రసవత్తరంగా పాపన్నపేట సొసైటీ ఛైర్మెన్ ఎన్నిక

లోకల్ టైమ్స్,పాపన్నపేట్ ;మండల పరిధిలో మూడు సొసైటీలు ఉండగా ఆదివారం నాడు రెండు సొసైటీలకు చైర్మన్ ఎన్నికలు జరగగా, పాపన్నపేట సొసైటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే ,కాగా సోమవారం నాడు చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా, రాజకీయ ,నాటకీయా ల మధ్య చైర్మన్ ఎన్నిక కొనసాగింది .వైస్ చైర్మన్ ఎన్నికకు ఓకే ఒక్క నామినేషన్ రావడంతో వైస్ చైర్మన్ గా గుని శెట్టి మల్లేశం గుప్త ఎన్నిక అనివార్యం అయింది .చైర్మన్ ఎన్నికకు పుల్లన్న గారి మోహన్ రెడ్డి, గడిల శ్రీనివాస్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ వేయడానికి రెండు వర్గాలుగా విడిపోయిన డైరెక్టర్ లు క్యాంపు నుండి వేరు వేరుగా వివిధ వాహనాల్లో సొసైటీ కార్యాలయానికి చేరుకు నే సమయంలో సొసైటీ ఆవరణలో రాజకీయ నాయ కులు, ప్రజలతో ప్రాంతమంతా సందడిగా మారింది. అరుపులు కేకల మధ్యపోలీసు బందోబస్తు నడుమ డైరెక్టర్లు ఉదయం నామినేషన్ దాఖలు చేసినఅనంతరం ఓటింగ్ కు వెళ్లారు. ఓటింగ్ అనంతరం ఎన్నిక అభ్యర్థి మోహన్ రెడ్డికి 8ఓట్లు వచ్చాయని ప్రత్యర్థి అయిన శ్రీనివాస్ రెడ్డికి నాలుగు ఓట్లు వచ్చాయని దీంతో మోహన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు.అనంతరం ఎన్నికల అధికారి ధ్రువపత్రాలు అందజేశారు.
