ఘనంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ రీజినల్ కాన్ఫరెన్స్

లోకల్ టైమ్స్ విశాఖపట్నం, సమాజ సేవలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన లయన్స్ క్లబ్ల ప్రాంతీయ సమావేశాన్ని ఆదివారం రాక్ డేల్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డి .ఎస్. ఎస్. వి. వర్మ మాట్లాడుతూ ఎప్పటి నుంచో లయన్స్ క్లబ్ సంస్థ ద్వారా అన్ని వర్గాల పేదవారికి అన్ని విధాలుగా చేయూతను అందిస్తున్నామన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ కడిమిశెట్టి గాంధీ మాట్లాడుతూ ఈ సమావేశంలో సుమారు 10 లయన్స్ క్లబ్ లు చేసిన సేవా కార్యక్రమాలపై చర్చలు చేశామన్నారు. ఇంకా ఏ విధంగా పేద వర్గాలకు చేయూత ఇవ్వాలనే అంశంపై చర్చించి తగు ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. నార్త్ ఈస్ట్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చెన్నా కృష్ణమూర్తి మాట్లాడుతూ అన్ని రంగాలలో లయన్స్ క్లబ్ తన సేవలను విస్తరించిందన్నారు. ఈ నాలుగవ ప్రాంతీయ సమావేశంలో లయన్స్ క్లబ్ పనితీరు, లక్ష్యాలు తదితర అంశాలపై చర్చించామన్నారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జెడ్సి, సి. హెచ్. శ్రీరామమూర్తి, నార్త్ ఈస్ట్ లయన్స్ క్లబ్ కార్యదర్శి చందన, ట్రెజరర్ డి. శ్రీనివాస్, అతి దులు వి. ఉమామహేశ్వరరావు, తిరుపతి రాజు, సీతాకుమారి, దుర్గాప్రసాదరావు, శివ ప్రసాద్, వి. ఎస్. నూకరాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started