ప్రయాణంలో అదుపు తప్పి వ్యక్తి మృతి

కొండాపూర్ లోకల్ టైమ్స్ ప్రతినిధి: మండల పరిధిలోని తోగరు పల్లి గ్రామానికి చెందిన మన్నే రాజశేఖర్ తండ్రి శంకరయ్య వయస్సు 23 సంవత్సరాలు కులము ముదిరాజ్ వృత్తి పార్ట్ టైం జాబ్ తేదీ 13 2 2020 రోజున రాత్రి తన స్నేహితుడైన కుమ్మరి మల్లేశం తో కలిసి తన బైక్ పై తోగరు పల్లి నుండి గారకుర్తి గ్రామానికి బైక్పై వెళ్తుండగా మార్గమధ్యలో బైకు అదుపు తప్పి కింద పడిపోవడంతో బలమైన గాయాలు తగలడం జరిగింది .ఆసుపత్రికి తరలించగా రాజశేఖర్ చికిత్స పొందుతూ తేదీ 16 2 2020 న సాయంత్రం మరణించడం జరిగింది మల్లేశం ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని మృతుని చిన్న తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందని ఏ ఎస్ ఐ రజాక్ పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది.
