మరోసారి ప్రజలను మోసం చేసిన మోడీ – సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు

కలికిరి, మే 13; ప్రధాని 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అస్పష్టంగా చెప్పడం చూస్తే మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాడని సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు బుధవారం ఒక ప్రకటన లో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వావలంబన భారత్ అన్న నినాదం ఇస్తూ ఆర్థిక సంస్కరణలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రకటించారు. ఈ ఆర్థిక సంస్కరణలే స్వావలంబన ను దారుణంగా దెబ్బ తీశాయి. ఇంకా తీస్తున్నాయి. మరి మన స్వావలంబన భారత్ నినాదం సంస్కరణలు వేగవంతం చేయడం అనేది సాధ్యం కాదు. స్వదేశీ, లోకల్ మార్కెట్ బలోపేతం వంటి మాటలు కూడా చెప్పారు. అయితే లోకల్ మార్కెట్ ఆర్థిక సంస్కరణల కారణంగానే దెబ్బతిన్నది. ఇలాంటివి ప్రజలకు చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసం ఉపన్యాసం ఇచ్చి అస్పష్టంగా ముగించడం చూస్తే మరోసారి ప్రజాస్వామ్యంపై దాడి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా స్పష్టంగా కరోనా నివారణలో భాగంగా శాస్త్రీయమైన పద్ధతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో కలికిరి, వాల్మీకిపురం, మదనపల్లి, ములకలచెరువు, రామసముద్రం ఇలాంటి మండలాల్లో కరోనా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాంతం కరవుతో విలయతాండవం చేస్తున్నది. ఇలాంటి సందర్భంలో కరోనా వచ్చి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. లాక్ డౌన్ వలన వ్యవసాయం కుదేలైంది .టమోటా రైతులు ఇతర పండ్ల తోటల రైతులు భారీ స్థాయిలో నష్టపోయారు. పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై పోయిన పరిస్థితి ఉంది .సరైన ఆహారం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సందర్భంలో కరోనా వైరస్ విస్తరించడంతో ప్రజలకు ఏమి చేయాలో తోచక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఈ ప్రాంత ప్రజానీకంను ఆదుకోవడానికి జిల్లా యంత్రాంగం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు కోరుతున్నది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా వుంటూ కరోనా వైరస్ నివారణకు సరైన జాగ్రత్తలు పద్ధతులు పాటించాలని పిలుపునిచ్చారు. బౌతిక దూరం పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ మాస్కులు లాంటి పరికరాలు ఉపయోగిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా రక్షణ పరికరాలు ప్రజలందరికీ అందించాలని డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో త్రాగు నీరు లేక అల్లాడుతున్నారు. అధికార యంత్రాంగం తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకి సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కి ఆరోగ్య కార్యకర్తలకు ఇతర సిబ్బందికి రక్షణ సౌకర్యాలు కల్పించడంతోపాటు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలపై 14వ తేదీ జరిగే ఆందోళన కార్యక్రమాల్లో అంగన్వాడి, ఆశ, వి.ఓ.ఏ, పంచాయతీ అన్ని రకాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చాడు.

ఉపాధ్యాయులకు పూర్తి వేతనాలు చెల్లించాలని యుటిఎఫ్ పొదిలి ప్రాంతీయ మండలాలు


లోకల్ టైమ్స్ ఒంగోలు;రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మార్చి నెల ఏప్రిల్ నెలలో సగం జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. మే నెలలో పూర్తి జీతం ఇవ్వాలని మరియు మార్చి, ఏప్రిల్ నెల 50 శాతం జీతం కూడా చెల్లించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పి రమణ రెడ్డి , మరియు యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీ షేక్ అబ్దుల్ హై సంయుక్తము గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏప్రిల్ నెలలో పెన్షనర్లు అత్యవసర సిబ్బందికి పూర్తిగా వేతనాలు చెల్లించారాని మిగిలిన ఉద్యోగులకు సగం వేతనాలు చెల్లించారాని పేర్కొన్నారు .ఎక్కువ మంది ఉద్యోగులు వారి గృహం, విద్య, వ్యక్తిగత రుణములు చెల్లించలేక లాక్ డౌన్ కారణంగా పెరిగిన ఖర్చులు ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు ఫిబ్రవరి నెలలో ఆదాయం పన్ను చెల్లించి నందున ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లాక్ డౌన్లో లో భాగంగా సగం మంది ఉపాధ్యాయులు కరోనా విధులు కూడా నిర్వహించినారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని మే నెలలో పూర్తి వేతనాలు ఇవ్వాలని మిగిలిన 50 శాతం జీతాలు మార్చి ఏప్రిల్ నెల తక్షణం మంజూరు చేయాలని ఏపీ జి ఎల్ ఐ, పిఎఫ్, జి ఐ ఎస్ తదితర మినహాయింపులు జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినారు. పై కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వి ఎస్ కే రాజేశ్వరరావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి బుజ్జిబాబు మూడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి బాల కాశి రెడ్డి చవలంవెంకటేశ్వర్లు చంద్రమౌళి గోనే శ్రీనివాసులు వి.వెంకటేశ్వర్లు సిహెచ్ లింగయ్య మొదలగు వారు పాల్గొన్నారు.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

లోకల్ టైమ్స్ ఒంగోలు; ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు రైతు సంఘం రాష్ట్ర సమితి నాయకులు కె వీరారెడ్డి ఆధ్వర్యంలో నరసింగరావు బ్రహ్మయ్య ఆనంద్ కుమార్ లు వినతి పత్రం అందజేశారు. బుధవారం కందుకూరు పట్టణంలోని ctri లోజరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారని పరిధిలో రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లుతుందని వివరించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం కార్యక్రమంతో పొగాకు కొనుగోళ్ళు 50 రోజులు ఆలస్యం కావటం గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వారిని ఆదుకోవాలని కోరారు. స్పందించిన రఘునాథబాబు ఇప్పటికే వ్యాపారులతో చర్చించామని రైతులు ఆందోళన చెందవద్దని గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చివరి పొగాకు బేల్ అమ్ముడుపోయిన వరకు కొనుగోళ్లు కొనసాగుతాయి

రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం..పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు


లోకల్ టైమ్స్ ఒంగోలు; రాష్ట్రవ్యాప్తంగా పొగాకు రైతులు నష్టపోకుండా పొగాకు వేలం కేంద్రాల ద్వారా రైతులు పండించిన పొగాకు చివరి పొగాకు బెళ్లు అమ్ముడు పోయేవరకు కొనుగోలు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు తెలిపారు. బుధవారం కందుకూరు పట్టణంలోని సి టి ఆర్ ఐ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పొగాకు రైతులు నష్టపోకూడదనే రాష్ట్రవ్యాప్తంగా పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించామని ఆయన వివరించారు. ముఖ్యంగా వ్యాపారులతో బోర్డు అధికారులతో చర్చించామని రైతు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నష్టపోకూడదనే కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు ఆదేశానుసారం నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వ్యాపారులు ఇప్పటికే తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని రైతుల సమస్యలను వారిది తీసుకెళ్లి చర్చించామని రైతులకు నష్టం లేకుండా కొనుగోలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సి టి ఆర్ ఐ అధికారులతోపాటు పొగాకు వేలం కేంద్రం అధికారులు పాల్గొన్నారు.

పొగాకు కిలో గరిష్ట ధర 172 రూపాయలు..కనీస ధర 110 రూపాయలు

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణ పరిధిలోని పాము రోడ్డులో గల 27వ పొగాకు వేలం కేంద్రంలో రైతులు తీసుకొచ్చిన పొగాకు కిలో గరిష్ట ధర 172 రూపాయలు కనీస ధర 110 రూపాయలు పలికినట్లు నిర్వహణ అధికారి లక్ష్మణ్ రావు తెలిపారు. కేంద్రానికి బుధవారం 578 పొగాకు 499 కొనుగోలు చేయ బడ్డాయి మిగిలిన బెళ్లుు కొనుగోలు చేయడం లేదని తెలిపారు సరాసరి ధర 142 రూపాయల 90 పలికిందని ఆయన తెలిపారు.

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

లోకల్ టైమ్స్ ఒంగోలు: మార్కాపురం జనసేన పార్టీ,ఇన్ చార్జి శ్రీ ఇమ్మడి. కాశీనాథ్ భౌతికదూరాన్ని పాటిస్తూ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కార్యకర్తలు జనసైనికులు, విశేషంగా పాల్గొని”102″ మంది రక్తదానం చేశారు.ఇందులో భాగంగా ఇమ్మడి కాశీనాథ్ స్వయంగా రక్త దానం చే శారు . ఈ సందర్భంగా ఇమ్మడి. కాశీనాథ్ మాట్లాడుతూ లాక్ డౌన్, మొదలుకొని ఈరోజు వరకు “49” రోజులపాటు ప్రతిరోజు మూడువందల మందికి భోజనంప్యాకెట్లు,శానిటైజర్ జెల్ లు, మాస్కులు, పంపిణీ చేయడం జరిగిందనీ,అలాగే మురికివాడల లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగిందనీ, ఈ సేవా కార్యక్రము లలో భాగంగా లాక్ డౌన్ మొదలుకొని నేటి వరకు”49″రోజులు తనకు వెన్నుదన్నుగా నిలిచి తనతోపాటు ప్రయాణించిన జన సైనికులకు కార్యకర్తలకు ఈరోజు నెలకొల్పిన రక్తదాన శిబిరాన్ని జయప్రదంచేసి, “102” మంది రక్తదానం చేసిన కార్యకర్తలకు, జనసైనికులకు, ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా లాక్ డౌన్, కారణంగా శ్రీశైల దేవస్థానమునకు యాత్రికులను అనుమతించకపోవడంతో నల్లమల ప్రాంతంలోని నోరులేని మూగజీవాలైన కోతులకు పలుమార్లు ఆహారం అందజేయడం జరిగిందనీ, తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఏరియావైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఇన్ చార్జి Dr.పిచ్చిరెడ్డి,జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ మిత్రమండలి ఇమ్మడి కాశీనాధ్ అభిమానులు మరియు మార్కాపురం పట్టణం లోని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొనడ మైనది.అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ మరియు జనసైనికులని అభినందించి సంఘీభావం తెలియచేసారుచేశారు రక్తం నిలువలు తక్కువగా ఉండి సరిఅయిన సమయంలో ఈ క్యాంపు నిర్వహించినందుకు బ్లడ్ బ్యాంకు ఇంఛార్జి dr.పిచ్చిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉరివేసుకొని మహిళ అనుమానాస్పద మృ తి

వార్తలు

లోకల్ టైమ్స్ ఒంగోలు: పట్టణ పరిధిలోని పామూరు రోడ్ లోగల పడమర వడ్డె పాలెం ప్రాంతంలో ఉరివేసుకొని వరమ్మ (40) అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మృతిచెందిన వరమ్మతో పాటు ఆమె భర్త కుమారుడు కుమార్తె తో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చికెన్ న్యూడిల్స్ తోపుడు బండితో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు .కుటుంబ కలహాలు కూడా పెద్దగా లేవని స్థానికులు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు .ఈ క్రమంలో సోమవారం రాత్రి ఏమి జరిగిందో తెలియదు గానీ మంగళవారం ఉదయానికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించిన దృశ్యం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని విచారణ ఇచ్చారు. ఈ సంఘటన వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి తీసుకురావలసిన బాధ్యత పోలీసులపై ఉందని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

బొమ్మ బొరుసు జూదంపై SI రవీంద్రారెడ్డి వరుస దాడులు..

