లోకల్ టైమ్స్ ఒంగోలు: ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విద్యుత్ స్లాబ్ విధానాల్లో రద్దు చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు మంగళవారం ఒంగోలు నగరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు బీజేపీ నాయకులు ఒంగోలులో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నూతన విద్యుత్ విధానం వల్ల బిల్లులు అధికంగా నమోదయ్యే ప్రజలకు ఇబ్బందిగా మారిందని ప్రభుత్వం ఏ విధంగా ప్రజల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే నూతన విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: భౌతిక దూరం పాటించి కరోనా ను నియంత్రించడం మన బాధ్యత అని డిఎస్పి ఖండే శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉలవపాడు మండల పరిధిలోని వ్యాపారులతో ఆయన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదాయ పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరుణ వ్యాధి నివారణ నియంత్రణ చట్టం పైన ఆధారపడి ఉందని మందులు లేవని ప్రతి ఒక్కరు మాస్కు ధరించి నిరంతరం సంచరిస్తే నియంత్రించవచ్చని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎస్ ఐ దేవ కుమార్ పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కష్టకాలంలో ఉన్న పేదలకు చేయూతను అందించడం సమాజంలోని అందరి బాధ్యత అని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు సోమవారం కందుకూరు పట్టణంలోని శివాలయం ప్రాంతంలో జరిగిన అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఉలవపాడు మండలం పంచాయతీ లో గల లో జరిగిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పేదలకు అన్నదానం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గ పరిధిలో కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లోన దాతలుి వైసిపి నాయకులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; కరోనా మహామ్మారిని నియంత్రణ కోసం మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను ఎలాంటి సంజాయిషీ అడగకుండా, చార్జి మెమో ఇవ్వకుండా, ప్రభుత్వమే ఒక దళిత ఉద్యోగి పట్ల అమానుషంగా వ్యవహరించడాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు మెడబలిమి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. డాక్టర్ సుధాకర్ ని పెడరెక్కలు విరిచి చేతులను కట్టివేసి లాఠీలతో కొట్టి, హింసించిన ప్రభుత్వం అతనికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, సుధాకర్ పై ఉన్న సస్పెన్షన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ గారిని సస్పెండ్ చేసి ఆయన మానసిక రోగిగా మారటానికి నేటి ప్రభుత్వ పెద్దలు, మరియు నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కారణమవ్వటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖరరెడ్డి పైన అభిమానంతో,లేక వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం అభిమానంతో 2019 ఎన్నికల్లో అదిక శాతం మా బహుజన సోదరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దలు దళిత సామాజిక వర్గానికి చెందిన వారిపై వివక్ష చూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దళితుల అభిమానంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే నాడు దళితుల పట్ల వివక్ష చూపడం, దళితుల భూములు బలవంతంగా లాగేసుకోవటం, సస్పెండ్ చేయడం, దళిత నేతలను వేదింపులకు గురిచేయడం ఎంత వరకు ఈ ప్రభుత్వానికి సమంజసమని ప్రశ్నిస్తున్నామని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దలు దళిత సామాజిక వర్గానికి ఇచ్చే గౌరవం,చేసే న్యాయం ఇదేనా? విశాఖ లో గ్యాస్ లీకేజీ అయిందని సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మంత్రులనూ, అధికారులను అప్రమత్తం చేసి మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక అందించడం జరిగిందని. నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలు సమీప గ్రామమైన నాగులప్పలపాడులో ట్రాక్టర్ కు విద్యుత్ తీగలు తగలడం వలన ప్రమాదం సంభవించి 10 మంది దళితులు చనిపోతే చనిపోయిన దళిత కుటుంబాలకు కేవలం 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించటం జరిగిందన్నారు. ఇతర సామాజిక వర్గాలవారి ప్రాణాలకు ఒక ఖరీదు. దళితుల ప్రాణాలకు ఒక ఖరీదా! ఎందుకు ? అన్ని సామాజిక వర్గాలవారు మనుషులే కదా? అందరి ప్రాణాలు విలువైనవే కదా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతరులతో సమానంగా దళితులకు పరిహారం ఇవ్వకుండా దళితుల పట్ల వివక్ష చూపడం ఎంత వరకు సమంజసమని బహుజన ఐక్యవేదిక తరపున ప్రశ్నిస్తున్నామని. జాతీయ ఎస్పీ ఎస్టీ కమిషన్ వారు ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలని. మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
మీరు సస్పెండ్ చేసిన దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
దళితుడైన డాక్టర్ పై లాఠీలతో కొట్టి, చేతులు వెనక్కి కట్టిన పోలీసులు అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి,చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
డాక్టర్కి మెరుగైన వైద్యం అందించి,అతనిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
డాక్టర్ సుధాకర్ సస్పెండ్ రద్దు చేయాలి.
