పల్లెపు శంకర్ సునితా లు అదృశ్యం…..వెతుకులాటలో కుటుంబ సభ్యులు….

కడప: ఈనెల 19న కృష్ణ ఎక్స్ ప్రెస్ అదిలాబాద్ నుండి, ఆ జిల్లాకు చెందిన మారాలా గ్రామ నివాసులు అనిత శంకర్ సునీత లు ఇంటి నుండి కృష్ణ ఎక్స్ ప్రెస్ లో తిరుపతి వెళ్లారు. అక్కడ నుండి తిరుగు రైలు మార్గన కడప జిల్లా నందలూరు రైల్వేటేషన్ చేరుకున్నారు. అక్కడ రెండు రోజులపాటు స్టేషన్ లోనే ఉన్నారు అనుమానం వచ్చిన నందులూరు రైల్వే పోలీసులు వారిని ప్రశ్నించడంతో అనిత వారికి దొరకడంతో శంకర్ సునీత అక్కడి నుంచి పరారయ్యారు. ఆచూకీ కోసం వారి కుటుంబీకులు గాలిస్తున్నారు. ఈ మేరకు నందలూరు పోలీసులు తెలిపిన వివరాలు అనిత అని ప్రశ్నించగా మేము ముగ్గురం కృష్ణ ఎక్స్ ప్రెస్ లో అదిలాబాద్ నుండి తిరుపతికి చేరుకున్నామని, అక్కడనుండి నందలూరు వచ్చామన్నారు. అక్కడ పోలీసులకు పట్టుబడటం తో వారు ఇరువురు పరారైనట్లు అనిత తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా మవాల గ్రామ పోలీస్ స్టేషన్ కు నందులూరు పోలీసులు ఫిర్యాదు చేయడంతో అక్కడ నుండి వారి కుటుంబ సభ్యులు , మవాల పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ నందలూరు వచ్చి అక్కడ జరిగిన సంఘటనలు నందలూరు రైల్వే పోలీసులు ద్వారా తెలుసుకొని కడప కు వచ్చి స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వివరాలను క్లుప్తంగా పాత్రికేయులకు తెలిపారు. అదృశ్యమైన శంకర్ సునితా ల ఆచూకీ తెలిసినట్లయితే తమ సెల్ నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. సంప్రదించవలసిన నెంబరు —— ఈ కార్యక్రమంలో సునీత అమ్మ ఎల్లమ్మ, అన్నయ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
