Featured

చారిటీ పేరుతో అడ్డంగా బుక్కైన నైజీరియన్‌ ముఠా…

లోకల్ టైమ్స్ క్రైమ్. విశాఖపట్నం విశాఖలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాన్ని సైబర్‌ క్రైం పోలీసులు అడ్డుకున్నారు. చారిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరైస్టైన వారిలో నలుగురు నైజీరియన్లతో పాటు మేఘాలయకి చెందిన ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాలు.. విశాఖపట్నంలో నివసిస్తున్న సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక నైజీరియన్‌ సంస్థ నుంచి రూ.39 కోట్ల తమ ఆస్తిని ఇండియాలో చారిటీ కోసం వినియోగించనున్నామంటూ మెయిల్‌ వచ్చింది. మీరు కూడా మీ వంతు సాయం చేయాలనుకుంటే అకౌంట్‌కు డబ్బు పంపించవచ్చంటూ అందులో పేర్కొంది. దీంతో మెయిల్‌కు స్పందించిన సంజయ్‌ సింగ్‌ తన వ్యక్తిగత వివరాలను పంపించాడు.దీంతో కస్టమ్స్‌,లీగల్‌ ఫార్మాలిటీస్‌ పేరుతో సంజయ్‌ సింగ్‌ వద్ద నుంచి పెద్ద మొత్తంలో గుంజడానికి ప్రయత్నించింది.ఈ నేపథ్యంలో నైజీరియన్‌ ముఠా వలలో చిక్కుకున్న సంజయ్‌ రూ. 6.62 లక్షల రూపాయలను వివిధ అకౌంట్లకు పంపించాడు. తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సంజయ్‌ సింగ్‌ విశాఖ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నైజిరీయన్‌ ముఠాను ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. కాగా వీరికి సహకరించిన మేఘాలయ రాష్ర్టానికి చెందిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నైజీరియన్‌ ముఠా నుంచి 55 వేల నగదు, రెండు లాప్‌టాప్‌లు, ఆరు మొబైల్‌ ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు, రెండు ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టులు, వారి బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.46 లక్షల నగదును సీజ్‌ చేసనట్లు పోలీసులు వెల్లడించారు.

చారిటీ పేరుతో అడ్డంగా బుక్కైన నైజీరియన్‌ ముఠా…

Featured

ఆన్ లైన్ చారిటీ డొనేషన్ పేరిట టోకరా

తనకున్న రూ. 39 కోట్ల సొమ్మును దానం చేస్తున్నట్లు ఓ మహిళ నుంచి విశాఖకు చెందిన వ్యక్తి సంజయ్ సింగ్ కు ఈ మెయిల్

మెయిల్ నమ్మి రిప్లై ఇచ్చిన సంజయ్ సింగ్

మనీ ట్రాన్స్ఫర్ చేశామని డబ్బు చేతికి రావాలంటే కస్టమ్ డ్యూటీ, ఇన్సూరెన్స్, ఆర్ బి ఐ చార్జెస్ చెల్లించాలని సదరు మహిళ గాలం

మహిళ మాటలు నమ్మి పలు మార్లు వివిధ బ్యాంక్ అకౌంట్స్ కు రూ. 6, 62,000 చెల్లించిన సంజయ్ సింగ్

ఎంతకూ డబ్బు రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు

సైబర్ క్రైమ్ పోలీసులు ను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నలుగురు నైజీరియన్స్, మేఘాలయా కు చెందిన మరో మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితుల నుంచి 2 లాప్ టాప్ లు, 6 మొబైల్ ఫోన్స్, రూ.55 వేల నగదు స్వాధీనం

బాంక్ లో ఉన్న మరో లక్షన్నర రూపాయలు ఫ్రీజ్

Featured

గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ ఘనవిజయం

లోకల్ టైమ్స్: నందిగామ:ఎస్ఎఫ్ఐ నందిగామ కమిటీ

ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం

నందిగామ గాంధీ బొమ్మ సెంటర్ లో గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ గెలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు గెలుపు కోరుతూ టపాసులు కాల్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు
యూనివర్సిటీ లో గెలుపు కేంద్ర ప్రభుత్వనకి చెంపపెట్టు లాంటిది అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు అన్నారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ_. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించడం గొప్ప పరిణామని ఆయన అన్నారు. విద్యార్థి సంఘం ఎన్నికల్లో (ఎస్ఎఫ్ఐ) కూటమి విజయఢంకా మోగించిందిని బిజెపి అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపిని మట్టికరిపించి నాలుగు స్థానాల్లోనూ ఘన విజయం సాధించిందిని’ వారు తెలిపారు. గతంలో కూడా హైదరాబాద్, కేరళ, ఢిల్లీ , లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో మతోన్మాదనాకి వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా పోరాడడం జరుగుతుందిని, దేశ ప్రధాని నరేంద్రమోడీ చేసే విద్య వ్యతిరేకంగా నిర్ణయలు పై పోరాటం చేశారని అన్నారు. యూనివర్సిటీలో పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు అనేక ఆందోళనలు చేస్తుంటే బిజెపి ప్రభుత్వం దాడులకు పాల్పడడం జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలోనే యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ మిగిలిన సంఘాలు అన్నీ కలిపి విజయాలు సాధించడం గొప్ప పరిణామనీ ఆయన అన్నారు.విద్యారంగంలో మత భావాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే వాటిపై కూడా వారి పోరాడడం , భారత రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారని రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నారు వారన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ అధ్యక్షులు
లాల్ సలామ్, కార్యదర్శి గోపీనాయక్ , జిల్లా కమిటీ సభ్యులు అనీఫ్ , నందిగామ
సిఐటియు నాయకులు గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కాసిం కాజా మొహిదీన్ తదితరులు పాల్గొన్నారు.

