పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లా లో 400 డాక్టర్ల పంపిణీ : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి : లోకల్ టైమ్స్ బ్యూరో :ఫిబ్రవరి 17 : జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు ఉచిత పంపిణీ చేయడం జరిగిందని ,రాష్ట్రం లోని గ్రామ పంచాయతీల పరిధిలో సిసి రోడ్ల నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మొదటి విడతగా ఐదు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వారం రోజుల్లో జిల్లాలకు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ సమ్మేళనంలో సోమవారం తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ సమ్మేళన కార్యక్రమం రాష్ట్రంలో ని 31 జిల్లాలలో గ్రామాల అభివృద్ధికి గాను పంచాయతీ రాజ్ సమ్మేళన కార్యక్రమం జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని మొదటగా సంగారెడ్డి జిల్లాలలో పల్లె ప్రగతి పంచాయతీరాజ్ సమ్మేళనం ప్రారంభించడం జరిగిందని అన్నారు దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ ,నీటి సరఫరాకు ట్యాంకర్ సౌకర్యం కల్పించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ఈ ప్రభుత్వము చేపట్టిన ఈ విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి గాను పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. పల్లె ప్రతి కార్యక్రమంలో చేపట్టిన డంపు యార్డ్ వైకుంఠ దామం ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పల్లె పల్లి కార్యక్రమంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామాల వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక బృందం పర్యటించి ఎంపీడీఓలకు ,కార్యదర్శి లకు, సర్పంచి లను విధుల నుండి తొలగిస్తామని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమంలో గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు మొక్కల పెంపకం నిర్మాణం నిర్మాణం గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు వాడటం తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయా లు లేని గ్రామంలో గ్రామపంచాయతీ భవనాలు నిర్మించుకోవాలని తెలిపారు . పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన కార్యక్రమాలు జూన్ 2 నాటికి పూర్తి చేయాలని అన్నారు గ్రామాలలో నాటిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో నాటిన మొక్కలను 85% ఈ విధంగా చూడాలి అని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో చుట్టుపక్కల వ్యవసాయ రైతులు బోర్లు ఉంటే వాటి ద్వారా నీటి సరఫరా వాడుకుని రైతులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చెల్లించాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ సమ్మేళన కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ,జ హిరాబాద్ శాసనసభ్యులు మాణిక్యరావు ,ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ ,జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు జిల్లాలోని సర్పంచులు, జడ్పిటిసి సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ,గ్రామ సర్పంచులు జిల్లా లోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started