12 మంది అరెస్టు, 5,350/- స్వాధీనం…

లోకల్ టైమ్స్ ఒంగోలు: బేస్తవారిపేట మండల SI రవీంద్రారెడ్డి మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా తనదైన శైలిలో దాడులు నిర్వహిస్తూ శాంతిభద్రతలను పరిరక్షిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని స్థానిక ఓబులరెడ్డి కళాశాల ఆవరణలో బొమ్మ బొరుసు ఆటుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 5,350/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మాస్క్‌లు ధరించని వారికి జరిమానా

ముఖానికి మాస్కులు లేకుండా బయటకొచ్చిన 6 మందికి రూ.2100 జరిమానా.. అనవసరంగా, మాస్కులు లేకుండా బయట తిరగొద్దని జిల్లా ప్రజలకు సూచించిన అడిషనల్ కలెక్టర్ ముజంమీల్ ఖాన్

సిద్దిపేట్ లోకల్ టైమ్స్ ప్రతినిధి; సిద్ధిపేట : మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజంమీల్ ఖాన్ జరిమానా విధించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని పాత బస్టాండు సర్కిల్ లో మంగళవారం మధ్యాహ్నం మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 6 మందికి రూ.500 నుంచి రూ.1000 రూపాయల చొప్పున్న మొత్తం రూ.2100 రూపాయల జరిమానా విధించడంతో పాటు మరోసారి అనవసరంగా రోడ్లపై తిరగొద్దని గట్టిగా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఏవరైనా అవసరం నిమిత్తం బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. లేదంటే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన అధిక జనంతో పాటు దుకాణదారులు సైతం కనీసం మాస్కులు ధరించలేదని సిద్ధిపేట పాత బస్టాండ్ సర్కిల్ లోని మల్లిఖార్జున ఎలక్ట్రికల్స్- సోని దుకాణ యజమాని చంద్రశేఖర్ పై రూ.1000 రూపాయల చొప్పున్న జరిమానా విధించారు. అనంతరం విక్టరీ సర్కిల్ లోని ఓ మొబైల్ షాపులో జనం గుమిగూడి ఉండటం, మాస్కులు ధరించని యజమాని పై అగ్రహం వ్యక్తం చేస్తూ., రూ.5వేలు జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి, దుకాణం వద్ద భౌతిక దూరం పాటించని, మాస్కులు ధరించని యజమానులకు జరిమానాలు విధించినట్లు అడిషనల్ కలెక్టర్ ముజంమీల్ ఖాన్ చెప్పారు. ఈ కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు కూడా చేయడంతో విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలను కట్టడి చేసేందుకు మంగళవారం రోడ్లపై మాస్కులు లేకుండా, అనవసరంగా తిరుగుతున్న వారికి జరిమానా విధించినట్లు, ఏవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, శానిటరీ ఇన్స్ పెక్టర్ సతీష్, బిల్ కలెక్టర్లు యాదరిగి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • పనులు తొందరగా పూర్తి చేయాలి

సిద్ధిపేట : కేంద్రీకృత తడి, పొడి చెత్త సేకరణ కేంద్రం (మిడిల్ ట్రాన్స్ ఫర్ మిషన్ యూనిట్ ) పనులు తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరును జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజంమీల్ ఖాన్ ఆదేశించారు. పట్టణ శివారులోని హౌసింగ్ బోర్డులో ఉన్న కేంద్రీకృత తడి, పొడి చెత్త సేకరణ యూనిట్ నిర్మాణ పనులను మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. పట్టణ నివాస గృహాల నుంచి సేకరించే తడి, పొడి చెత్త మిడిల్ యూనిట్ కు తరలించి వేరు చేసే ప్రక్రియ పై చేపట్టిన ప్రణాళికల గురించి కమిషనర్ తో ఆరా తీశారు. అసంపూర్తి పనులన్నీ వెంటనే పూర్తి చేసి తొందరగా వినియోగంలోకి తేవాలని కమిషనర్ కు అడిషనల్ కలెక్టర్ సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి కిలేదు: మాజీ శాసనసభ్యుడు చింతా ప్రభాకర్

సంగారెడ్డి : లోకల్ టైమ్స్ బ్యూరో : మే 12: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరకు , ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు భీమా, పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించడం లాంటి పధకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఆ విషయాలపై అవగాహనా లేకుండా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి( జగ్గారెడ్డి)కి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విలేకర్ల సమావేశంలో గురువారం సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్నారు.మంగళవారం పట్టణంలో విలేకర్ల సమావేశంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడం వలన ప్రజలు నిత్యావసరాలు లేక బాధపడుతుంటే నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడకుండా జగ్గారెడ్డి హైదరాబాద్ లో కూర్చొని రాజకీయ విమర్శలు చేయడం ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ను విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదనీ, ఆర్ధిక మంత్రి హరీష్ రావు అని ఆయన అన్నారు. సంగారెడ్డి కి వస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని అడ్డుకుంటానన్న జగ్గారెడ్డి రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలే ఆయనపై తిరగబడేలా చేసుకుంటున్నారని అన్నారు.ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటె ప్రజలలో తిరుగుతూ వారి సమస్యలు తీరుస్తూ, వారికీ ధైర్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మద్దతుగా ఉండి ప్రజా సమస్యల గురించి తెలుసుకోకుండా నాయకులను ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శించే అర్హత లేదని అన్నారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు మురళి యాదవ్, జైపాల్ రెడ్డి, బుచ్చి రెడ్డి, మాణిక్యం డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