విశాఖ లో మరణించిన వారితో సమానంగా దళితులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి, వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
బలవంతంగా లాక్కున్న భూములను దళితులకు అప్పగించాలి, దళితుల పైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.బహుజన ఐక్యవేదిక పక్షాణ డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సిపియం నాయకులు కొర్రపోలు గురవయ్య,బిఎస్పి నాయకులు రాచీటి ప్రసాద్,వికేసి నాయకులు తూమాటి అచ్చయ్య,యం ఆర్ పియస్ నాయకులు వినయ్,సుబ్బయ్య,అశోక్,దావీదు,తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: పెరిగిన విద్యుత్ బిల్లులో రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు సోమవారం పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేశాయి ఈ సందర్భంగా ఒంగోలు లో సిపిఐ సిపిఎం నాయకులతోపాటు న్యూడెమోక్రసీ సిపిఐ సిపిఎం మార్కాపురంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య ఆధ్వర్యంలో కనిగిరి లో సిపిఐ నాయకులు రవీంద్ర ఆధ్వర్యంలో కందుకూర్ లో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు సింగరాయకొండ లో సిపిఎం సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యంగా సిపిఐ కార్యదర్శి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా టంగుటూరు మండలం సిపిఐ సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దొడ్డి దారిన తీసి ప్రజల నెత్తిన భారాన్ని మోపింది.. విమర్శించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లోని వామపక్ష నాయకులు బాలకోటయ్య బి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
లోక టైమ్స్ ఒంగోలు: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో నాటుసారా అమ్ముతున్న వల్లభరెడ్డి.గురవయ్య (40) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న రాచర్ల SI త్యాగరాజు నాటుసారా అమ్ముతున్న వ్యక్తి నుండి 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అలానే రామన్న కతువ చిన్నగానిపల్లి వద్ద 100 లీటర్లు బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: ఉపాధి హామీ పానకం కొంత మందికి ఉపాధిని ఊరకే అందిస్తుందని కొన్ని విమర్శలు నిరూపణలు గతంలో జరిగిన మరలా అవే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి .పంచాయతీలోని పెద్దపల్లి పాలెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు సోమవారం పనికిరాని వ్యక్తులకు మస్టర్లు వేయడంపై ఫీల్డ్ అసిస్టెంట్తో వాదనకు దిగడం కాకుండా నిరసన కార్యక్రమం చేయటంతో ఉపాధిహామీ అవినీతి ఎంతవరకు ఉందో బోధపడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఉపాధి హామీ పథకం లోని అవకతవకలను అవినీతి ని వెలుగులోకి తీసుకు వచ్చి చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టైమ్స్ ఒంగోలు; కొమరోలు మండల పరిధిలోని అక్కపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో కొమరోలు చెందిన ఎస్.కె మహబూబ్బాషా (39)అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది ఆ గ్రామంలో నిమిత్తం వెళ్ళిన మహబూబ్బాషా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు
ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
కనిగిరి మండల పరిధిలోని ఏరు వారి పల్లి గ్రామంలో ప్రసన్న అనే ఇంజనీరింగ్ విద్యార్థిని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జరిగింది ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది
లోకల్ టైమ్స్ ఒంగోలు; ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కరోనా వైరస్ నివారణ నియంత్రణ, నాడు -నేడు, రైతు భోరసా, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కంటైన్ మెంట్ జోన్ ల్లో నిబంధనలు తప్పకుండా ప్రజలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజల సహకారంతో కరోనా వైరస్ ను అదుపుచేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్ అనుమానం వచ్చిన వ్యక్తి స్వచ్ఛంద గా హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళాడానికి అంగీకారo తీసుకోవాలని ఆయన తెలిపారు. