లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణంలోని ఫేస్ మా వీధిలో గల 20 ముస్లిం కుటుంబాలకు ప్రముఖ వైద్యులు డాక్టర్ తన్నీరు మల్లికార్జున్ అందించిన చేయూత తో బిజెపి నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు నిరంతరం పేదలకు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చారాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఆరిప్ుద్దీన్ జిల్లా నాయకులు కళ్యాణ్ మువ్వల భూశయ్యజొన్నాదుల రాఘవులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం పంతులు నేటితరానికి స్ఫూర్తిప్రదాత జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్
లోకల్ టైమ్స్ ఒంగోలు; దివంగత నేత టంగుటూరు ప్రకాశం పంతులు63 వ వర్ధంతి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని ప్రకాశం పంతులు విగ్రహానికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జాయింట్ కలెక్టర్లు ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరాలు మారినా చేత దానికైనా ప్రకాశం పంతులు మార్గాన్ని చూపే స్ఫూర్తి ప్రదాత అని అన్నారు .అదేవిధంగా కందుకూరు రోడ్ లోగల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి బ్రాహ్మణ ఆర్యవైశ్య సంఘ నాయకులతో పాటు పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మార్కాపురం అద్దంకి దర్శి తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; మార్కాపురం డివిజనల్ అటవీ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి డివిజనల్ అటవీ శాఖ అధికారి మహబూబ్బాషా బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.
పీలేరు, మే 20;ఈ రోజు చిత్తూరు జిల్లా పీలేరు పట్టణము ప్రముఖుడు షామియానా షఫీ తనయుడు వై.ఎస్.ఆర్.సీ.పీ యువ నాయకుడు జావీద్ ఆధ్వర్యములో రంజాన్ కానుకగా 200 మందికి నాణ్యతగల ఒక చీర, షేమియా పాకెట్టు తోపాటు ఖార్జురం, ముంతమామిడి పప్పు, ద్రాక్ష అందచేశారు. ఈ సందర్బంగా జావీద్ మాట్లాడుతూ అల్లా దయవల్ల అందరూ కరోనా బారిన పడకుండా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు కందుకూరు ప్రాంత ప్రజలు ఘన నివాళులర్పించారు బుధవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 63వ వర్ధంతి కార్యక్రమం కందుకూరు లోని రోడ్ లోగల ప్రకాశం పంతులు సమీపంలో ఆంధ్రకేసరి సేవాసమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి సేవాసమితి అధ్యక్షులు మంచి రాజు మురళీమోహన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కోశాధికారి శ్రీనివాసమూర్తి కాళి దాసు రామ్ చంద్ర ప్రసాద్ మాధవరావు పినంరాజు ప్రభాకర్రావు సుబ్బారావు చలం చర్లసుబ్బారావు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల అధినేత కంచర్ల రామయ్య విష్ణువర్ధన్ వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాసరావు వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; నాలుగు రోజుల క్రితం కందుకూరు మండల పరిధిలోని మోపాడు పాడు గ్రామ సమీపంలో జరిగిన డాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గ్రామానికి చెందిన కంచర్ల సుబ్బులు(63) మృతి చెందారు. ఈ విధంగా ఉన్నాయి నాలుగు రోజుల నుంచి వైద్యశాలలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులు తమ నివాసానికి మంగళవారం తీసుకొని రాగా బుధవారం మృతి చెందారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; విభజించి పాలించు