సబ్సిడీ విత్తనాలను వినియోగించుకొని అధిక దిగుబడిసాధించాలి..ఎమ్మెల్యే జగ్గారెడ్డి

లోకల్ టైమ్స్ ప్రతినిధి కొండాపూర్; సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి లాభాలు పొందాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తెర్పోల్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై జనుము విత్తనాలను రైతులకు అందజేశారు . తీర్పులు సొసైటీ చైర్మన్ నరసింహారావు దేశ్పాండే అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి పంటల దిగుబడిని పెంచాలని ఆయన రైతులకు సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న విత్తనాలను సబ్సిడీ యంత్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఏ డి ఏ మనోహర మాట్లాడుతూ పంటలు అధిక దిగుబడి రావడం కొరకు వర్షాకాలానికి ఒక నెల ముందు ఈ జనుము విత్తనాలు రైతులు పొలాల్లో వేసుకుంటారు కాబట్టి కొండాపూర్ మండల రైతులకు అందుబాటులో మల్కాపూర్,కొండాపూర్,తేర్పోల్ సొసైటీ కేంద్రాల వద్ద 45 కేజీల బస్తా 65 శాతం సబ్సిడీతో 924 రూపాయలకు రైతులకు ఇవ్వడం జరుగుతుందని కావలసిన రైతులు తమ పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డుతో సొసైటీ కేంద్రాల వద్ద కొనుక్కోవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్ రెడ్డి సొసైటీ చైర్మన్ నరసింహారావు దేశ్పాండే వైస్ చైర్మన్ రామ్ రెడ్డి కొండాపూర్ మండల వ్యవసాయ అధికారి ప్రతిభ జెడ్ పి టి సి పద్మావతి పాండురంగం కాంగ్రెస్ నాయకులు సతీష్ కాంగ్రెస్ పార్టీ కొండాపూర్ మండల అధ్యక్షులు నగేష్ మాజీ మండల అధ్యక్షులు వై ప్రభు కొండాపూర్ ఎంపిటిసి నరసింహారెడ్డి ఏఈవో రవి గ్రామ రెవెన్యూ అధికారి కృష్ణయ్య గ్రామ సర్పంచ్ సొసైటీ డైరెక్టర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

గంగారం గ్రామంలో ఉపాధి కూలీలకు అంబలి పంపింణి

కొండాపూర్ లోకల్ టైమ్స్ ప్రతినిధి; మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఉపాధి కూలీలకు ఒక పూట అంబలి పంపిణీ చేయడం జరిగింది ఉపాధి కూలీలకు 400 రూపాయలు ఇవ్వాలని అలాగే కుటుంబానికి 50 కేజీ ల బియ్యం పంపిణీ చేయాలని 18 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని కుటుంబానికి 7500 రూపాయలు అలాగే ఉపాధి బిల్లులు వెంటనే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు మాట్లాడారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల లో ఉపాధిహామీ బిల్లు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళన చేస్తామని జూన్ 1న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యేసు రాంచందర్ రాజు కుమార్ ప్రవీణ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జీ నర్సింలు ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

అదుపు తప్పి ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

కొండాపూర్ లోకల్ టైమ్స్ ప్రతినిధి; మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి నేషనల్ హైవే 65 ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది .వివరాల్లోకెళ్తే కంకులు గ్రామం మునిపల్లి మండలం సంగారెడ్డి జిల్లా కు చెందిన తుమ్మలపల్లి మహేష్ తండ్రి బుచ్చయ్య వయసు 30 సంవత్సరాలు అతని మిత్రుడు అయిన బోడేపల్లి ప్రభు తండ్రి చంద్రయ్య వయస్సు 35 సంవత్సరాలు కులం లింగాయత్ వీరిద్దరూ తమ సొంత పనికై తేదీ 12 5 2020 నాడు ఉదయం 11 గంటల సమయంలో తు మా ఇంటి నుంచి బయలుదేరి పోతుండగా మార్గ మధ్యలో మల్కాపూర్ గ్రామ శివారులోని రహదారిపై డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వాహనం నెంబర్ TS15 EJ5329 సమాచారం తెలుసుకున్న కొండాపూర్ పోలీసులు 2 శవాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్చు కొరకు తరలించడం జరిగిందని కొండాపూర్ ఎస్సై రాజు తెలియజేశాడు. తుమ్మల పల్లి వెంకటేశం తండ్రి బుచ్చయ్య వయస్సు 38 సంవత్సరాలు మృతుల పట్ల కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

