తోపుడు బండ్లు కార్మికులకు తక్షణమే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి…

లోకల్ టైమ్స్ విశాఖపట్నం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తోపుడు బండ్లు, వీధి వ్యాపారస్తులు సుమారు వేలాది మంది పనిచేస్తున్నారు. వీరిపై జీవీఎంసీ అధికారులు, పోలీసులు దాడులు చేసి వీరి ఉపాధిని పొగుడుతున్నారు. ఈ సందర్భంగా తోపుడుబండ్ల చిల్లర వర్తకుల కార్మిక సంఘం అధ్యక్షులు ఏ సింహాచలం మాట్లాడుతూ యువత ఎక్కువ మంది తోపుడు బండ్లు, వీధి వ్యాపారస్తులు గా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారని వీరికి ఉద్యోగాలు రాక వీరంతా స్వయం ఉపాధిపై పనిచేస్తున్నారని కొన్ని ప్రాంతాల్లో కుటుంబం అంతా తల్లిదండ్రి పిల్లలు పని చేస్తే గాని ఇల్లు గడవడంలేదు అని అన్నారు. వీధి వ్యాపారస్తులు, తోపుడు బండ్లు కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలని, హాకర్ జోన్స్ ఏర్పాటుచేసి వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సుప్రీం కోర్టు కూడా తీర్పునిచ్చింది అని తెలియజేశారు. తోపుడు బండ్లు చిల్లర వర్తకుల కార్మిక సంఘం కార్యదర్శి ఓమ్మి అప్పారావు మాట్లాడుతూ మన విశాఖ నగరంలో కొన్ని ప్రాంతాల్లో హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేశారు. కొంతమంది కార్డులు మంజూరు చేశారు అని ఇంకా చాలామంది కార్డుల కోసం జివిఎంసికి డబ్బులు చెల్లించి ఉన్నారని తెలిపారు. సుమారు నాలుగు నెలల పైన అవుతున్న నేటికి కార్డులు మంజూరు చేయలేదు. అని అలాగే కార్మికులు పనిచేసే వద్ద హాకర్ జోన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇప్పటికే హాకర్ జోన్స్ ఏర్పాటు చేసిన దగ్గర కనీస వసతులు కల్పించాలని లోన్లు మంజూరు చేయాలని , వీధి విక్రయదారులు పై జీవీఎంసీ అధికారులు, పోలీసుల దాడులు ఆపాలని అని తెలిపారు. వెండింగ్ కమిటీ సమావేశాలు ప్రతినెల వేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా పలు తోపుడు బండ్లు మరియు చిల్లర వర్తకులు పాల్గున్నారు

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started