అనే బ్రిటిషు వారు స్వాతంత్రం వచ్చిన తదుపరి మన దేశం విడిచి వెళ్ళిన ఆ వారసత్వాన్ని నేటి పాలకులు కొనసాగిస్తూ బలహీన వర్గాల ప్రజలు కుల మత ప్రాంతాల నుంచి పరిస్థితుల్లో జర్నలిస్టులు కూడా ఐక్యత దెబ్బతీసేందుకు అదే ఆట ఆడుతూ రాజకీయ చదరంగంలో జర్నలిస్టులను చేస్తున్న పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. కందుకూరు నియోజకవర్గంలో దశాబ్దకాలంగా జర్నలిస్టుల చిన్న పెద్ద అనే తేడా కులాల ఆత్మాభిమానం విలువలు తదితర అంశాలతో జర్నలిస్టులు గ్రూపులుగా విడిపోయిన ఏదైనా సమస్య వచ్చిన సమయంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగిన సమయంలో అందరూ ఒక్కటై ముందుకు సాగుతున్న చరిత్ర కందుకూరి గతంలో ఉండేది.. అదే విధంగా బలమైన యూనియన్ ప్రతినిధులు కందుకూర్ లో ఉన్నారు. అయితే గత కొంత కాలంగా పాలకులు చేస్తున్న రాజకీయ చదరంగంలో కొంతమంది విలేకరులు మేమే గొప్ప పాలకుల మెప్పు పొందేందుకు జర్నలిస్టుల మధ్య విభేదాలు రోజురోజుకు పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్ట్ అంటే తప్పు జరిగితే తప్పు అని మేలు జరిగితే మేలే ప్రజల్లో చైతన్యం కోసం పని చెయ్యాల్సిన కనీస బాధ్యత ఉంది అయితే కొంతమంది పుణ్యం సమాజం నుంచి పాలకులు తమ కోసమే పని చేస్తున్నారని ఆరోపణలు గతంలో ఉన్నాయి. ఈ క్రమంలో జర్నలిస్టుల ఐక్యతకు పాలకులు చేస్తున్న చదరంగంలో జర్నలిస్టులు నిరంతరం ముందుకు సాగుతున్నారు. గత మూడు నాలుగు సార్లు కార్యక్రమాల్లో ఒక వర్గాన్ని పాలకులు ముందుకు తీసుకు వచ్చి మరో వర్గాన్ని నచ్చడంతో ఈ బేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ముందు ముందు జర్నలిస్టులకు ఏదైనా సమస్య వచ్చినా ఐక్యంగా ముందుకు సాగుతున్న ఆలోచనతో ఈ విధమైన చర్యలకు పూనుకున్నారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గొప్పగానే ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఏ వార్తా కథనాలు వచ్చినా ఆమె నొప్పి గా మారి సమస్యగా పరిణమించే అవకాశం ఉంది .ఎప్పటికైనా జర్నలిస్టులు అందరూ ఐక్యంగా తమ సమస్యలపై పోరాడాలి మెప్పుకోసం కార్యక్రమాలు నిర్వహించటం అంత పద్ధతి కాదని అభిప్రాయాలున్నాయి. కార్యక్రమాలు కొంతమంది కార్యక్రమాలకు దూరంగా ఉండటం జర్నలిస్టులు ఐక్యత లేదని ఇప్పటికే వస్తుంది .మరల మరల అలాంటి కార్యక్రమాలు చేసే సందర్భాల్లో భవిష్యత్తులో జర్నలిస్టు అంటే వాడిని తిట్టినా కొట్టినా అడిగేవాళ్లు లేరు వారిలో ఐక్యత లేదు అని సామాన్యులు సైతం లెక్కచేయక దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది ఆలోచించండి.. పాలకులు వేసే రాజకీయ చదరంగంలో అడుగులు ముందుకు వేసి బలిపశువులు కావద్దు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; సంతనూతలపాడు మండల పరిధిలోని సండ్ర పాలెం సమీపంలో గల సాగర్ కాలువ లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. ఈసందర్భంగా ఎస్ఐ దాసరి రాజారావు మరియు సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; పొదిలి పట్టణంలో పొగాకు వేలం కేంద్రంలో నిర్వహిస్తున్న పొగాకు కొనుగోలును మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వేల నిర్వహణ అధికారులు ఆయన మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు గిట్టుబాటు ధర అందించాలని సూచించారు. రైతు లేనిదే మనము ఏమని పొగాకు బోర్డు లేవని ఉద్యోగాలు లేవని లేవని గుర్తుంచుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు.
