కన్న తండ్రే కాల యముడు

లోకల్ టైమ్స్ ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని కన్న తండ్రే కాల యముడు అయినవైనం వివరాల్లోకి వెళితే ఖాతా వత్ రేణుక తండ్రి రవి నాయక్ వీరి సొంత ఊరు వికారాబాద్ జిల్లా అవుజపుర్ తాండ బతుకుతెరువు కోసమై సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో లో తాపీ మేస్త్రి గా విధులు నిర్వహిస్తున్న రవి నాయక్ అతని కూతురు 13 సంవత్సరాలు 8 తరగతి కే జి బి వి గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది తండ్రి ఈనెల 12వ డేటు నాడు హాస్టల్ నుండి తీసుకొనివచ్చి ఆత్మకూరు తన కూతుర్ని తీసుకువెళ్ళి నాడు అనంతరం ఆ పాపకు తీవ్ర జ్వరం రాగా సదాశివపేట పట్టణంలోని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చుట్టుపక్కల వారికి చెప్పి తన కూతురు మార్గమధ్యంలో బాగా ఎక్కిళ్లు వచ్చి చనిపోయిందని 13- 2 2020 రోజున తన కూతురిని తన సొంత ఊరైన అవోజపుర్ తాండ వికారాబాద్ జిల్లా తీసుకువెళ్లగా అక్కడ ఉన్న తండావాసులు రేణుక మెడ పై భాగంలో లో గొంతు మరకలు ఉండగా అనుమానం రాగా వీఆర్వో గారిని సంప్రదించి పంచనామ చేయించారు. విఆర్ఓ వికారాబాద్ పోలీసులకు విషయం తెలుపగా ఇది సదాశివపేట పరిధిలోకి వస్తుందని అక్కడ ఉన్న ఎస్పీ గారిని వికారాబాద్ పోలీసులు ఫైల్ చేయగా ఈ కేసు ఈ విషయమై అమ్మాయి తండ్రిని రవినాయక్ సదాశివపేట పోలీసులు పట్టుకుని విచారించగా చెప్పలేని నిజాలు బయటపడ్డాయి అసలు తండ్రి అనే అనుమానం కలుగుతుంది గతంలో కూడా ఈ పాపకు తీవ్ర జ్వరం రాగా సుమారు ఒక సంవత్సరం కింద అప్పుడు 20 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని ఇప్పుడు మళ్లీ అదే రోగం వస్తే దవాఖాన తో పాటు పెళ్లి చేయాలంటే ఎంతో ఖర్చులు వస్తాయని భరించలేని ఖర్చులు వస్తున్నాయ ని అతనికి అతి దుర్మార్గమైన నీచమైన ఆలోచన వచ్చి కన్నకూతురిని గొంతు నులిమి కడతేర్చిన కసాయి తండ్రి నమ్మలేని నిజాలు రాబట్టిన సదాశివపేట పోలీసులు కాల యముడైన తండ్రిని కటకటాల కు పాలు చేసిన పోలీసులు.