కందుకూరులో రాజ్యమేలుతున్న అగ్రవర్ణ జర్నలిస్టు ఆగడాలు


సెటిల్మెంట్లు కాంటాక్ట్ లు నెలసరి మామూళ్లతో హవా..
కందుకూరులో ఏ జర్నలిస్టు గ్రూప్ తయారు చేసినా నాదే పెత్తనం అంటున్న జర్నలిస్టు..
నిబద్ధత నిజాయితీ కలిగిన జర్నలిస్టులకు చోటు కల్పిస్తే బెదిరింపులు..
అధికారులు రాజకీయ నాయకులకు బోకర్ గా వ్యవహరిస్తున్న వైనం..

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణం లో నాదే పెద్ద కులం.. నాదే పెద్ద పేపరు.. అందరు నామాటే వినాలి రాజకీయ నాయకులకు అధికారులకు నాయకులకు నేనే ప్రతినిధిని పోలీస్ స్టేషన్ లో గానీ రాజకీయ నాయకుల వద్ద గాని పట్టణంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సెటిల్మెంట్ నాదే అని అంటూ విర్రవీగుతున్ జర్నలిస్టులలో నిబద్ధత నిజాయితీ గలిగిన జర్నలిస్టులను నిరంతరం వేధిస్తున్నా లెక్క చేయక ఆత్మాభిమానంతో ఎదురు తిరుగుతూ నువ్వెంత నీ నీ పెత్తనం ఎంత చరిత్రలో మీలాంటి వారు విర్రవీగే కనుమరుగయ్యారు అని తమ పదునైన కలంతో నిరంతరం ఉద్యమం అనేకంటే పోరాటం చేస్తూ ఆత్మాభిమానంతో ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది. సదరు జర్నలిస్టు నియోజకవర్గంలో పెత్తనం చేసే ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినవాడు కావటం మరియు పెద్ద పేపర్ విలేకర్ రావడంతో పదేపదే నిబద్ధత నిజాయితీ కలిగిన బలహీనవర్గాల జర్నలిస్టులు నిరంతరం అవమానాలకు గురవుతూ రావడం పరిపాటిగా మారింది. వారంతా వారి పేపర్లు ఎంత వాళ్ళ కులం కొన్న దమ్ము ఎంత అని కాలంతో వార్తలతో దమ్ము చూపించాల్సి ఉన్న ఆ విధంగా కాకుండా కులము పేపర్ ని అడ్డుపెట్టుకొని నిరంతరం విర్రవీగుతూ అగ్రవర్ణ దురహంకారంతో పెత్తనంకొనసాగిస్తూ కందుకూరు పట్టణం లో తనదే రాజ్యమని విర్రవీగుతూ నిరంతరం అందర్నీ నా ఆదేశాలు అమలు చేయాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితి జర్నలిజం విలువలు దిగజారి అన్న దానికి నిదర్శనంగా మారింది. ఈ క్రమంలో బలహీన వర్గాల వారు కమ్యూనిస్టు భావాలు ఉన్నవారు పేద వర్గాలకు దళిత బహుజన మైనారిటీ వర్గాలకు చేయూత అందించాలని అనారోగ్యం వెక్కిరిస్తున్న పిల్లలు హీలనచేస్తున్న మొక్కవోని ఆత్మస్థైర్యంతో నేటికీ తమ పదునైన కలంతో విలువ లు కలిగిన నిజాయితీతో అక్షరాలను ఆశిస్తూ సమాజ హితం కోసం పాటుపడుతూ నువ్వెంత నీ అధికారం ఎంత మీలాంటివారు జర్నలిజంలో వస్తూ పోతూ ఉంటారు కానీ నిబద్ధత నిజాయితీ చిరస్థాయిగా నిలుుస్తుంది అనే నమ్మకంతో నిరంతరం పోరాటం చేస్తున్న పరిస్థితి కందుకూరు ప్రాంతంలో జర్నలిస్టులకు దాపురించింది. అయితే ఇదే సందర్భంలో బలహీన వర్గాలకు చెందిన కొంతమంది జర్నలిస్టులు భయం భక్తి లేక ఆకలి తీర్చుకునేందుకు ఆర్థిక వనరుల కోసం వారికి వత్తాసు పలికి సహజీవనం చేస్తూ తమ సహోదరులైన పేద వర్గాలకు చెందిన జర్నలిస్టులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సదరు జర్నలిస్టు ఒక నలుగురైదుగురు జర్నలిస్టులను పోగు చేసుకొని ఆ పేపర్ ను అడ్డుపెట్టుకొని అధికారులను రాజకీయ నాయకులను ప్రసన్నం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష నాయకులు ఎలా ఉన్నా టిడిపి నుంచి భారీ మొత్తంలో నగదు పొందిన అదే వ్యక్తి ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు వత్తాసు పలకటంవిడ్డూరంగా ఉంది ఆదినుంచి నియోజకవర్గంలో బలహీన వర్గాలు ఐక్యంగా చేయి చేయి కలిపి వారి కుటుంబ సభ్యులకు వారి ఆత్మాభిమానాన్ని పరిగణలోకి తీసుకొని వారసులు అలాంటి బెదిరింపులు సెటిల్మెంట్లు చేసే జర్నలిస్టులకు వత్తాసు పలకటం సామాజిక వర్గం ఆధారంగానే విలువ గౌరవం లభిస్తాయని నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టు గుర్తుపెట్టుకోవాలి విలేకరి దమ్మున్న వార్త రాయాలి సమస్య ఏదైనా ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల కోసం యుద్ధం చేసే విధంగా తమ కలాన్ని ఉపయో యోగి నుంచి నిరంతరం సమాజ చైతన్యం కోసం పాటుపడాలి కానీ తమను ఎదిరించి తాము చెప్పిన పని చేయలేదని వారిని అవహేళన చేస్తూ గ్రూపులో ఉన్న బెదిరింపులకు గురి చేస్తూ గ్రూపులో లేకుండా చేయడం విడ్డూరంగా ఆశ్చర్యకరంగా ఉంది. సమాజంలో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న బలం ఉన్నవాడిదే రాజ్యం కులం ఉన్నవారికి ఉన్నవారికి ఆర్థిక స్తోమత వాస్తవాలు నిరూపిస్తున్నాయి జర్నలిస్టు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సమస్య వస్తే బలహీన వర్గాలు జర్నలిస్టుల నిబద్ధత నిజాయితీ కలిగిన జర్నలిస్టులు ప్రాణం పోయేవరకు ఉద్యమిస్తారు అలాంటి ఉద్యమాలు వారికి కొత కాదు మీరు మీ అవసరాలకోసం ఉన్న దమ్ము ధైర్యం చేసి ఒకరిపై వార్తలు వ్రాసి ధైర్యం మీకు లేదు అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని ఉంటే మంచిది ఎల్లవేళల ఒక విధంగా ఉండదు రాజులు పోయినా రాజ్యాలు పోయినా రౌడీలు వ్యాపారులు ఉన్న వారి అవసరాల కోసమే ఉంటారు కానీ నిబద్ధత నిజాయితీ శాశ్వతంగా నిలిచిపోతుంది అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని మసలితే మంచిది. లేకపోతే తగిన సమయంలో తగిన గుణపాఠం తప్పదు బలహీన వర్గాలు ఆలోచించుకొని అడుగు ముందుకు వేస్తే మీ కూసాలు కదిలి పోతాయి గుర్తుంచుకోండి తస్మాత్ జాగ్రత్త

కందుకూ రులో రాజ్యమేలుతున్న అగ్రవర
సెట కాంటాక్ట్ లునెలసరి మామూళ్లతో హవా
కందుకూ రులో ఏ జర్నలిస్టు గ్రూప్ తయారు చేసిన నాదే పెత్తనం అంటున్న జర్నలిస్టు
నిబద్ధత నిజాయితీ కలిగిన జర్నలిస్టులకు చోటు కల్పిస్తే బెదిరింపులు
అధికారులు రాజకీయ నాయకులకు బోకర్ గా వ్యవహరిస్తున్న వైనం

లోకల్ టైమ్స్ ఒంగోలు
కందుకూరు పట్టణం లో నాదే పెద్ద కులం నాదే పెద్ద పేపరు అందరు నా మాటే వినాలి రాజకీయ నాయకులకు అధికారులకు నాయకులకు నేనే ప్రతినిధిని పోలీస్ స్టేషన్ లో గానీ రాజకీయ నాయకుల వద్ద గాని పట్టణంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సెటిల్మెంట్ నాదే అని అంటూ విర్రవీగుతున్న లో జర్నలిస్టుల లో నిబద్ధత నిజాయితీ గలిగిన జర్నలిస్టుల ను నిరంతరం వేధిస్తున్నా లెక్క చేయక ఆత్మాభిమానంతో ఎదురు తిరుగుతూ నువ్వెంత నీ నీ పెత్త నం ఎంతచరిత్రలో మీలాంటివారు విర్రవీగే కనుమరుగయ్యారు అని తమ పదునైన కలంతో నిరంతరం ఉద్యమం అనేకంటే పోరాటం చేస్తూ ఆత్మాభిమానం తో ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది సదరు జర్నలిస్టు నియోజకవర్గంలో పెత్తనం చేసే ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినవాడు కావటం మరియు పెద్ద పేపర్ విలేకర్ రావడంతో పదేపదే నిబద్ధత నిజాయితీ కలిగిన బలహీనవర్గాల జర్నలిస్టులునిరంతరం అవమానాలకు గురవుతూ రావడం పరిపాటిగా మారిందివారంతా వారి పేపర్లు ఎంత వాళ్ళ కులం కొన్న దమ్ము ఎంత అని కాలంతో వార్తలతో దమ్ము చూపించాల్సి ఉన్న ఆ విధంగా కాకుండా కులము పేపర్ ని అడ్డుపెట్టుకొని నిరంతరం విర్రవీగుతూ ా అగ్రవర్ణ దురహంకారంతో పెత్తనంకొనసాగిస్తూ కందుకూరు పట్టణం లో తనదే రాజ్యమని విర్రవీగుతూ నిరంతరం అందర్నీ నా ఆదేశాలు అమలు చేయాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితి జర్నలిజం విలువలు దిగజారి అన్న దానికి నిదర్శనంగా మారింది ఈ క్రమంలో బలహీన వర్గాల వారు కమ్యూనిస్టు భావాలు ఉన్నవారు పేద వర్గాలకు దళిత బహుజన మైనారిటీ వర్గాలకు చేయూత అందించాలని అనారోగ్యం వెక్కిరిస్తున్న పిల్లలు హీలనచేస్తున్న మొక్కవోని ఆత్మస్థైర్యంతో నేటికీ తమ పదునైన కలంతో విలువ లు కలిగిన నిజాయితీతో అక్షరాలను ఆశిస్తూ సమాజ హితం కోసం పాటుపడుతూ నువ్వెంత నీ అధికారం ఎంత మీలాంటివారు జర్నలిజంలో వస్తూ పోతూ ఉంటారు కానీ నిబద్ధత నిజాయితీ చిరస్థాయిగా ని లుుస్తుంది అనే నమ్మకంతో నిరంతరం పోరాటం చేస్తున్న పరిస్థితి కందుకూరు ప్రాంతంలో జర్నలిస్టులకు దాపురించింది అయితే ఇదే సందర్భంలో బలహీన వర్గాలకు చెందిన కొంతమంది జర్నలిస్టులు భయం భక్తి లేక ఆకలి తీర్చుకునేందుకు ఆర్థిక వనరుల కోసం వారికి వత్తాసు పలికి సహజీవనం చేస్తూ తమ సహోదరులైన పేద వర్గాలకు చెందిన జర్నలిస్టులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి సదరు జర్నలిస్టు ఒక నలుగురైదుగురు జర్నలిస్టులను పోగు చేసుకొని ఆ పేపర్ ను అడ్డుపెట్టుకొని అధికారులను రాజకీయ నాయకులను ప్రసన్నం చేస్తూ పబ్బం గడుపుతున్నారు ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష నాయకులు ఎలా ఉన్నా టిడిపి నుంచి భారీ మొత్తంలో నగదు పొందిన అదే వ్యక్తి ప్రస్తుతం అధికార పక్షం లో ఉన్న ప్రజాప్రతినిధులు వత్తాసు పలకటంవిడ్డూరంగా ఉంది ఆదినుంచి నియోజకవర్గంలో బలహీన వర్గాలు ఐక్యంగా చేయి చేయి కలిపి వారి కుటుంబ సభ్యులకు వారి ఆత్మాభిమానాన్ని పరిగణలోకి తీసుకొని వారసులు అలాంటి బెదిరింపులు సెటిల్మెంట్లు చేసే జర్నలిస్టులకు వత్తాసు పలకటం సామాజిక వర్గం ఆధారంగానే విలువ గౌరవం లభిస్తాయని నిరూపిస్తున్నాయి ఈ క్రమంలోనే జర్నలిస్టు గుర్తుపెట్టుకోవాలి విలేకరి దమ్మున్న వార్త రాయాలి సమస్య ఏదైనా ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల కోసం యుద్ధం చేసే విధంగా తమ కలాన్ని ఉపయో యోగి నుంచి నిరంతరం సమాజ చైతన్యం కోసం పాటుపడాలి కానీ తమను ఎదిరించి తాము చెప్పిన పని చేయలేదని వారిని అవహేళన చేస్తూ గ్రూపులో ఉన్న బెదిరింపులకు గురి చేస్తూ గ్రూపులో లేకుండా చేయడం విడ్డూరంగా ఆశ్చర్యకరంగా ఉంది సమాజంలో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న బలం ఉన్నవాడిదే రాజ్యం కులం ఉన్నవారికి ఉన్నవారికి ఆర్థిక స్తోమత వాస్తవాలు నిరూపిస్తున్నాయి జర్నలిస్టు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సమస్య వస్తే బలహీన వర్గాలు జర్నలిస్టుల నిబద్ధత నిజాయితీ కలిగిన జర్నలిస్టులు ప్రాణం పోయేవరకు ఉద్యమిస్తారు అలాంటి ఉద్యమాలు వారికి కొత కాదు్త మీరు మీ అవసరాలకోసం ఉన్న దమ్ము ధైర్యం చేసి ఒకరిపై వార్తలు వ్రాసి ధైర్యం మీకు లేదు అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని ఉంటే మంచిది ఎల్లవేళల ఒక విధంగా ఉండదు రాజులు పోయినా రాజ్యాలు పోయినా రౌడీలు వ్యాపారులు ఉన్న వారి అవసరాల కోసమే ఉంటారు కానీ నిబద్ధత నిజాయితీ శాశ్వతంగా నిలిచిపోతుంది అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని మసలితే మంచిది లేకపోతే తగిన సమయంలో తగిన గుణపాఠం తప్పదు బలహీన వర్గాలు ఆలోచించుకొని అడుగు ముందుకు వేస్తే మీ కూసాలు కదిలి పోతాయి గుర్తుంచుకోండి తస్మాత్ జాగ్రత్త

61వరోజు వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్ డౌన్ సందర్భంగా పనులు లేక సొంత ఊర్లకు వెళుతున్న వలస కూలీలకు వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో ఉలవపాడు జాతీయ రహదారిపై ఉన్న సాయిబాబా గుడివద్ద కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ి ఆహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి ు మాట్లాడుతూ శ్రీ వేకటేష్ మెడికల్ షాపు యజమాని కొత్త ప్రసాద్ సతీమణిఆనంతమాధవి పుట్టినరోజు సందర్భంగా ఆమె దాచుకున్న డబ్బులతో పేదలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు.అరవైఒక్క రోజులనుండి నిర్విరామంగా సేవచేస్తున్న వాసవి సేవాదళ్ టీం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు, చలంచర్ల సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్,p. పాపారావు పిన్నంరాజు ప్రభాకర్,ఇస్కాలమధు, చక్కా కేశవ,శివ,శశాంక్, అమర్నాధ్ పాల్గొన్నారు.

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు…

లోకల్ టైమ్స్ ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే అంబవరం గ్రామానికి చెందిన సామేలు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ద్విచక్ర వాహనాలపై వస్తూ ఒకరినొకరు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో సామేలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గిద్దలూరులో జగన్ అన్న పాలన సంవత్సరపు రోజుల సంబరాలు

లోకల్ టైమ్స్ ఒంగోలు: జననేత జగనన్న పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా .. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సంబరాలు చేసుకున్న వైకాపా అభిమానులు గిద్దలూరు పట్టణములో YSR విగ్రహానికి పూలమాలలు వేసిన వైకాపా నేతలు , ఆతరువాత స్థానిక MLA అన్నా రాంబాబు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు ,
రాచర్ల మండలంలో ఘనంగా వేడుకలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు..నేటికి ysrcp 151 సీట్లను సాధించి సంవత్సరం అయిన సందర్భంగా అర్ధవీడు మండల కేంద్రంలో లో ysr విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం జెండాను ఆవిష్కరించి,కేట్ కట్ చేసిన అర్ధవీడు మండల ysrcp నాయకులు, కార్యకర్తలు .

దానగళ్ళ యాదగిరి దౌర్జన్య వైఖరిని తీవ్రంగా ఖండించిన మేడ్చల్ జిల్లా ఏ డబ్ల్యూ జే ఏ అధ్యక్షుడు కొడపర్తి సదా చారి

మేడ్చల్ జిల్లా..లోకల్ టైమ్స్: కాప్రా మండలం: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్:
ఉప్పల్ నిఘా విలేఖరి డి. విష్ణు గౌడ్ పై కార్పొరేటర్ భర్త కాంగ్రెస్ నాయకులు దాన గళ్ళ యాదగిరి దౌర్జన్య వైఖరిని తీవ్రంగా ఖండించిన మేడ్చల్ జిల్లా ఏ డబ్ల్యూ జే ఏ అధ్యక్షుడు కొడపర్తి సదా చారి.. అక్రమార్కుల ఆగడాలకు ముక్కు తాడు వేసేందుకు విలేఖరి మిత్రులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చిన మేడ్చల్ జిల్లా ఏ డబ్ల్యూ జె ఏ అధ్యక్షులు కొడపర్తి సదా చారి..

మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ పరిధిలో గల భూకబ్జాల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తున్న కలం నిఘా విలేకరి విష్ణు గౌడ్ పై కార్పొరేటర్ భర్త దానగల్ల యాదగిరి దాడికి పాల్పడ్డ విషయాన్ని ఏ డబ్ల్యు జే ఏ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కొడపర్తి సదా చారి తీవ్రంగా ఖండించడమ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కుల వ్యవహారాలను బహిర్గతం చేస్తున్న విలేకరులపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అన్నారు. సామాన్యుడిని నాయకుడిని చేయడం విలేకరుల కె సాధ్యం అలాంటి జర్నలిస్టుల పైన దాడులు చేస్తే ఊరుకునేది లేదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విలేఖరి మిత్రులందరూ ఒక తాటి మీదికి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఎంతో ఉందని గుర్తు చేశారు. అలాగే జర్నలిస్టు విష్ణు గౌడ్కు ఏ డబ్ల్యూ జె ఏ అండగా ఉండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాండు రంగారావు, నరేష్, వేణుగోపాల చారి, రమేష్ చారి, గంగాధర చారి, సోమ చారి, విజయ్ కుమార్, వెంకటాచారి, సాయిరాం శంకర్, ఏ డబ్ల్యూ జే ఏ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు పోరండ్ల యాదగిరి ఏ డబ్ల్యూ జె ఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పొదిలిలో సంబరాలు

లోకల్ టైమ్స్ ఒంగోలు: ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకొని పాలన ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పొదిలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పిచ్చి రెడ్డి నివాసంలో వైసిపి నాయకులు కార్యకర్తలు శనివారం సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్చేసి ఒకరికి ఒకరు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బాలిరెడ్డి వాల్మీకి సాయి పవన్ మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు: మార్కాపురం పట్టణం లోని 16వ వార్డ్ లో ఎస్ ఆర్ నగర్ నుంచి కోటిపల్లి వరకు వెళ్లనున్న రహదారి నిర్మాణానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కృష్ణ కనకదుర్గ ఇస్మాయిల్ అలీబేగ్ నాదెళ్ల చంద్రమౌళి బూతుల సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర సుభాని తదితరులు పాల్గొన్నారు.

బాపూజీ కాలనీలో మాస్కులు పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: టంగుటూరు పట్టణంలోని బాపు శ్రీ కాలనీలో అయ్యవార అయ్యా ప్రజలకు ఉచితంగా మాస్క్ లను శనివారం పంపిణీ చేశారు.

