పల్లె ప్రతి కార్యక్రమంలో మొక్కలు నాటిన అధికారులు

సంగారెడ్డి :లోకల్ టైమ్స్ బ్యూరో :ఫిబ్రవరి 17: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం సంగారెడ్డి జిల్లా కంది మండలం పరిధిలోని లకుడారం. లక్దరం బ్యాతోల్ గ్రామాలలో జిల్లా మైనింగ్ అధికారి మధు బాబు ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్నిసోమవారం చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా మధు బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటడం వల్ల వాటి వాసన వల్ల గ్రామాల్లో ప్రజలు అనారోగ్యంకు గురికాకుండా ప్రజలకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి తదితర కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