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో అనుమానం ఉన్న వ్యక్తి కి హోమ్ ఐసోలాషన్ లో ఉండాలనే నోటీసు అధికారులు ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం విధిoచిన లాక్ డౌన్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించే విధంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వాలoటీర్లు ద్వారా చేపడుతున్న 4 వ విడత సర్వే ను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో నాడు నేడు కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదోడ్లు ,విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతు భోరసా కార్యక్రమం క్రింద అర్హులైన వారందరికీ పెట్టుబడి సహాయాన్నీ అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, డి.ఎస్.పి నాగేశ్వర రెడ్డి,ట్రైన్ డి.ఎస్.పి.స్రవంతి రాయ్, సి.ఐ రాఘవేంద్రరావు, డెప్యూటీవ్ డి.ఎం.హ్.ఓ పద్మావతి, ప్రభుత్వ వైద్య శాల సూపర్ ఇండెంట్ సుబ్బారెడ్డి, కంటైన్ మెంట్ నోడల్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్,రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కే.వీ పల్లె, మే 18; ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా కే.వీ పల్లె మండలంలోని గర్నిమిట్టలో మండల జడ్.పీ.టీ.సి గజ్జల శ్రుతి రెడ్డి చేతుల మీదుగా వేరుశెనగ విత్తనాలు రైతులకు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భముగా గజ్జల శ్రుతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని కరోనా వల్ల మన రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసినప్పటికీ 30 కిలోల బస్తా 940 రూపాయల సబ్సిడీతో అర్హులైన ప్రతి రైతుకు ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. పై కార్యక్రమములో మాజీ జడ్.పీ.టీ.సి జయరామచంద్రయ్య, వై.ఎస్.ఆర్.సి.పీ మండల నాయకుడు గజ్జల శీను రెడ్డి, అధికారులు ఏ.డీ శ్రావణి, అగ్రికల్చర్ అసిస్టెంట్ అనిల్ నాయక్, కిషోర్ కుమార్, రవి, గుణశేఖర్, మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
★తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన కంభం ఎస్సై మాధవరావు★
లోకల్ టైమ్స్ ఒంగోలు; ప్రకాశం జిల్లా కంభం టూ తర్లపాడు వెళ్లు మార్గంమధ్యలోని సూరేపల్లి గ్రామం సమీపం వద్ద మూడు వందల సంవత్సరాల చరిత్ర గల ఒక భారీ వృక్షం నేలకొరిగింది. సోమవారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు మూడు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ భారీ వృక్షం నేలకొరిగింది అయితే తర్లపాడు మీదుగా మార్కాపురానికి రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం తెలుసుకున్న కంభం ఎస్సై మాధవరావు. హుటాహుటిన పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.వెంటనే జెసిబి ని పిలిపించి తన సిబ్బందితో కలసి సహాయక చర్యలు చేపట్టారు ఒకపక్క వాతావరణ సహకరించకుండా ఇబ్బందిగా ఉన్నా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని. ఎస్సై మాధవరావు తక్షణమే సహాయక చర్యలు చేపట్టడం స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు…
లోకల్ టైమ్స్ ఒంగోలు; పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసిపి కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి మరియు పిి డి సి సి బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య అన్నారు. సోమవారం టంగుటూరు మండల కేంద్రంలో గల పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు తీసుకువచ్చిన పొగాకు వేలం నిర్వహణ అధికారులు ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారని వ్యాపారులు అది గుర్తించి గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి తోపాటు అధికారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; తర్లుపాడు మండల పరిధిలో ని సీతానగరం గ్రామ సమీపంలో ని పొలాలలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయ్యుల్ల ను si ఆవుల వెంకటేశ్వర్లు సోమవారం అరెస్టు చేశారు. వారినుంచి 8120 రూపాయిలు నగదును si స్వాధీన పరుసు కున్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చేతుల మీదుగా కందుకూరు నియోజకవర్గంలోని కరేడు ర్యామ్ప్ వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న వలస కూలీలకు ఆహారపోట్లాలు, మజ్జిగ బాటిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్టాల నుండి తమ సొంత రాష్టాలకు తరలి వెళుతున్న వలసకూలీలకు ఆకలి తీర్చే అవకాశం మాకు కలిగించిన భగవంతునికి,అలాగే వాసవి సేవాదళ్ టీం వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉలవపాడు MDO తేళ్ల రవికుమార్,SI దేవప్రభాకర్,ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు, చలంచర్ల సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్, p. పాపారావు, ఎం.