వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు దొడ్డి రమణ స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన జోన్-5 కమిషనర్

లోకల్ టైమ్స్ విశాఖపట్నం: గాజువాక 65 వార్డ్ బిసి రోడ్డు, సత్తెమ్మ తల్లి గుడి, కాకతీయ జంక్షన్, భానోజీ తోట,పలు ప్రాంతాల్లో పర్యటించిన గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్.. అనంతరం పెట్రోల్ బంక్ వద్ద కల్వర్టు పాడైన స్థలంలో పందులు తన నివాసంగా ఏర్పరచుకున్నాయి అన్న ఫిర్యాదుపై ఈరోజు గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్ ఆ ప్రాంతంలో పర్యటించి, అలాగే కొండవాలు ప్రాంతాల్లో ప్రజల పడుతున్న బాధలు కళ్ళారా చూసిన అతను సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు దొడ్డి రమణ, తుంపాల తాతారావు, ఎన్ ఎస్ ఎన్ రెడ్డి, పాల అప్పల్ రెడ్డి, ఓల్లేటి నూకరాజు, మంత్రి మంజుల, బోత్స వాసు, రాఘవ స్వామి, డీఎం దళి నాయుడు, శ్రీనివాస్, డిపో రాజు, కంది అప్పల నాయుడు,వెంపడ్ రాజు, ఆర్మీ చిన్న, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
