విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి. నరేష్

హత్నూర, లోకల్ టైమ్స్ :విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలు జిల్లా ఉన్నతస్థాయి అధికారులకు ఎందుకు పట్టడం లేదని, పరిష్కరించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి. నరేష్ అన్నారు, మంగళవారం హత్నూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న జిల్లా ఉన్నత అధికారులకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు, పెండింగులో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ రాక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాల కు గత 7 నెలల నుండి బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు,వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారాని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పెండింగులో ఉన్న సంక్షేమ వసతి గృహాల బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నా సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ రెడ్డి, నవీన్, అఖిల్, చందు,విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started