బుచ్చయ్య గుప్తా, శశాంక్, అమర్నాధ్ పాల్గొన్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; త్రిపురాంతకం మండల పరిధిలోని రాజు పాలెం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో అచ్చు బొమ్మ ఆడుతున్న ముగ్గురు జూదరులను ఎస్సై కృష్ణయ్య సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 30 వేల నగదును ఆయన స్వాధీనపరుచుకున్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు; పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని వివి పాలెం తాసిల్దార్ కార్యాలయం సమీపంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీపీఎం నాయకులు సాదు.చేన్నకేశవులు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గోన్న సీపీఎం గుడ్లూరు ప్రాంతీయ కార్యదర్శి జీవీబీ కుమార్ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా 57రోజులుగా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే “మూలిగే నక్క పై తాటికాయ పడ్డ” చందంగా కరేంటు చార్జీలను భారీగా పేంచి సామాన్య ప్రజలపై భారం వేయటం సరికాదు అని ప్రభుత్వ వైఖరిపట్ల విమర్శ చేశారు.ఈ భారాలను మోయలేము తక్షణమే తగ్గించాలని కోరారు.ఈ కార్యక్రమం లో సీపీఎం నాయకులు పర్రే.భాస్కర్ రావు, దువ్వూరి. జాన్, మంగి.ఆశీర్వాదం,పారాబత్తిన .మహేశ్,L.బాబూరావు,K.రమణయ్య ,సీఐటీయూ నాయకురాలు సాదు.ప్రకృతాంబ తదితరులు పాల్గోన్నారు.
లోకల్ టైమ్స్ ప్రతినిధి; పరిమితంగా ప్రయాణికులు.. వ్యక్తిగత దూరం తప్పని సరి..
నేడు కేబినెట్ భేటీ లో నిర్ణయం..
ఇతర రాష్ట్రాలతో సమన్వయం తర్వాతే అంతర్రాష్ట్ర సర్వీసులపై స్పష్టత..
★ రాష్ట్రం లో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి.
★ మంగళవారం నుంచి ప్రజా రవాణా సేవలు ప్రారంభం కానున్నాయి.
★ కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడిపించాలని నిర్ణయించింది.
★ సోమవారం సాయంత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది.
★ ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వడంతో పాటు లాక్ డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహం పై సమావేశంలో చర్చించ నున్నారు.
★ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం లో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధి విధానాల పైనా చర్చించే అవకాశం ఉంది.
★ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ చేపట్టిన ప్రభుత్వం మార్చి నాలుగో వారం నుంచి బస్సులను నిలిపి వేసింది.
★ తాజాగా కేంద్రం వెసులు బాటు కల్పించడంతో మంగళవారం నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
★ ఆర్టీసీ వర్గాలకు దీని పై ఆదివారం రాత్రి సమాచారమిచ్చింది.
★ నేడు (సోమవారం) రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
★ ఈ సమావేశంలోనే బస్సుల నిర్వహణ ప్రణాళిక ను సిద్ధం చేసి సాయంత్రం జరిగే మంత్రి మండలి సమావేశంలో నివేదిస్తారని తెలిసింది.
★ దీని పై మంత్రి మండలి సమగ్రంగా చర్చించి, బస్సులు నడిపేందుకు అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
★ వాస్తవానికి ఇప్పటికే 50 శాతం బస్సులను తిప్పేందుకు కేంద్ర అనుమతులున్నా వ్యాధి వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం నడప లేదు.
★ తాజాగా రాష్ట్రం లో ఆరెంజ్, గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే భావిస్తోంది.
★ కంటెయిన్ మెంటు జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిచే బస్సు సేవలు, వాటిల్లో పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసు కుంటారు.
★ ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసు లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది.
