కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జంట కార్పొరేషన్ మేయర్ లు..కార్పొరేటర్ లు


లోకల్ టైమ్స్.. తెలంగాణ భవన్: మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన బొడుప్పల్ , పీర్జాదిగూడ మేయర్ లు..కార్పొరేటర్ లు,టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు. నూతనంగా ఎన్నికయిన మేయర్ లను కార్పొరేటర్ లను కేటీఆర్ అభినందించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ముచేయొద్దని, ప్రజల పట్ల బాధ్యతగా ఉండి మీ మీ డివిజన్ లను అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి సూచించారు.