కోవిద్ సమయంలో శ్రమించిన కందుకూరు పోలీసులకు అభినందనలు జిల్లా ఎస్పీ సిద్దార్థ
లోకల్ టైమ్స్ ఒంగోలు; ఫిబ్రవరి నెలలో కందుకూరు పట్టణం లో టిడిపి నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చదలవాడ కొండయ్య పై జరిగిన హత్యాయత్నంకేసును కందుకూరు పోలీసులు వేధించినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ కందుకూరు పట్టణంలోని చర్చి వివాదమే దానికి కారణమని అన్నారు. చర్చి వివాదంలో ఒక వర్గానికి చెందిన సుజయ్నెల్లూరు జిల్లా కావలి చెందిన ముగ్గురు వ్యక్తులకు రెండు లక్షల రూపాయలు తన అ ను చరుల చేత కొండ య్యహత్య చేసేందుకు కుట్ర పన్నారని వివరించారు. చర్చిలో రెండు వర్గాల మధ్య 2015 సంవత్సరం నుంచి వివాదాలు ఉండగా ఆనాటి డిఎస్పి ఇరు వర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ క్రమంలోనే విజయ్ తండ్రి మరియు అతని బాబాయ్ విక్టర్ మధ్య వివాదాలు ఏర్పడ్డాయని చర్చిలో నిరంతరం ఘర్షణ పడే వారని అన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న చర్చిలో వివాదం జరిగిందని ఆ కక్ష పెంచుకున్న సుజయ్ తన అంశతో చేత నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చారా అని 15వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని ఆ క్రమంలోనే కొండ పై దాడి చేశారని అన్నారు. ఈ క్రమంలో కందుకూరు పోలీసులు కోవిద్ఉన్నా నిరంతరం ప్రేమించే నిందితులుగా భావిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు అని అన్నారు. సొసైటీ నెల్లూరు జిల్లాలో నేర చరిత్ర ఉందని అదే విధంగా అతని అనుచరులకు చరిత్ర ఉందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని తదుపరి పూర్తి వివరాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. శ్రమించిన కందుకూరు పోలీసులును ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కందుకూరు డిఎస్పి కందే శ్రీనివాసులు ఇ తర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: మార్కాపురం మండల పరిధిలోని రాయవరం గ్రామంలో మెడికల్ కళాశాలకు అవసరమైన స్థలాన్ని అధికారులు గుర్తించగా ఆ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ బుధవారం పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల ఏర్పాటు ఈ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యానికి భద్రత ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగార్జున్ రెడ్డి rdo శేసి రెడ్డి తాసిల్దార్ రమేష్ పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: గుడ్లూరు మండల పరిధిలోని చేవూరు చెక్ పోస్ట్సమీపంలో కందుకూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు అందించిన చేయూత వల్ల కూలీలకు ఎమ్మెల్యే మానుగుంట మహీధరర్రెడ్డి బుధవారం ఆహారం నీరు మందులు ఇతరములు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం జర్నలిస్టులు చేస్తున్న చేయూత కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కొండేపి మండల పరిధిలోని చిన్న కండ్లగుంట గ్రామంలో దళిత భోజన మహా సంఘం జాతీయ నాయకులు కొండ కోటయ్య బుజ్జి పేదలకు నిత్యావసర సరుకులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలో పేదలకు ప్రతి ఒక్కరు చేయూత అందించాలని పిలుపునిచ్చారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణంలోని బృందావనానికి చెందిన దళిత బహుజన సంఘాల నాయకులు నిరంతరం బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగ విరమణ తదుపరి నిరంతరం శ్రమించిన దళిత వర్గానికి చెందిన ప్రసాద్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. మృతి పట్ల దళిత బహుజన సంఘాలతో పాటు ఆయన సహచరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు సంతాపం తెలిపారు.