ఉప్పల్, లోకల్ టైమ్స్ 18: అత్తింటి వేధింపులకు ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ కళ్యాణ పురి టీచర్స్ కాలనీ లో నివసిస్తున్న టీ. శ్రీలత (33) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏడేళ్ల క్రితం సతీష్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందు పెద్దల ఒప్పందం ప్రకారం అడిగినంత కట్నం బంగారం ఇతర వస్తువులు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగానే జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భర్త సతీష్ తరచు తాగి వచ్చి కొట్టి మానసికంగా హింసించడం తో పలుసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. అయినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రస్తుతం 5 ఏళ్ళ కుమారుడు ఉన్నారు. కుటుంబంను పోషించ కుండా డబ్బులు ఇవ్వమంటూ భార్య శ్రీలత ను కొట్టి ఇబ్బందులు పెట్టే భర్తకు అత్త ఆడపడుచులు సైతం సపోర్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం హింసలు భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని శ్రీలత ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ ఇన్స్పెక్టర్ రంగస్వామి తెలిపారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: సంతమాగులూరు మండల పరిధిలోని కొమ్మాలపాడు వద్ద అద్దంకి బ్రాంచి కాలువ లో మక్కెనవారిపాలెం సచివాలయ ఉద్యోగి ఈతకు వెళ్లి గల్లంతు..అతని పేరు సురేంద్ర కాలువలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పిన గ్రామ ప్రజలు
లోకల్ టైమ్స్ ఒంగోలు: దొనకొండ మండలం రుద్ర సముద్రం గ్రామానికి చెందిన గోన బాలరాజు గోన సుజాత లు గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చికాకులు కలగడంతో విడివిడిగా ఉందామని భర్త పలుమార్లు ప్రస్తావించడం తో సుజాత తన భర్త కు ఏదైనా గాలి సోకిందేమో అని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గ్రామానికి చెందిన ఒక పూజారి రుద్రసముద్రం లో ఉన్నాడని తెలుసుకొని సంప్రదించగా తాను వారం రోజులు పూజ చేస్తే నీ భర్త యథాస్థితికి వచ్చి నీతో సక్రమంగా ఉంటాడని తెలపడంతో సుజాత తన ఇంటిలోని ఒక గదిని తనకిచ్చి పూజ చేయించడం జరిగింది. అయితే పూజ జరిగే సమయంలో ఎవరు తన గదిలోకి రాకూడదని మీ ఇంట్లో ఉన్న చిన్న పాప మాత్రమే నా వద్ద ఉంటుందని తెలపడంతో వారు పాపని అక్కడే వదిలేసి వారు బయటే ఉండడం జరిగేది. అయితే గత వారం నుంచి తల్లిదండ్రులకు తెలియకుండా ఆ పాపని ఆగంతకుడు బలవంతం చేస్తున్నాడని తెలుసుకున్న టువంటి టి.సుజాత మేనల్లుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గదిలోకి వెళ్లి చూడగా చిన్న పాపని బలత్కారం చెస్తుతున్నాడు అని గమనించిన తాను పారిపోతున్న పూజారిని పట్టుకొని చెట్టుకు కట్టేసి గ్రామస్తుల సహాయంతో దేహశుద్ధి చేయడం జరిగింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు మండల పరిధిలోని మహాదేవపురం కాకి బంగారక్క పాలెం లో 550 కుటుంబాలకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధరర్రెడ్డి కూరగాయలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహాదేవపురం లో ఎనిమిది వందల కుటుంబాలకు కాకి బంగారక్క పాలెం లో 250 కుటుంబాలకు అందించిన చేయూత కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ ఆవరణలో వలన కార్మికులకి అన్నం వడ్డిస్తున్న ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి
ఘట్ కేసర్ (లోకల్ టైమ్స్): వేద బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, వలస కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ఎంపీపీ, వైయస్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్ కేసర్ మండల పరిధి అవుషా పూర్ గ్రామంలో తన రెండవ కూతురు జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని వేద బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, వలస కార్మికులు, పేద ప్రజలకు ఆదివారం అన్నదానం చేయడంతో పాటు నిత్యావసర సరుకులు, పండ్లు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవాలయంలో వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు జరిపారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆయన కూతురు ఏనుగు జాస్య లు వేద బ్రాహ్మణులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఘట్కేసర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ల వద్ద మూడు వేల మంది వలస కార్మికులకు మధ్యాహ్న భోజనం, పండ్లు, పంపిణీ చేశారు. ఆయా రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికులకు సరిపడా ఆహార పదార్థాలు తాగునీటి బాటిల్ తో ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డిల ఆదేశానుసారం పేద ప్రజలు, వలస కార్మికులు ఆకలితో ఉండకూడదని లాక్ డౌన్ విధించినప్పటినుండి వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏనుగు కావేరి, వార్డు సభ్యులు మల్లేష్, రవి ట్రస్ట్ సభ్యులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, సంతోష్, నందు, భాను ప్రకాష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
అవుషా పూర్ లో మొక్కలు పెంచేందుకు తొట్లు ఏర్పాటు చేస్తున్న ఎంపీపీ సుదర్శన్ రెడ్డి.
