హైదరాబాద్‌లో గుంటూరు యువతి అదృశ్యం!

హైదరాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో ఓ ఇంట్లో పని చేసే సహాయకురాలు అదృశ్యమైంది. ఈ సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే.. లోతుకుంట సరస్వతి నగర్‌లో వేల్పుల రాబర్ట్ జయ ప్రకాష్‌రావు నివాసముంటున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లాకు చెందిన విజయ (21) ఇంట్లో వంట పనిచేస్తోంది. ఇటీవల ఇంట్లో నుంచి బయటకెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఇంటి యజమాని జయ ప్రకాష్ రావు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.