జగ్గారెడ్డివి అవగాహన లేని మాటలు –చింతా ప్రభాకర్

సంగారెడ్డి లోకల్ టైమ్స్ బ్యూరో : రైతుల సంక్షేమం కోసం , ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు భీమా, పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించడం లాంటి పధకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఆ విషయాలపై అవగాహనా లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.మంగళవారం పట్టణంలోని PSR గార్డెన్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడం వలన ప్రజలు నిత్యావసరాలు లేక బాధపడుతుంటే నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడకుండా జగ్గారెడ్డి హైదరాబాద్ లో కూర్చొని రాజకీయ విమర్శలు చేయడం ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ని విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదనీ, ఆర్ధిక మంత్రి హరీష్ రావు కాలి గోటి మీద ఉన్న దుమ్ముతో జగ్గారెడ్డి సమానం అని ఆయన అన్నారు. సంగారెడ్డి కి వస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని అడ్డుకుంటానన్న జగ్గారెడ్డి రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలే ఆయనపై తిరగబడేలా చేసుకుంటున్నారని అన్నారు.ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటె ప్రజలలో తిరుగుతూ వారి సమస్యలు తీరుస్తూ, వారికీ ధైర్యంగా హితవు పలికారు.ఈ సమావేశంలో నాయకులూ మురళి యాదవ్, జైపాల్ రెడ్డి, బుచ్చి రెడ్డి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..కె వీరారెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బాధ్యత అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు వ్యాపారులపై ఉందని రైతు సంఘం జిల్లా నాయకులు కె వీరారెడ్డి ఒక ప్రకటన ద్వారా అన్నారు. ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరం పొగాకు రైతులు నష్టాలతో అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఈ సంవత్సరం పొగాకు ఉత్పత్తి బాగా ఉన్న సమయంలో అకాల వర్షాలతో పొగాకు నాణ్యత తగ్గి రైతులు దిగాలు పడ్డారు అని అన్నారు. ఈ క్రమంలో లాక్ డౌన్కార్యక్రమంతో 50 రోజులు పొగాకు కొనుగోలు లేకపోవడంతో పొగాకు రంగు మారిందని ఈ క్రమంలో పున ప్రారంభమైన వేలం పాటల్లో బయ్యర్లు గిట్టుబాటు ధర అందించగా రైతులకు ఆవేదనను చూస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు బోర్డు అధికారులు వ్యాపారులు చర్చించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పండించే రైతు గిట్టుబాటు ధర లభించక నిరంతరం అప్పుల పాలు అవుతున్న సందర్భంలో వ్యాపారులు దళారులు ఏ విధంగా కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తుతారు అని ప్రశ్నించారు .ఈ క్రమంలో తప్పనిసరిగా పొగాకు రైతులను ఆదుకునే విధంగా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టాక్టర్ సీజ్

లోకల్ టైమ్స్ ఒంగోలు; వేటపాలెం మండలం పరిదిలోని చల్లారెడ్డి పాలెం గ్రామ సమీపంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను ఎస్ఐ అజయ్ బాబు మంగళవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఏ ఒక్కరూ ఇసుకను అక్రమంగా తరలించిన క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉలవపాడు లింగసముద్రం మండలాల్లో రెవెన్యూ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరుపై ప్రజల ఆరోపణలు

పేదల భూములు అన్యాక్రాంతం..
మౌనం వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటి..
ఉపాధి పనుల్లో కమీషన్లకు కక్కుర్తి..
10 శాతం కమీషన్ కావాలంటున్న అధికారులు..

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు నియోజకవర్గ పరిధిలో కరోనామహమ్మారి భయంతో ప్రజాప్రతినిధులు ప్రజలు నిరంతరం తమ సమీపానికి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో లింగసముద్రం ఉలవపాడు మండలాల్లో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడే నాయకులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమకు కరోనా అంటే భయం లేదని తమ పనులు తమకు ముఖ్యమని వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా లింగసముద్రం మండలం లో రెవిన్యూ శాఖ అనేది ఉందా అనే అనుమానాలు ప్రజలకు జిల్లా స్థాయి అధికారులకు ప్రజాప్రతినిధులకు వచ్చిన నేటికీ ఫలితం కనిపించలేదు. భూమి ఎవరిదైనా ఆన్లైన్లో పేరు సర్వసాధారణ అన్న నానుడికి లింగసముద్రం నిదర్శనంగా నిలిచింది. రెవిన్యూ అధికారి వచ్చిన భూముల సమస్యల పరిష్కారంలో ఎలాంటి మార్పు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలకు చెందిన భూములు ఏవిధంగా అన్యా క్రాంతం పై స్థాయి అధికారులు ఎన్నిసార్లు చేసినా మార్పు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములు పోరంబోకు భూములు పోరంబోకు భూములు అన్యాక్రాంతమైన సాగులో ఉన్న అడిగే నాథుడే లేరు. ఆక్రమణ జరిగిన సమయంలో చర్యలు తీసుకుంటే ఆక్రమించిన బడాబాబులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశమే ఉండదు కదా అని కడుపు మండిన సామాన్య ప్రజలు తిట్ల పురాణం వినిపిస్తున్నారు. మండలంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న విధంగా భూముల వ్యవహారం ఉన్నాయి గిరిజనులకు చెందిన సొసైటీలో గిరిజనులు కాకుండా వేరే వారు ఉన్న అడిగేవారే లేరు. అదేవిధంగా దౌర్జన్యంగా భూములు ఆక్రమించిన రెవెన్యూ అధికారులు ప్రశ్నించలేని మౌనం వెనుక దాగియున్న మర్మం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అదే విధంగా రెవిన్యూ కార్యాలయంలో అధికారులు ఉద్యోగుల మధ్య విభేదాలను ఆక్రమణదారులు వినియోగించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి .గతంలో ఒక పంచాయతీ కార్యదర్శి కోటి 20 లక్షలు స్వాహా చేసిన చర్యలు శూన్యం గా మారాయి రెవిన్యూ కార్యాలయంలోని ఒక ఉద్యోగి ఎప్పటికప్పుడు కార్యాలయంలో జరిగే తతంగం అంతా ఆక్రమణదారుల చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ సామాన్యుడికి న్యాయం అన్నది కలలోమాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధిహామీ నెలల్లో చిన్నచిన్న అవకతవకలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సాధారణంగా జరిగే తంతే అయితే ఇటీవల ఉపాధి ద్వారా ఆయా గ్రామాల్లో కోట్లాది రూపాయల అందించటంలో నిధులు తీసుకురావడంతో ఎమ్మెల్యే చేయూత ఎంతో ఉంది అయితే ఇక్కడే సమస్య మొదలైంది. గతంలో మాదిరి మూడు నాలుగు శాతం కమీషన్ కాకుండా 10% కమిషన్లు తమకు అందించాలని ఉద్యోగులు అధికారుల తీరుపై ఆప్ ఎమ్మెల్యే అసహనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చివాట్లు పెట్టినట్లు సమాచారం. గత కొంతకాలంగా గమనిస్తే ఎస్టిమేషన్అంశంలో కూడా పక్కనే నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి ఎంతో తేడా ఉంది .ఈ తేడా వెనుక దాగి ఉన్న అసలు మర్మం కమీషన్లకు కక్కుర్తి అని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఆయా మండలాల్లో ఉన్న గ్రీన్ జోన్ లో అధికారులు తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపితే సమస్యలు పరిష్కారం అయ్యే అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూలైలో పదో తరగతి పరీక్షలు..ఏపీ విద్యా శాఖమంత్రి సురేష్ క్లారిటీ..!