ఘట్ కేసర్(లోకల్ టైమ్స్): మానవులు భవిష్యత్ లో మనుగడ సాధించాలంటే వన సంపదను పెంపొందించుకోవాలని ఎంపిపి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలో అవుషాపూర్ గ్రామంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ద్వితీయ పుత్రిక ఏనుగు జాస్య రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలుచోట్ల చెట్ల తొట్లని ఏర్పాటు చేశారు. వాతావరణంలో మార్పుకోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, వన సంపదను పెంచి ప్రకృతి పరి రక్షణకు కృషి చేయాలని కోరారు. మానవాళి మనుగడకు ముప్పు వాటిళ్లకుండా వృక్షాలు మనకు సహాయ పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత రఘువోత్తం రెడ్డి, అవుషాపూర్ గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చందర్ రెడ్డి, వార్డు సభ్యులు ముద్దం రాధ, బాలకృష్ణ, కొలిచెలిమే మల్లేష్, నాయకులు నాగరాజు, ఏనుగు మచ్చందర్ రెడ్డి, పెద్దోల సాయిలు, ట్రస్ట్ సభ్యలు తదితరులు పాల్గొన్నారు.
లాక్ డౌన్ సందర్భం.. జర్నలిస్టులకు అండగా నిలిచిన సుప్రభాత్ హోటల్ యాజమాన్యం
నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, సుప్రభాత్ హోటల్ ఎండి కృష్ణమూర్తి
ఉప్పల్, లోకల్ టైమ్స్ 17: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. లాక్ డౌన్ సందర్భం. ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు విపత్కర సమయంలో హబ్సిగూడ లోని సుప్రభాత్ హోటల్ యాజమాన్యం అండగా నిలిచింది. హోటల్ ఎండి ఇ కృష్ణమూర్తి ఆర్థిక సహకారంతో ఉప్పల్ సర్కిల్ జర్నలిస్టులకు బియ్యము, నిత్యావసర సరుకులను ఆదివారం హబ్సిగూడ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ జరిగింది. సర్కిల్ పరిధిలోని ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అవసరమైన సరుకులను హోటల్ ఎండి కృష్ణమూర్తి, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ బేతి స్వప్న సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు అరటికాయల భాస్కర్, వెంకటేశ్వర్ రెడ్డి,సుధాకర్, రవి, పంపిణీ చేశారు. లాక్ డౌన్ సందర్భంలో జర్నలిస్టులు ఆకలితో ఇబ్బందులు పడకుండా కడుపునిండా అన్నం తినాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులను అందజేసినట్లు సుప్రభాత హోటల్ ఎండి కృష్ణమూర్తి పేర్కొన్నారు. విపత్కర సమయములో హోటల్ సుప్రభాత్ యాజమాన్యం జర్నలిస్టులకు అండగా నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టు లు అంటే తనకు ఎంతో గౌరవమని సుప్రభాత్ హోటల్ ఎండి కృష్ణమూర్తి పేర్కొన్నారు. విపత్కర సమయములో జర్నలిస్టులపై ఆదరణ చూపించి ఆదుకున్న సుప్రభాతం హోటల్ ఎండి కృష్ణమూర్తికి జర్నలిస్ట్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు కొలనుపాక చంద్రమౌళి, సురేష్, అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సురేష్ , ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
బ్రహ్మంగారి గుట్టపై 27 అడుగుల అభయాంజనేయ స్వామి అతి పెద్దవిగ్రహం ఆవిష్కరణ.. తరలివచ్చిన భక్తులు ..ప్రత్యేక పూజలు.. హాజరైన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు..
చిల్కానగర్ లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, గుడి మధుసూదన్ రెడ్డి తదితరులు
ఉప్పల్, లోకల్ టైమ్స్ 17: ఉప్పల్ సర్కిల్ పరిధిలోని చిలకనగర్ లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య బ్రహ్మంగారి గుట్టపై గుడి స్వర్ణ మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన 27 అడుగుల ఎత్తైన అతి పెద్ద శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని గాయత్రి పీఠాధిపతులు శ్రీ కాంత్ తేంద్ర స్వామి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల్లో చిల్కానగర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మంగారు గుట్ట పైకి తరలివచ్చి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మంగారి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజయ్య చారి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ సరస్వతి సదానందం, బిజెపి అధ్యక్షుడు దేవ సాని బాలచందర్, టిఆర్ఎస్ నాయకులు అరటికాయల భాస్కర్, జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, ఈ రెల్లి రవీందర్, ప్రముఖులు బాల్రాజ్ రవీందర్ ,విట్టల్, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. జై హనుమాన్ నామస్మరణతో బ్రహ్మంగారి గుట్ట మార్మోగింది.
