ప్రముఖ నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం

హైదరాబాద్: ప్రముఖ నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం కలిగింది. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పరమేశ్వరరావు గత నాలుగు నెలలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణా జిల్లా మేకావారిపాలెంలో పరమేశ్వరరావు జన్మించారు. అనంతరం ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
