జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లా అదనపు ఎస్.పి. శ్రీ. డి.నాగరాజు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసారు.

మెదక్ లోకల్ టైమ్స్ ప్రతినిధి ; 71వ గణతంత్ర వేడుకల దినోత్సవం సంధర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లా అదనపు ఎస్.పి. శ్రీ. డి.నాగరాజు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసారు. అనంతరం అదనపు ఎస్.పి మాట్లాడుతూ… భారత రాజ్యంగ నిర్మాత శ్రీ అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి అన్వయిస్తూ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశా నిర్దేశం చేశారని గుర్తు చేశారు. 26 జనవరి నాడు మన రాజ్యాంగం ఆమోద పొంది ఇదే రోజు మన పార్లమెంట్ మనకి అందుబాటులోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం (రేపబ్లిక్ డే) గా జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగం యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. భారత దేశంలో వివిధ సంస్కృతులు, బిన్నత్వాలు ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటే అనీ జాతీయ స్ఫూర్తి భిన్నత్వంలో ఏకత్వం (Unity in diversity) కనిపిస్తుందన్నారు. ప్రజల రక్షణ కోసం రూపొందించుకున్న చట్టాలను గౌరవిస్తూ, కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలం ఈరోజు మనందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే స్వాతంత్ర భారత దేశమన్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. సిబ్బంది అంతా బాగా కష్ట పడి పోలీసుకు మంచి పేరు తీసుకరావాలన్నారు. పోలీసు శాఖ లో పనిచేసే ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది తమ వంతు బాధ్యతగా పనిచేయాలని అన్నారు, కలిసి కట్టుగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని సిబ్బందిని సూచించారు, ఈ సందర్భంగా అదనపు ఎస్.పి జిల్లా ప్రజలందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో అదనపు మెదక్ డి.ఎస్.పి. శ్రీ కృష్ణ మూర్తి గారు , ఎస్.బి. సి.ఐ. శ్రీ విజయ్ కుమార్ , సి.ఎబి. డి.సి.అర్.బి. సి.ఐ. లు, ఎస్.ఐ. లు, డి.పి.ఓ. సిబ్బంది, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started