నెల్లూరు జిల్లా..లోకల్ టైమ్స్; ప్రజలంతా కరొనతో భయపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురైతున్న తరుణంలో దాతల సహకారం మరువలేదని నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎ జయప్రకాష్ అన్నారు .బాలాజీనగర్లోని డాక్టర్ శివ అంధుల పాఠశాల మరియు వేదాయపాళెం త్యాగరాజనగర్ లోని స్వర్ణ దీపం వికలాంగుల వసతి గృహంలో మంగళవారం జర్నలిస్టుఎడిటర్ రాజేష్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రస్తుతం తీవ్ర కష్టనష్టాలకు లోనయ్యారని కరోనా వల్ల ఎంతో మంది మృతిచెందారని మరెందరో ఆసుపత్రి పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు దాతలు ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని వారందరికీ రాజేష్ కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో లా కాలేజీ ప్రిన్సిపాల్ జయ చంద్రబాబు .రిటైర్డ్ ఎమ్మార్ సాల్మాన్ .కల్యాణ్ .నవీన్. లాట్ సూపర్ మార్కెట్ అధినేత లక్ష్మి .వంశీకృష్ణ. వీఆర్ వొప్రసాద్ .జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ప్రతినిధి: డోర్నకల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ మరిపెడ మండల వాసి తల్లా ఊకల్ గ్రామానికి చెందిన అది పేదరికంలో పుష్పించిన గిరిజన బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ కోసం కొట్లాడిన యోధుడు రవీందర్ నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అతికష్టమైన ఆంగ్ల విద్యను పీహెచ్డీ పూర్తి చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగం రాదేమోనని కన్న తల్లిదండ్రుల కష్టాలను తీర్చలేదని జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఊకాల్ గ్రామానికి రవీందర్ మృతదేహం దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ రామచంద్రనాయక్ నివాళులర్పించి వరకు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రనాయక్ మాట్లాడుతూ గిరిజనుల గిరిజన రంగమైనా చదువుకున్నా విద్యార్థులైన వారి బాధలు తెలుసుకుని నాదులే లే కరువయ్యారని ఆ పోయారు. చదువుకున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారని ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కోట్ల ఉద్యోగాలు సాధించుకోవాలని మనల్ని పాలించే పాలకులు చేతులెత్తేశారు. కాబట్టి వారి పైన తిరుగుబాటు చేయడం మళ్లీ ఉద్యమాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. నిజంగా తెలంగాణ సమాజం దోపిడీదారుల పాలనలోకి పోయిందని దోపిడి దారుల నుండి తెలంగాణ సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వారు అన్నారు. ఒక గిరిజన విద్యార్థి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం గాని స్థానిక అధికార పార్టీ నాయకులు గానీ ఎవరూ రాకపోవడం విడ్డూరమని ఆయన విమర్శించారు.నిరుద్యోగుల పైన చిన్నచూపు చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ సమాజం బుద్ధి చెప్పే రోజు వచ్చినది అని వారన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కుటుంబానికి అండ దండ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ అమరుల త్యాగాల తో గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధి తొందర్లోనే ప్రజలు కొడతారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు మంత్రులు గిరిజనుల పక్షాన మాట్లాడాలని ఆయన అన్నారు.
లోకల్ టైమ్స్…ప్రకాశం జిల్లా: కందుకూరు లాక్ డౌన్ మొదలయిన నాటి నుండి ఈ విపత్తు కాలంలో ఒక్క పిలుపుతో నియోజకవర్గ ప్రజానీకానికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి వారు పడుతున్న ఇబ్బందులను సహాయం అందించడానికి ముందుకు వచ్చిన నాలుగు వందల మంది దాతలకు చేతులెత్తి నియోజకవర్గ ప్రజలకు తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దాతలు అందజేసిన విరాళాలు కోటి 30 లక్షల రూపాయలు ఇందులో కడు పేద వారు చిన్న సన్నకారు రైతాంగం వారు కూడా చాలా పెద్ద మనసుతో ఈ విపత్తు ను గుర్తించి చేసిన సహాయానికి చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దాతలు ఇస్తున్న విరాళాలు సక్రమంగా వినియోగం జరుగుతున్న విషయాలను తెలియపరిచే బాధ్యత మన అందరిమీద ఉన్నది మన నియోజకవర్గ ఏరియా హాస్పిటల్ ఇటు కొండేపి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లా కొండాపురం మండలంనికి ఆనుకొని ఉన్నది కాబట్టి మన ఏరియా హాస్పిటల్ లో ప్రసవాల సమయంలో పేద తల్లి బిడ్డల ఆరోగ్య సంక్షేమం కోసం అన్ని వసతులు ఉండాలని దానికి సంబంధించి ఖర్చు ను ఈ నిధుల నుండి అందజేస్తాము అని అన్నారు. ఉలవపాడు మండలం నాలుగు గ్రామాల ఎస్టీ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసాము మిగతా రెండు వేల కుటుంబాలకు ఈ నిధుల ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తామని అన్నారు. 108 వాహనాల ఉద్యోగులు మూడు నెలల నుండి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని నిర్ణయించాము కోరం టైం సెంటర్లో 50 రోజుల నుండి నిర్విరామంగా పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది కి వారి కుటుంబాలకు సహాయం అందజేస్తామని అన్నారు. ఒంటరి మహిళలకు 65 సంవత్సరాల వృద్ధులకు ఈ నిధుల ద్వారా వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు వైసిపి పట్టణ అధ్యక్షుడు రఫీ పాల్గొన్నారు
కందుకూరు నియోజకవర్గ పరిధిలో ప్రజల అవసరాల కోసం వినియోగించనున్న వైనం..
ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీ నేతలతో చర్చించిన ఎమ్మెల్యే మహీధర రెడ్డి
వైద్యశాల అభివృద్ధికి చేయూత
గిరిజనులకు వినియోగం
వృద్ధులు ఒంటరి మహిళలకు చేయూత
వికలాంగులకు వీల్ చైర్ లు
ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్
లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు నియోజకవర్గ పరిధిలో సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 18 వరకు దాతలు అందించిన కోటి 31 లక్షల పైచిలుకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీ నేత వెంకటేశ్వర్లు డిఎస్పి కార్యాలయానికి పిలిపించి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాల అభివృద్ధికి కొంత చేయూత అందించాలని నిర్ణయం తీసుకున్నారు .అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని గిరిజన కుటుంబాలకు ఆసరాగా నిలవాలని నిర్ణయించారు ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులు మరియు ఒంటరి మహిళలకు నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించారు. అదేవిధంగా వికలాంగులకు వీల్చైర్ లు 108 సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ హిజ్రాలకు చేయూత రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పరిధిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టకాలంలో చేయూత అందించిన దాతలు పైసా ప్రజల అవసరాల కోసం పేదలకు చేయూతనిచ్చేందుకు వినియోగించడం ఉన్నామని అన్నారు. పిదికితి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మంచి నిర్ణయం అని అన్నారు. ప్రతి ఒక్కరు పేదలకు చేయూత చేయాల్సిన అవసరం ఉందని పార్టీలకు అతీతంగా చేయూత అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ కండే శ్రీనివాసులు ఏరియా వైద్యశాల సూపర్డెంట్్ ఇ ఇంద్రాణి వైసీపీ నాయకులు తోకల కొండయ్య రపి పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; కష్టకాలంలో దాతల చేయూత మరువలేనిదని ఎమ్మెల్యే మహీధ రర్రెడ్డి అన్నారు మంగళవారం కందుకూరుడిఎస్పి కార్యాలయ ఆవరణంలో ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన చీమకుర్తి కృష్ణారెడ్డి 25 వేల రూపాయలను అదే గ్రామానికి చెందిన వార్డు సచివాలయ ఉద్యోగులు 13,500 రూపాయలను మహీధర్ రెడ్డి సమక్షంలో డిఎస్పీ శ్రీనివాసులు కు అందజేశారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: లగ్గం కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మంగళవారం కందుకూరు తాసిల్దార్ కార్యాలయం సమీపంలో బౌతికదూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం తాసిల్దార్ బి శ్రీనుకు వినతిపత్రం అందజేశారు .ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పడకండ్ల ప్రసాద్ బాలబ్రహ్మచారి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ వడ్రంగం కమ్మరం కంచరం అదేవిధంగా స్వర్ణ పనులు చేస్తున్న విశ్వ బ్రాహ్మణులు గత 60 రోజులుగా ఉపాధిలేక ఉంటున్నారని కనీసం ఇంటి అద్దెలు చెల్లించలేక ఉన్నారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక చేయూత అందించాలని తాసిల్దార్ కు వివరించారు. స్పందించిన తహశీల్దార్ అంశాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్ డౌన్ కందుకూరు ప్రాంతంలో ప్రతిరోజు నిరంతరం పేదలకు ఆహారం అందజేస్తున్న వాసవి సేవాదళ్ నిర్వాహకులు 57వ రోజు కూకట్పల్లికి చెందిన యువ వ్యాపారవేత్త మధుబాబు కందుకూరు పట్టణానికి చెందిన లక్ష్మీ వాచ్ మొబైల్ కేశవ వలస కూలీల ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి వెంకట కేశవరావు సుబ్బారావు ఆర్ వెంకటేశ్వర్లు పెంచల్ రెడ్డి పసుపులేటి పాపా రావు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: సింగరాయకొండ పట్టణంలో ఎక్సైజ్ సీఐ లాటా ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా టీవీఎస్ వాహనంలో తరలిస్తున్నారు విస్కీ బాటిల్ ను స్వాధీనపరచుకొని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కందుకూరు కు చెందిన ఎస్.కె హుస్సేన్ అరెస్టు చేసి అతని వద్ద ఉన్న ఆరు విస్కీ బాటిల్ లో మద్యం తరలించడానికి వినియోగించిన టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన పరిటాల సుధాకర్ మరియు సి హెచ్ డి నరేష్ నుంచి విస్కీ మద్యం బాటిల్ వాటర్ సైకిల్ ను స్వాధీనపరుచుకున్నారు. కందుకూరు కు చెందిన అదుపులోకి తీసుకొని అతని నుంచి పది విస్కీ బాటిల్ స్వాధీనపరుచుకున్నారు .మొత్తం కేసుకు సంబంధించి నలుగురు 32 మోటార్ వెహికల్ ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పద్మజ సిబ్బంది రమణ డి వెంకట్రావు వెంకట్రావు కే శ్రీనివాసులు శ్రీనివాసులు పాల్గొన్నారు.