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంక రెడ్డి శ్రమదానం
మంత్రి మల్లారెడ్డి ఇంటిలో శ్రమదానం చేస్తున్న పీర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డి
పీర్జాదిగూడ, లోకల్ టైమ్స్ 17: మనకోసం.. మన ఆరోగ్యం కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మన ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అని మంత్రి కేటీఆర్ పిలుపుతో ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తో కలిసి శ్రమదానం చేశారు. ఇంటి ఆవరణలో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెట్ల పొదల్లో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. పరిశుభ్రత పచ్చదనం ఆరోగ్యవంతమైన తెలంగాణ ను తీర్చిదిద్దడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు అందరూ తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని కరోనా వైరస్ లాంటి మహమ్మారి వ్యాధులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖానికి ముసుగు లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి
రామంతపూర్, లోకల్ టైమ్స్ 17: లాక్‌డౌన్ సందర్భంలో ఇంటికే పరిమితమైన పేద లేందరో. ఆకలితో ఇబ్బందులు పడకుండా అండగా నిలిచారు మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాగిడి లక్ష్మారెడ్డి. అన్నా అంటే నేనున్నాను అంటూ ముందుకు వచ్చి న ఆర్ ఎల్ ఆర్ ఆదివారం రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో పేదలకు బియ్యము, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆకలి తీర్చారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గా పేదల గుండెల్లో నిలిచిన లక్ష్మారెడ్డి విపత్కర సమయంలో ఆకలి తీర్చడం దేవునితో సమానం పలువురు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎల్ ఆర్ యూత్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని సేవలు అందించారు.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు నియోజకవర్గ అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రమోహన్ హరి ఏకగ్రీవంగా ఎంపిక య్యారు ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన నియోజవర్గ వైఎస్ఆర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందమోహన్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు సమక్షంలో జరిగిన కమిటీ ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. ఆనంద మోహన్ మాట్లాడుతూ నియోజక వర్గం లో నూతనంగా ఏర్పడిన కమిటీ నిరంతరం యువత సమస్యలపై పోరాడుతుందని అన్నారు. అదేవిధంగా నూతనంగా ఎంపికైన అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్ మాట్లాడుతూ నిబంధనల మేరకు నిరంతరం యువత సమస్యలపై ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా దళిత వర్గానికి చెందిన ఇద్దరు యువకులు యువజన సంఘం బాధ్యతలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు నియోజకవర్గ అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రమోహన్ హరి ఏకగ్రీవంగా ఎంపిక య్యారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన నియోజవర్గ వైఎస్ఆర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు .ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందమోహన్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు సమక్షంలో జరిగిన కమిటీ ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. ఆనంద మోహన్ మాట్లాడుతూ నియోజక వర్గంలో నూతనంగా ఏర్పడిన కమిటీ నిరంతరం యువత సమస్యలపై పోరాడుతుందని అన్నారు. అదేవిధంగా నూతనంగా ఎంపికైన అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్ మాట్లాడుతూ నిబంధనల మేరకు నిరంతరం యువత సమస్యలపై ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా దళిత వర్గానికి చెందిన ఇద్దరు యువకులు యువజన సంఘం బాధ్యతలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
లోకల్ టైమ్స్ ఒంగోలు: ఆర్టీసిలో పనిచేస్తున్న కాంట్రాక్టు యూనియన్ కార్మికుల పొట్ట కొట్టవద్దని జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఒక ప్రకటన ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆర్టీసీ డిపో లో అవుట్సోర్సింగ్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు వారి 7600 కుటుంబాల కొట్టేందుకు వారిని తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ సందర్భంగా ఈనెల 18న ఒంగోలు కార్యాలయం వద్ద ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల నిరసన కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లను పేర్కొన్నారు ముఖ్యంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బకాయి ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని బస్సులు తిరిగిన పెరగకపోయినా విధుల్లోకి తీసుకోవాలని జరగనున్న ఈ నిరసన కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు.