ప్రకృతి రక్షణ కై ప్రతి పౌరుడు పాటుపడాలి: చందన దీప్తి ఐ.పి.యస్

మెదక్ లోకల్ టైమ్స్ ప్రతినిధి; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా యస్.పి. చందన దీప్తి ఐ.పి.యస్ ఆదేశానుసారం మెదక్ జిల్లాలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో, పరేడ్ గ్రౌండ్లో, జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు యెస్.పి .డి. నాగరాజు తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది కలిసి పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా యెస్.పి చందన దీప్తి ఐ.పి.యస్ మాట్లాడుతూ… తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాద్యత అని, ప్రకృతి రక్షణ కై ప్రతి పౌరుడు పాటుపడాలని, ఇప్పుడు నాటిన మొక్కలే రేపటి భావితరాలకు చెట్లుగా మారి రాబోయే కాలంలో ప్రకృతి రక్షణకు ఇవి ఏంతో దోహదపాడుతాయని అన్నారు. అలాగే ఇది ఒక పనిగా కాకుండా సామాజిక భాద్యతగా భావించి ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని కోరారు. అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను కాపాడాలని, వాటిని మనం కాపాడితే అవి మనకు జీవితాంతం ప్రాణవాయువును అందిస్తాయని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు భాద్యతగా మొక్కలని మరియు పర్యావరణాన్ని సంరక్షిన్చుకోవాలని తెలిపినారు. మెదక్ జిల్లా పరిధిలోని ప్రతి అన్నీ పోలీస్ స్టేషన్ల అధికారులు పోలీస్ సిబ్బంది, అందరూ ఈరోజు మొక్కలు నాటరని తెలిపారు. మెదక్ జిల్లా పరిధిలో మొత్తం 970 మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. భావితరాలను కాపాడాలంటే మొక్కలు నాటి కాలుష్యాన్ని పారదోలాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

