నేరేడుచర్ల మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ కైవసం

సూర్యాపేట: నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్, ఆ పార్టీ సభ్యులు బాయ్‌కాట్ చేశారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఓటుతో టీఆర్‌ఎస్ బలం 11కు చేరుకుంది. ఉత్తమ్, కేవీపీతో కాంగ్రెస్ ఓట్లు 10కు చేరుకున్నాయి.
