రావ‌ణ లంక’.. టైటిల్ ఫిక్స్

ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి సినిమాలో కంటెంట్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకు పెట్టే టైటిల్ కూడా అంతే ముఖ్యం. టైటిల్‌, కంటెంట్‌ కాంబినేషన్ సెట్ అయితే ఆ సినిమా గురించి కాకుండా, ఆ సినిమా సాధించే రికార్డుల గురించే మాట్లాడుకునే రోజులు ఇవి. అయితే ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినప్పటికీ ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి అది వెళ్లే క్రమంలో టైటిల్ ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ప్రేక్ష‌కుల నానుడిగా ఉండే టైటిల్స్ ఎప్పుడూ ఇట్టే ఆక‌ట్టుకుంటాయి. ఇప్పుడు కె సీరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో ముర‌ళీ శ‌ర్మ‌, దేవ్‌గిల్ ప్ర‌ధాన‌పాత్ర‌లలో బి.ఎన్‌.ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కూడా కంటెంట్‌తో పాటు కరెక్ట్ టైటిల్‌తో వస్తుందంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాకు టైటిల్‌గా ‘రావ‌ణ లంక’ అని ఖ‌రారు చేశారు. ఈ చిత్రంలో క్రిష్‌, అష్మిత‌, త్రిషలు జంట‌గా న‌టించారు. స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఒక సాంగ్ మిన‌హా షూటింగ్ పూర్తి చేస‌ుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ని ఆదివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. 

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు బి.ఎన్‌.ఎస్ రాజు మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల త‌రువాత తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా, మంచి కంటెంట్‌తో మా ‘రావ‌ణ లంక’ చిత్రం రానుంద‌ని గ‌ర్వంగా చెబుతున్నాను. ఇలాంటి చిత్రాలకి స్క్రీన్‌ప్లే మెయిన్ పార్ట్‌గా ఉంటుంది. మా చిత్రంలో కూడా ప్ర‌తి ఒక్క‌రూ త‌ల తిప్ప‌కుండా చేసేలా స్ర్కీన్‌ప్లే కుదిరింది. ముర‌ళీ శ‌ర్మగారు, దేవ్‌గిల్‌గారు ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. అలాగే భ‌ద్రం, ర‌చ్చ‌ర‌వి కామెడీ టైమింగ్ కూడా స్క్రీన్ మీద న‌వ్వులు పూయిస్తుంది. అలాగే హీరోగా పరిచయం అవుతున్న క్రిష్ కూడా చాలా బాగా చేశాడు. అష్మిత‌, త్రిష‌లు ఈ థ్రిల్లింగ్ మూవీకి గ్లామ‌ర్ అందించారు. ఉజ్జ‌ల్ అందించిన సంగీతానికి బిగ్‌బాస్ సీరీస్‌3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ మ‌రియు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి కుమారుడు కాల‌భైర‌వ వారి వాయిస్‌తో ఆడియోకి క్రేజ్ తీసుకువ‌చ్చారు. అతి త్వ‌ర‌లో ఆడియోని విడుద‌ల చేస్తాము. ఈ చిత్రం అంద‌ర్నీ ఆక‌ట్ట‌ుకుంటుంది. అలాగే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేస్తాము..’’ అని అన్నారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started