tenth exams will be counduct july month: minister suresh

లోకల్ టైమ్స్ ఒంగోలు; ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. జూలై 1వ తేది నుంచి 15వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన సురేష్‌ వివరించారు. అలాగే పదో తరగతి పరీక్షల కోసం సాధారణంగా 2,900 సెంటర్లు అవసరమవుతుంటాయని.. కానీ భౌతిక దూరం నేపథ్యంలో కొత్త సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒక్కో క్లాస్ రూమ్‌లో 12 మంది విద్యార్థులతో పరీక్షలు రాయించనున్నామని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే మేనెలలో టెన్త్‌ పరీక్షలు ఉంటాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని.. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

లోకల్ టైమ్స్ ఒంగోలు; బేస్తవారిపేట మండల పరిధిలోని బార్ల కుంట గ్రామ సమీపంలో నాటు సారా ను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊట ను గుర్తించి ధ్వంసం చేసిన బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి పోలీసు సిబ్బంది..

50వ రోజు 200 మంది పేదలకు అన్నదానం చేసిన వాసవి సేవాదళ్ నిర్వాహకులు

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణం లో లాక్ డౌన్ ప్రారంభంనుంచి నేటి వరకు ప్రతిరోజు దాతల చేయూత లేదా తమ సొంత నిధులతో ప్రతిరోజు పేదలకు అన్నదానం చేస్తున్న వాసవి సేవాదళ్ నిర్వాహకులు 50వ రోజు మంగళవారం కందుకూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల సంచారజాతుల పేదలకు దాతలు ఆయన స్నేహితులు నాగ శివ జ్యోతి కిరణ్ కుమార్ విజయ్ కుమార్ అందించిన ఆహారాన్ని పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి చక్కావెంకట కేశవరావు మాట్లాడుతూ పక్కవాడికి సహాయం ఏం చేస్తే ఆ సహాయం మనకు మరో రూపంలో ఉపయోగ పడుతుందని భావించిన తాము తమ సంస్థ ప్రతినిధులు నిరంతరం పేదలకు అన్నదానం చేస్తున్నామని అన్నారు. అన్న దానం చేసేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హెడ్ కానిస్టేబుల కోలా్ చంద్రశేఖర్ పసుపులేటి పాపారావు బుచ్చయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.

750 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసిన SI సమందర్ వలి: ఒకరు అరెస్టు

లోకల్ టైమ్స్ ఒంగోలు; గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై si సమందర్ వలి మంగళవారందాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 750 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా SI సమందర్ వలి మాట్లాడుతూ.. నాటుసారా తయారు చేయటం అమ్మటం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పేద ముస్లీంలకు రంజాన్ తోఫాను అందించి చేయూతనిచ్చిన ముస్లిం మైనారిటి నాయకుడు సయ్యద్ జ బీల్ల!

లోకల్ టైమ్స్ ఒంగోలు; ఈ లాక్‌డౌన్‌ ( Covid 19 ) తోఇబ్బంది పడుతున్న యర్రగొండపాలెం పట్టణం లోని పేద ముస్లిం మైనారీటీలకు రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి డా ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా మైనారిటి నాయకులు జబీవుల్లా ఇంటివద్ద ఆయన ఆద్వర్యంలో పట్టణంలోని 300 మంది ముస్లీంలకు రంజాన్ తోఫా ను ఆయన అందజేసారు…!ఈ కార్యక్రమంలో మంత్రి డా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పవిత్రరంజాన్ మాసంలో ముస్లీంలు చేపట్టే ఉపవాస ధీక్షల గురించి కొనియాడారు జగనన్న ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుందని అన్నారు…!మరియు జబీవుల్లా మాట్లాడుతూ ముస్లీం సోదరులు జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని హమారా జగన్ హమారా వై సి పి అంటు జగనన్నను ముఖ్యమంత్రిని చేసారని అన్నారు…!ఈ కార్యక్రమంలో పట్టణం లోనీ ముస్లింల సమస్యలపై మంత్రి సురేష్ గారికి ముస్లిం మతపెద్దలు వినతి పత్రాన్ని అందించారు..!అనంతరం YCP నాయకులు మరియు ముస్లీం మతపెద్దలు, వాలంటీర్ల చేతుల మీదుగా నిరు పేద ముస్లీం కుటుంబాలకు రంజాన్‌ తోఫా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది..! ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్ ో పాటు మార్కెట్ యార్డ్‌ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి ,మండల పార్టీ అద్యక్షులు దొంతకిరణ్‌ గౌడ్‌,Ex Mpp చేదూరి విజయ్‌ భాస్కర్,జిల్లా PDCC బ్యాంక్ డైరెక్టర్ మూడమంచు బాలగురవయ్య,కందురు గురు,మాజి సొసైటీ అద్యక్షలు కొప్పర్తి ఓబుల్‌ రెడ్డి, ఇమ్మడి షట్టి సుబ్బారావ్‌, అధికార ప్రతినిధి నరిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సూరే రమేష్, మహిళా అద్యక్షురాలు అరుణా బాయ్‌ ముస్లిం మతపెద్దలు హిదాయత్‌ హౌలానా,కరిముల్ల బేగ్‌,సాబిర్‌ బాష,మౌలాలి, ఫజులు, తదితరులు పాల్గొన్నారు…!

వలస కూలీలను స్వగ్రామాలకు తరలించాలి…భీమ్ ఆర్మీ డిమాండ్

లోకల్ టైమ్స్ ఒంగోలు; కరోనా విపత్తులో చిక్కుకున్న వలస కార్మికులు దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా వారి బతుకులు దినదిన గండంగా మారిందని కేంద్ర ప్రభుత్వం వెంటనే వారిని స్వగ్రామాలకు తరలించాలని భీమ్ ఆర్మీ డిమాండ్ చేసింది. మంగళవారం భీమ్ ఆర్మీ, ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ వలస కార్మికులు పడుతున్న బాధలను గమనించి దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా కందుకూరు అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ ఆర్మీ నేతలు, ప్రజాసంఘాల జేఏసీ నాయకులు నిరసన కార్యక్రమం జరిపారు. తొలుత జేఏసీ నాయకులు బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది వలస కూలీలు వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్నారని చెప్పారు. ఫ్యాక్టరీలలో అనేక విభాగాలలో పనిచేసే కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు లాక్ డౌన్ కారణంగా పస్తులుంటున్నారని చెప్పారు. పనులు ఆగిపోవడంతో యాజమాన్యాలు వారికి జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ స్వగ్రామాలకు వెళ్లి పోదామంటే కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా ఉన్న చోటనే ఉండవలసి రావడంతో కోట్లాది కుటుంబాలు పస్తులుంటున్నారని చెప్పారు. వేలాది మైళ్ళు నడిచి వెళుతున్న కార్మికులు కొందరు మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారని వెల్లడించారు. రైలు పట్టాలపై ప్రయాణిస్తూ రాత్రి సమయంలో పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులు 32మంది అక్కడే రైలుకిందపడి ప్రాణాలు కోల్పోయారన్నారు. విస్తృతంగా రైళ్లను ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తరలించాలని డిమాండ్ చేశారు. సిఐటియు అధ్యకులు గౌస్ మాట్లాడుతూ వలస కార్మికులు పడుతున్న బాధలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు 68వేలకోట్లు రుణాలు మాఫీ చేసిన ప్రధాని మోడీ కరోనా కష్టకాలంలో దేశ వ్యాప్తంగా బాధితులను ఆదుకోవడానికి 15వేల కోట్లు ప్రకటించిన చేతులు దులుపు కున్నారన్నారు. తక్షణమే వలస కార్మికులను స్వగ్రామాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బూసి సురేష్ బాబు మాట్లాడుతూ వలస కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు. కార్మికులు ఆకలితో అల్లాడి పోతున్నారని చెప్పారు. ఎవరో ఒకరు దాతలు ఇచ్చిన ఆహారంతో సురిపుచ్చుకొని జాతీయ రహదారులు, రైళ్ల పట్టాలపై పరుగులు తీస్తున్నారని చెప్పారు. కార్యక్రమానికి భీమ్ ఆర్మీ ప్రతినిధి కసుకుర్తి మాల్యాద్రి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ధర్మచక్ర ఫౌండేషన్ అధ్యక్షులు గాండ్ల హరిప్రసాద్, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నె దారి నాగభూషణం, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జమ్మలమడుగు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కొప్పోలు ధనుంజయ రావు, ఎడిఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంజి గోపిరాజు, న్యాయవాది దారా మాధవరావు, శ్రీనగర్ కాలనీ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొట్లగుంట శ్రీనివాసులు, కసుకుర్తి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి…

లోకల్ టైమ్స్ ఒంగోలు; కరోనా నేపథ్యంలో 300 యూనిట్లు వరకు ఉన్న విద్యుత్తు బిల్లులను మూడు నెలల పాటు రద్దు చేయాలని ప్రకాశం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్.అబ్దుల్ అజీమ్ తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద వర్గాలకు చెందిన ప్రజలకు పెరిగిన విద్యుత్తు ఛార్జీలు పెను భారంగా మారాయన్నారు.అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యుత్తు చార్జీలను మూడు నెలలపాటు రద్దు చేయకుండా బకాయిలను రెట్టింపు స్థాయిలో పెంచడం వలన ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టాలకు తోడుగా కరెంటు కష్టాలు ప్రజలకు తీవ్ర ఒత్తిడిని గురిచేస్తున్నాయని పేర్కోన్నారు.విద్యుత్తు ఛార్జీలు 30 రోజులకు రెండు నెలలోపు విడివిడిగా తీసి పాత స్లాబ్ విధానాన్ని అమలు చేయవలసి ఉన్న , విద్యుత్తు అధికారులు మార్చి చివరి నుండి మే చివరి వరకు రీడింగ్ కౌంట్ చేయటం వల్ల వినియోగదారులు సి – కేటగిరీలోకి రావడంతో బిల్లుల మోత తడిసి మోపెడు అవుతుంది అని అన్నారు. అదే విధంగా ఛార్జీలను పెంచుతున్నట్లు విద్యుత్తు సంస్థలు ప్రకటించకుండా అమలులోకి తేవడం సిగ్గుచేటని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు నెలలపాటు బిల్లులను రద్దు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ అజీమ్ డిమాండ్ చేశారు.

ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు..18 380 రూపాయలు నగదు స్వాధీనం

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణ పరిధిలోని పడమర బలిజ పాలెం లో పేకాట శిబిరంపై కందుకూరు టౌన్ ఎస్సై తన సిబ్బందితో సోమవారం రాత్రి దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 18380 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్

లోకల్ టైమ్స్:చoదర్లపాడు: పశ్చిమ కృష్ణాజిల్లా చందర్లపాడులో ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ,సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్యం అమ్మకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా ప్రభుత్వ మద్యం షాపు ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్రంలో కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు,ఒకపక్క కరోనా వైరస్ను కంట్రోల్ చేసే విషయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తా ఉంటే వారి చేసే పనికి అర్థం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్యం పై నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతానన్ని ఎన్నికల వాగ్దానాలల్లో చెప్పి ఈరోజు మధ్య అమ్మకాల నిర్ణయాలు తీసుకుని మహిళలు మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నేపథ్యంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయి అని చెప్పింది .మరోపక్క మద్యం అమ్మకాలు చేపట్టింది ఈ అమ్మకాల వల్ల గృహహింస కేసులు పెరగడంలో మద్యమే ప్రధాన కారణమని స్పష్టం చేస్తూ పేద,మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి కానీ వారి జీవితాలు నాశనం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మద్యం లాంటి నిర్ణయాలు తీసుకోకూడదని తెలియజేస్తూ తక్షణమే మద్యం అమ్మకాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చనుమోలు సైదులు సిఐటియు నందిగామ మండల కార్యదర్శి గోపాల్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు N.నాగేశ్వరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాసిం మండల కార్యదర్శి sk.హుస్సేన్ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గోపీనాయక్ మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు, ఎస్ఎఫ్ఐ నాయకులు షేక్ మౌలాలి M. ప్రభాకర్ పాల్గొన్నారు.

HPCL పైపులైన్ బాధిత రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి

లోకల్ టైమ్స్:చందర్లపాడు: HPCL బాధిత రైతుల సమస్యలపై చందర్లపాడు మండలం తాసిల్దార్ కార్యాలయం నందుHPCL పైపులైన్ అధికారులు రైతులతో స్థానిక తాసిల్దార్ ముఖాముఖి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ మాకు న్యాయమైన ధర చెల్లించాలని కోరారు. దీనికి పైపులైన్ అధికారులు అంగీకరించకపోవడంతో సమావేశం నుండి రైతులు బయటకు వచ్చి ఆందోళ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు HPCL బాధిత రైతులను గందరగోళ గురి చేస్తున్నారు రైతులకు 100% నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి పంట నష్టపరిహారం కూడా నిర్ధారించి రైతులు అనుమతి తీసుకొని హెచ్పీసీఎల్ పైపులైను పనులు ప్రారంభించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ని కలిసి తమకు న్యాయం చేయమని అడుగుతా మని అప్పటి వరకు ఆగాలని కోరారు. లేనియెడల ఏదిఏమైనా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుదే నరసింహారావు, గుడిపూడి వీర ప్రసాదు మల్లెల వెంకటేశ్వరరావు కమతం పుల్లారావు టీ లక్ష్మయ్య సయ్యద్ కాసిం కే గోపాల్ తది తరులు పాల్గొన్నారు.

మద్యం షాపులు.. వద్దు కరోనా నియంత్రణ ముద్దు- సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ డిమాండ్

లోకల్ టైమ్స్ ఒంగోలు: మద్యం షాపులు వద్దు కరోనా నియత్రనేముద్దు అని వివి పాలెం సమీపంలో భౌతిక దూరం పాటిస్తూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆయా సంఘాల నాయకులు కార్యకర్తలు సోమవారం నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జ వి వి బిి కుమార్ మాట్లాడుతూ ఒకవైపు కరోనా ప్రపంచమంతా భయంతో గజగజ వణుకుతూ ఫోన్ లో రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం పెంచుకునేందుకు మద్యం దుకాణాలు తెలిసిందని ఆరోపించారు .లాక్ డౌన్ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రాణాలు తీస్తున్న సమయంలో మద్యం దుకాణాలు 6:00 వరకు రావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారుమద్యం దుకాణాలు పెరగటం వలన క రోనావ్యాధి వ్యాప్తి చెందుతుందని ప్రజల ఆరోగ్యం కన్నా ఆదాయమే మిన్న అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా మద్యం దుకాణాలను మూసి వేయాలని ఆయన అన్నారుఈ కార్యక్రమంలో ఆయా ప్రజా సంఘాల నాయకులు సాదు చెన్నకేశవులు లాజర్ ఆశీర్వాదం చెన్నయ్య టీవీ రామారావు భాస్కర్ తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల శాంపిల్స్ సేకరించిన వైద్య శాఖ అధికారులు సిబ్బంది

లోకల్ టైమ్స్ ఒంగోలు: మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చిన ప్రజల శాంపిల్స్ను కరుణ పరీక్షల నిమిత్తం మండల వైద్యాధికారి డాక్టర్ స్వాతి పర్యవేక్షణలో వైద్య ఉద్యోగులు సిబ్బంది సోమవారం నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే పరీక్షల నమూనాలను సేకరిస్తామని వివరించారు. ఇది ప్రజల ఆరోగ్యం కోసమేనని ఆరోగ్యంతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం వారి పరిధిలోని గ్రామ ఆరోగ్యం వారి బాధ్యతను ఆ బాధ్యతలను గుర్తించి స్వయంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఫోటో స్టూడియోలో వర్కర్లకు బియ్యం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణంలో లాక్ కార్యక్రమం ద్వారా ఉపాధి కోల్పోయిన ఫోటో స్టూడియో లో వర్కర్ గా పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్స్ 50 మందికి ఫోటో స్టూడియో ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అందించిన 50 మందికి బియ్యం పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంటు గోపిసెక్రటరీ బ్రహ్మ రామ్ ప్రసాద్ కృష్ణ మురళి వేణు రాము మహర్షి శీను కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Design a site like this with WordPress.com
Get started