చేసే విద్య వ్యతిరేకంగా నిర్ణయలు పై పోరాటం చేశారని అన్నారు. యూనివర్సిటీలో పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు అనేక ఆందోళనలు చేస్తుంటే బిజెపి ప్రభుత్వం దాడులకు పాల్పడడం జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలోనే యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ మిగిలిన సంఘాలు అన్నీ కలిపి విజయాలు సాధించడం గొప్ప పరిణామనీ ఆయన అన్నారు.విద్యారంగంలో మత భావాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే వాటిపై కూడా వారి పోరాడడం , భారత రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారని రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నారు వారన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ అధ్యక్షులు
లాల్ సలామ్, కార్యదర్శి గోపీనాయక్ , జిల్లా కమిటీ సభ్యులు అనీఫ్ , నందిగామ
సిఐటియు నాయకులు గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కాసిం కాజా మొహిదీన్ తదితరులు పాల్గొన్నారు.