భూమిలో మాకు వాటా కావాలంటూ దౌర్జన్యానికి దిగి కర్రలతో దాడి..కర్రె నర్సింలు పై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి: కర్రేబిక్షపతి కుటుంబ సభ్యులు
లోకల్ టైమ్స్ ప్రతినిధి :నర్సాపూర్ నియోజవర్గంలోని శివంపేట మండలం గొట్టి ముక్కల గ్రామంలో సర్వే నంబర్ 127 లో మూడు ఎకరాలు భూమి లో సుమారు ఐదు సంవత్సరాలుగా కర్రే బిక్షపతి , పట్టాదారుగా వ్యవసాయం మరియు చిన్న తరహా లో మొక్కలను నాటి నర్సరీ గా పెంచుతూ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. గత సోమవారం ఉదయం ట్రాక్టర్ల సహాయంతో పంట దున్ని మొక్కజొన్న వేద్దామని అక్కడికి కుటుంబ సభ్యులతో పంట భూమికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన కర్రె నర్సింలు సోమవారం ఉదయం పట్టదారుని పై కర్రె బిక్షపతి కుటుంబ సభ్యులతో అక్కడకి వెళ్ళాడు. ముందుగా భూమిలో దౌర్జన్యంగా వెళ్లి పంట భూముల్లో మాకు కూడా వాటా కావాలంటూ టాక్టర్లను ఇక్కడినుంచి తీసుకెళ్ళి పోవలంటూ వాగ్వాదానికి దిగారు .మీ భూమి లో మాకు వాట ఇవ్వలేదంటే మిమ్మల్ని కొట్టి చంపేస్తామంటూ ఈ ఊరిలో మిమ్మల్ని బ్రతకనివ్వము అని కర్రే బిక్షపతి ని కర్రె నర్సింలు వారి కుటుంబ సభ్యులు మల్లయ్య, రాములు , పోచయ్య, కృష్ణ, బుచయ్య, ఎల్లమ్మ, సత్యమ్మ, లక్ష్మి, లు కర్రలతో రాళ్లతో బిక్షపతి కుటుంబంపై గొడవ కి దిగారు. దాంతో ఒక్కసారిగా ఇరువురి వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో కర్రే బిక్షపతి కి తలకు బాగా గట్టిగా కర్రతో నర్సింలు బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కర్రే రాములమ్మ , కర్రీ లక్ష్మి , అతని కుమారుడు మురారి కి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు బిక్షపతి మాట్లాడుతూ మా సమస్యను పరిష్కరించి మా పంట భూమిని రక్షించి మమ్మల్ని ప్రాణాలతో కాపాడాలి అంటూ శివంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అయినా కూడా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదని, ఇప్పటికైనా మా పై జరుగుతున్న దౌర్జన్యం దాడిని ఉన్నత అధికారులు గుర్తించి ఇట్టి దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొని మమ్మల్ని ప్రాణాలతో కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: సంతనూతలపాడు మండల పరిధిలోని ముంగమూరు సమీపంలో గల సాగర్ కాలవలో కారు ప్రమాదవశాత్తు బోల్తా పడిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీసుకు రావడంతో పాటు వైద్యశాలకు తరలించారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్వారం టైన్ లోని ప్రజలకు కందుకూరు ఎస్బిఐ అందించిన చేయూత ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి మంగళవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరు మహనీయుల అని అన్నారు నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పేదలకు ఇతరులకు ప్రభుత్వానికి చేయూత నిస్తున్న దాతలకు కొదవలేదని ఆయన అన్నారు .ఇదే స్ఫూర్తిని ముందు ముందు కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తోకల కొండయ్య రపి గంగిరెడ్డి వసంతరావు ఎస్బిఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్వారం టైన్ లోని ప్రజలకు కందుకూరు ఎస్బిఐ అందించిన చేయూత ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి మంగళవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరు మహనీయుల అని అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పేదలకు ఇతరులకు ప్రభుత్వానికి చేయూత నిస్తున్న దాతలకు కొదవలేదని ఆయన అన్నారు. ఇదే స్ఫూర్తిని ముందు ముందు కొనసాగించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తోకల కొండయ్య రపి గంగిరెడ్డి వసంతరావు ఎస్బిఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: దరిశి పట్టణ పరిధిలోని పొదిలి రహదారిలో గల కెనాల్ లో మద్దాలి కోటేశ్వరరావు(65) అనే వ్యక్తి మృతదేహం అనుమానాస్పదంగా మంగళవారం వెలుగుచూసింది .పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: వేసవి దృష్ట్యా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ తాగునీటి సమస్యను పరిష్కరించాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ ఓబులేషు నియోజకవర్గ పరిధిలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ముందస్తు జాగ్రత్తగా తాగునీటి పథకాలను ముందుగా పరిశీలించి ఏవైనా ఉంటే తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ఏ ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు గుర్తించి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కొండేపి మండల పరిధిలోని పే ట్లురు గ్రామంలోగ్రామం ఉరి చివర బావిలో, ఎక్స్పైరీ పూర్తి అయిన పురుగు మందులు తగలబెట్టిన షాపు యజమాని. గ్రామంలోకి విపరీతం గా పొగ రావడం తో పలువురు చిన్నారులకు,కళ్ళు తిగిగి, అస్వస్థత.. ఒక్కసారి గా ఉలిక్కి పడ్డ పెట్లూరు గ్రామస్తులు. ఊరిలో నుండి బయటకు పరుగులు తీసి అధికారులు కు పిర్యాదు చేసిన గ్రామస్తులు ఘటనా స్థలం లోకి చేరుకొని మంటలు అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది.
లోకల్ టైమ్స్ ఒంగోలు: పొట్టకూటి కోసం మహారాష్ట్రకు వలస వెళ్లిన 400 మంది కూలీలకు మోక్షం లభించింది. టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చొరవ తీసుకుని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి వీరిని సొంత గ్రామాలకు తీసుకుని రావడానికి ప్రభుత్వం నుంచి రూ 10 లక్షలు విడుదల చేయించారు. ఈ మేరకు ప్రభుత్వం జీ ఓ ఆర్ టి నెంబరు 459 విడుదల చేసింది. వలస కూలీలను తీసుకుని రావడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టరు ను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రకాశం జిల్లా లోని చీమకుర్తి, కొండపి, పొదిలి, దర్శి, మర్రిపూడి మండలాలకు చెందిన 400 మంది పేదలు నవీ ముంబైకి సమీపంలోని రాయఘడ్ జిల్లా తలోజా ప్రాంతానికి పనుల కోసం వలస వెళ్లారు. వీరంతా అక్కడ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోయాయి. తిండికి కూడా ఇబ్బంది ఏర్పడింది. చిన్న గదుల్లో నలుగురు ఐదుగురు ఉంటున్నారు. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉంది. దీంతో వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడున్న కొంతమంది వారి భాధలు, ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా టీటీడీ చైర్మన్్రీ వైవి సుబ్బారెడ్డి విన్నవించుకున్నారు. తమను ఎలాగైనా స్వగ్రామాలకు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. శ్రీ సుబ్బారెడ్డి ఈ సమస్యను ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు.వలస కూలీలను తీసుకురావడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు..కోవిడ్ 19 రాష్ట్ర నోడల్ ఆఫీసర్ శ్రీ కృష్ణ బాబు తో కూడా టీటీడీ చైర్మన్ మాట్లాడారు. దీంతో సీఎం సహాయ నిధి నుంచి రూ 10 లక్షలు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తలోజా లో చిక్కుకున్న వలస కూలీలను వారి స్వగ్రామాలకు తీసుకుని వచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టరు ను ప్రభుత్వం ఆదేశించింది. తమ సమస్య పట్ల వెంటనే స్పందించి తమను ఆదుకున్న శ్రీ వైవి సుబ్బారెడ్డి ి వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.