బావను చంపిన బావమరిది

లోకల్ టైమ్స్ ఒంగోలు; పెద్దారవీడుచెంచు కాలనీ లో నగదు వివాదంలో బావ ను చంపిన బావమరిది సంఘటన సంచలనం రేకెత్తించింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి తన బావమరిది నగదు అప్పుగా ఇవ్వగా నగదు విషయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగి రాజయ్యను చెన్నయ్య హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల సంక్షేమం కోసం మద్దాలి జగదీష్ పదివేల రూపాయలు విరాళం

లోకల్ టైమ్స్ ఒంగోలు: పోలీసుల సంక్షేమం కోసం కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కి శనివారం మద్దాలి జగదీష్ పది వేల రూపాయల విరాళాన్ని అందజేసింది.

కోమానుండి కోలుకున్న వ్యక్తి కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: ఎర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామం SC పాలెం నివాసి అయిన జినుకూటి మరియబాబు అనే బేల్దారికూలి 19-07-2018 రోజున విజయవాడలో ఓ అపార్ట్మెంట్లో కూలిపని చేస్తుండగా ప్రమాదవశాత్తు సెంట్రింగ్ కట్టిన కర్రలు మీదపడటంతో ఒక కాలు పూర్తిగా పని చేయకుండా పోయింది, గొంతులో ఇనపరాడ్ దిగడంతో విజయవాడలోని క్యాపిటల్ హాస్పటల్లో చేర్పించడం జరిగినది అక్కడ చికిత్స పొందుతూ ఒక సంవత్సరం పాటు కోమాలో ఉండి కోలుకున్న వ్యక్తికి కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఏఉపాధిలేక ఇబ్బంది పడుతున్న ఈ కుటుంబానికి దళిత బహుజన హక్కుల పోరాటసమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల.సుజాత ఈరోజు నిత్యావసర సరుకులను అందించడం జరిగినది ఈ కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో అప్పటినుండి తన భార్య అయిన కాశమ్మ భర్తను,ఇద్దరు అమ్మాయిలను, ఒక అబ్బాయిని కూలి పనికి పోయి వచ్చినకూలీతో పోషించు కుంటున్నభార్య ఇతనికి గవర్నమెంట్ నుండి రావలసిన వికలాంగుల పింఛన్ కూడా మంజూరు కాకపోవడంతో వికలాంగుల పింఛన్ మంజూరు చేయవలసినదిగా కోరుచున్నారు.

కొండ ముడు పాలెంలో అలుగు పోరంబోకు భూమిని ఆక్రమిస్తున్న ఘనులు. ఆక్రమణను అడ్డుకున్న రెవెన్యూ ఉద్యోగులు

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు మండల పరిధిలోని కొండమ డుసు పాలెం గ్రామంలో వేల సంవత్సరాలుగా మో పాడు చెరువుకు అనువుగా ఉన్న ఆలుగు వాగు సమీపంలో గల సర్వే నెంబర్ 95 లో ఉన్న 50 సెంట్ల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించ టమే కాకుండా వాగులోని మట్టితోనే ఆక్రమణలకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఆ వాగు సమీపంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐదు సంవత్సరాల క్రితం వేసిన ఎలాంటి అనుమతులు లేవని నేటికీ ఆ వెంచర్ అనుమతి లభించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాగు పోరంబోకు పై కన్నువేసిన నాయకుల అండదండలతో ఆక్రమణకు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాగులోని మట్టిని ట్రాక్టర్లతో ఆక్రమణ సమయంలో సమాచారం అందుకున్న గ్రామ రెవెన్యూ అధికారి డాక్టర్ ను ప్రస్తుతానికి అడ్డుకున్నారు .ఏది ఏమైనా పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పోరంబోకు భూమిని ఆక్రమించిన వాటిని పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు ప్రజల నుంచి వస్తున్నాయి.

కరోనా నియంత్రణ మన అందరి బాధ్యత కావాలి.. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్

లోకల్ టైమ్స్ ఒంగోలు; కరోనా నియంత్రణ ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు మనందరి బాధ్యత కావాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. శనివారం ఒంగోలు నగరంలోని తన కార్యాలయంలో జిల్లా ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి జిల్లా అధికారులతో కలిసి కరుణ అంశంపై తాసిల్దార్ ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు సడలించాలని నిర్లక్ష్యం వహిస్తోందని నిరంతరం పర్యవేక్షించాలని ప్రజల్లో అవగాహన పెంపొందించి నియంత్రించాలని ఆదేశించారు. ముఖ్యంగా దుకాణాల వద్ద పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు మాస్క్లు ధరించి నిరంతరం అవగాహన కల్పించాలని వలస కూలీలు కార్మికులను గుర్తించి వారి స్వస్థలాలకు పంపించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి మన జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కరోనా నియంత్రణ మన అందరి బాధ్యత కావాలి..జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్

