వాలoటీర్ల కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్ ఎల్ ఏ

లోకల్ టైమ్స్:నందిగామ: ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేలా ఈ ప్రభుత్వం పని చేస్తుందని శాసనసభ్యులు డా:మొండితోక. జగన్మోహనరావు పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని 11,12-13,14 వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్ లను ఎమ్మెల్యే డా:జగన్మోహనరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వ పాలన నడిచేలా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ రూపొందించారన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తీసుకురావాలనే గొప్ప లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ,ప్రజల ఇంటి వద్దకే అన్ని సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా ,ప్రభుత్వ కార్యక్రమాల, పథకాల సమాచారం నమోదు చేసేలా వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వార్డు వాలంటీర్ కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, జవాబుదారీతనంగా ఉండేలా పనిచేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వై.యస్.జగన్ కు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
