గుండెపోటుతో రైతు మృతి.. పరామర్శించిన నారా లోకేష్

గుంటూరు: మంగళగిరి మండలం నవులూరులో రైతు నేటి తెల్లవారుజామున రంగిశెట్టి వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధానిపై మనస్తాపంతో వెంకటేశ్వరరావు మృతి చెందినట్టు ఆయన బంధువులు చెబుతున్నారు. గత 41 రోజులుగా మంగళగిరి మండలంలో వెంకటేశ్వరరావు ఆందోళనలో పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు.