లోకల్ టైమ్స్ ఒంగోలు; కరోనా నియంత్రణ ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు మనందరి బాధ్యత కావాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. శనివారం ఒంగోలు నగరంలోని తన కార్యాలయంలో జిల్లా ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి జిల్లా అధికారులతో కలిసి కరుణ అంశంపై తాసిల్దార్ ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు సడలించాలని నిర్లక్ష్యం వహిస్తోందని నిరంతరం పర్యవేక్షించాలని ప్రజల్లో అవగాహన పెంపొం దించి నియంత్రించాలని ఆదేశించారు. ముఖ్యంగా దుకాణాల వద్ద పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు మాస్క్లు ధరించి నిరంతరం అవగాహన కల్పించాలని వలస కూలీలు కార్మికులను గుర్తించి వారి స్వస్థలాలకు పంపించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి మన జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చేయూత అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు..ఎమ్మెల్యే మహీధర రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; కష్టకాలంలో ప్రజలకు అండగా మేమున్నాం అంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కందుకూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మొగిలిచర్ల కు చెందిన పావని నాగేంద్రకుమార్ 15 వేల రూపాయలు చాగొల్లుచెందిన సిబ్బంది పదివేల రూపాయలు గట్టుపల్లి ఆంజనేయ శర్మ పదివేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే దాతలు అందించిన చేయూత లేదని వారు అందించిన చేయూత సహాయ కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు .దాతలు అందించిన ప్రతి పైసా ప్రజలకు ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వేణుగోపాల్ రెడ్డి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరికి నగదు చేయూత అందించాలి..ఏ ఐ వై యాప్ డిమాండ్

లోకల్ టైమ్స్ ఒంగోలు; లాక్ డౌన్ కార్యక్రమంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉద్యోగాలకు ప్రైవేటు టీచర్ సిబ్బంది యువతకు కార్మికులకు కూలీలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి పది వేల రూపాయల నగదు చేయూతను అందించాలి అని ఏ ఐ వై జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందమోహన్ డిమాండ్ చేశారు .శనివారం కందుకూరు సిపిఐ కార్యాలయంలో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమంలో ఆనంద మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రకటనలు చేస్తున్న కార్మికులకు ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం శూన్యమని వారిని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య స్థానిక అధ్యక్ష కార్యదర్శులు హరిబాబు చంద్రమోహన్ రమణ తదితరులు పాల్గొన్నారు.

400 మంది వలస కూలీలకు ఆహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు; టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై తమ స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీల స్వచ్ఛంద సేవా సంస్థ ఆయన స్ఫూర్తి సంస్థ గౌరవ సలహాదారు ప్రముఖ ఇన్కమ్ టాక్స్ అధికారి 400 మంది కార్మికులకు ఆహారం వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటి అధికారి సెల్ వన్ రాజు అరుణ తదితరులు పాల్గొన్నారు.

నిరంతరం ఆహారం అందించిన వాసవి సేవాదళ్ నిర్వాహకులను అభినందించారు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; లాక్ డౌన్ప్రారంభం నాటి నుంచి నేటి వరకు గత 60 రోజుల నుంచి నిరంతరం పేదలకు కార్మికులకు వలస కూలీల ఆహారం అందజేసిన వాసవి సేవాదళ్ నిర్వాహకులను ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ఎంత గొప్పవారైనా 12 రోజులు చేయూత అందించడమే కష్టంగా మారిన ఈ తరుణంలో 60 రోజుల నుంచి నిరంతరం ఆహారం అందజేసిన వాసవి సేవాదళ్ సంకల్పం గొప్పది అని అన్నారు. ఈ సందర్భంగా బృం దంతరఫున జిల్లా కోశాధికారి వెంకట కేశవరావు ఎమ్మెల్యే అభినందించారు.

కొలుకుల ఫారెస్ట్ ఏరియాలో పెద్దపులి మృతి

లోకల్ టైమ్స్ ఒంగోలు; యర్ర గొండ పాలెం ఏ రియా లో కొలుకుల అటవీ ప్రాతంలో శనివారం పెద్ద పులి మృతి చెందినట్లు అటవి శాఖ అధికారి ఖాదర్ భాషా తెలిపారు పులి వయస్సు 20 సవంత్స రాలు అని వయస్సు పెరగడంతో మృతి చెంది నట్లు ఆయన తెలిపారు.

భారత దేశములోనే ఉత్తమ ముఖ్యమంత్రి మన వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి – కే వీ పల్లె మండల జడ్.పీ.టీ.సి గజ్జల శృతి రెడ్డి ప్రశంస.

కే.వీ పల్లె, మే 23; వై.ఎస్.ఆర్.సీ.పి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్బంగా మండల పార్టీ కార్యకర్తల ఆధ్వర్యములో వార్షికోత్సవ వేడుకలు స్థానిక మండలము గర్నిమిట్టలో ఘనంగా జరిగాయి. పై కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న గజ్జల శృతిరెడ్డి వై.ఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గర్నిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అయిదు రకాల పండ్లను పంచారు. ఈ సందర్భముగా శృతి రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 90శాతం నెరవేర్చారని. మేనిపిస్టోను ఒక భగవద్గీత, బైబుల్, ఖురాన్ లాగా భావించి అమలు చేశాడని, మేనిపిస్టోలో లేని 40 పథకాలకు కూడా శ్రీకారం చుట్టారని. మన భారతదేశములోనే ఉత్తమ ముఖ్యమంత్రి మన వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పై కార్యక్రమములో మండల పార్టీ కన్వీనర్ వెంకటరమణ రెడ్డి, మాజీ జడ్.పి.టీ.సి జయరామచంద్రయ్య, గజ్జల శీను రెడ్డి, సుధీర్, మహేష్, మోహనరెడ్డి, కిషోర్ కుమార్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మాస్కులు పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు; పొన్నలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో HO సుబ్బారావు ి వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు.దాత ప్రజా టీవీ రిపోర్టర్ మద్దాళి సుబ్బరామయ్య సహకారంతో ప్రాధమిక ఆరోగ్య సిబ్బందికి 200 గుడ్డ మాస్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తో సేవచేయాలని అదే విధంగా ప్రజా టీవీ రిపోర్టర్ సుబ్బరామయ్యా తనవంతు సహాయంగా డ్యూటీ లో నిరంతరం కష్టపడుతున్న పోలీసులకు, ఆశావర్కర్లకు,రెడ్డి పాలెం st కాలనీలో మాస్కులు శానిటైజ్ లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా సుబ్బరామయ్య కు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలోHVపద్మజ,ప్రగతి,మైథిలి పాల్గొన్నారు.

ఏ ఊరులో 600 మందికి అన్నదానం చేసిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; గుడ్లూరు మండల పరిధిలోని చేవూరు సమీపంలో 600 మంది పేదలకు ఉపాధ్యాయులు ఏవి రావు కూరగాయల వ్యాపారి హిమాం అందించిన కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరర్రెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పేదల ఆకలి తిరుస్తున్న ప్రతి ఒక్కరు మహనీయుల అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

కారు బైకు ఢీ..ఒకరికి తీవ్ర గాయాలు

లోకల్ టైమ్స్ ఒంగోలు; గుడ్లూరు మండల పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో కారు బైకును ఢీకొన్న సంఘటనలో బైక్పై వెళ్తున్న యువకునికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలపాలైన యువకుని చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ప్రజల చేయూత కోసం 30 వేల నూట పదహారు రూపాయలు విరాళం అందజేసిన టిఆర్ఎస్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు సిబ్బంది

లోకల్ టైమ్స్ ఒంగోలు; ప్రస్తుత సమయంలో ప్రజల చేయూత కోసం ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోసం టిఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది శుక్రవారం 30 వేల నూట పదహారు రూపాయలు విరాళం ఎమ్మెల్యే కు అందజేశారు.

వలస కూలీలకు ఆహారం పంపిణీ చేసిన వాసవి సేవాదళ్

లోకల్ టైమ్స్ ఒంగోలు; లాక్ డౌన్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు నిరంతరం పేదలకు కార్మికులకు కూలీలకు నిరంతరం ఆహారాన్ని అందజేస్తున్న వాసవి సేవాదళ్ నిర్వాహకులు 29వ రోజు శుక్రవారం దాతలు మద్దాలి సుబ్రహ్మణ్యం కుమారుడు అమెరికాలో ఉన్న వెంకట సుధా మోహన్ చేయూతతో వలస కూలీల అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ నిరంతరం పేదలకు అన్నదానం చేయటంలో ప్రతి ఒక్కరు సహకరిస్తారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హెడ్కానిస్టేబుల్ చంద్రశేఖర్ పసుపులేటి పాపారావు అమర నా ద్శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ సినిమా షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ సినిమా షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ-ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సీఎంకు విజ్ఞప్తులు..

సినిమారంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

సినీ పరిశ్రమ బతకాలి..

సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు.

ఆ తర్వాతే కచ్చితమైన మార్గదర్శకాలు..

ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.

విద్యుత్ బిల్లులపై వినియోగదారులు అపోహలు పడవద్దు..వెంకటేశ్వర్లు

లోకల్ టైమ్స్ ఒంగోలు; విద్యుత్ బిల్లులు గురించి ప్రజలు అపోహలకు గురికావద్దని ఎలక్ట్రికల్ D.E కట్ట. వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ D.E కట్ట. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యుత్ బిల్లు ల గురించి విద్యుత్ రేట్లు పెరిగాయని ప్రజలు పలు రకాల అపోహలకు గురవుతున్నారన్నారు. ఈ సంవత్సరం కేవలం నెలకు 500 యూనిట్లు పైబడి వాడే వారికి మాత్రమే యూనిట్ కు 90 పైసలు రేటు పెంచడం జరిగిందన్నారు. ఒకటి నుంచి 500 యూనిట్లు లోపు వాడే వినియోగదారులకు ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్నారు. పాత రేట్ల ప్రకారమే విద్యుత్ బిల్లులు ఇవ్వడం జరిగిందన్నారు. కావున వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావద్దన్నారు.

దాతల చేయూత మరువలేనిది..ఎమ్మెల్యే మహీధర రెడ్డి

Mahidhar reddy manugunta - Home | Facebook

లోకల్ టైమ్స్ ఒంగోలు; దాతల చేయూత మరువలేనిదని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు శుక్రవారం కందుకూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో మాలకొండ దేవస్థానానికి చెందిన అధికారులు 25 వేల రూపాయల విరాళం మరో దేవస్థానం అధికారి బైరాగి పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి కందుకూరు నియోజకవర్గంలో చేయూత నిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు.

దాతల చేయూత మరువలేనిది.. ఎమ్మెల్యే మహీధర రెడ్డి

Manugunta Mahidhar REDDY - yuvasena... - Manugunta Mahidhar REDDY ...

లోకల్ టైమ్స్ ఒంగోలు: దాతల చేయూత మరువలేనిదని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో మాలకొండ దేవస్థానానికి చెందిన అధికారులు 25 వేల రూపాయల విరాళం మరో దేవస్థానం అధికారి బైరాగి పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి కందుకూరు నియోజకవర్గంలో చేయూత నిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు.

Design a site like this with WordPress.com
Get started