మొక్కలు నాటి కేసీఆర్ పుట్టినరోజు ఘనంగా వేడుకలు

తెరెసా జిల్లా నాయకులు ఆత్మకూర్ నాగేష్
సంగారెడ్డి లోకల్ టైమ్స్ ప్రతినిధి;సదశివపేట్ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జెర్పుకున్నారు మండల పట్టణ TRS నాయకులు, ఈ సందర్బంగా కంబాలపల్లి గ్రామములో రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటి ముఖ్యమంత్రి గారి పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్బంగా ఆత్మకూర్ నాగేష్ మాట్లాడుతూ మా నాయకుడి పుట్టిన రోజు సందర్బంగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాని కలిపించే ప్రయత్నం చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని, కేసీఆర్ ఇంకా ఇలాగే ఆరోగ్యంతో ఉండి ఇంకా వచ్చే 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించాలి అని కోరినారు.కంబాలపల్లి గ్రామ సర్పంచ్ శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన ఈ స్ఫూర్తి తో మనిషికి ఒక్క పది చెట్లు చొప్పున గ్రామ కూడలిలో మొత్తం చెట్లు నాటుదాం అని కొరినారు.కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ, గ్రామ వార్డ్ సభ్యులు, గ్రామ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
