నేడు మార్కాపురంలో జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

JanaSena Party (@JanaSenaParty) | Twitter

లోకల్ టైమ్స్ ఒంగోలు: ఈ నెల 12 ఉదయం ఎనిమిది గంటలకు మార్కాపురం పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జనసేన పార్టీ ఇన్చార్జి కాశీనాథ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ శిబిరానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ అభిమానులు తరలి వచ్చి రక్తాన్ని దానం చేయాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు డాక్టర్ సాహెబ్ ఫోన్ నెంబర్ 99 6 670278 సంప్రదించాలని ఆయన సూచించారు.

కడప 45 డివిజన్ పరిధిలోని మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోపా పంపిణీ

లోకల్ టైమ్స్ కడపజిల్లా:కడప నగర పాలక సంస్థ పరిధి లోని చెమ్ముమియా పేట,ఉటూకురు,భగత్ సింగ్ నగర్ పరిధిలో ఉన్న దాదాపు 400 మైనారిటీ కుటుంబాలకు 7 వస్తువులు గల రంజాన్ తోఫా ను 45 డివిజన్ వైసీపీ ఇంచార్జి శ్రీ గుత్తిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అందజేశారు,కరోనా ప్రభావంతో దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న కారణంగా రంజాన్ ఉపవాస ప్రార్ధనలు ఇంట్లోనే ఉండి చేసుకోవాలని ప్రజలను కోరారు.కరోన మహమ్మారిని దేశం నుండి బయటికి తరిమి కొట్టే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని,అవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి బయటకి రాకూడదని తెలియజేసారు.తప్పకుండా ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.ఈ సందర్బంగా వారు ప్రజలుతో మాట్లాడుతూ డ్రైనేజీ,వీధి రోడ్లు సమస్యలను శ్రీనివాసులురెడ్డి గారి దృష్టికి తెచ్చారు.ఈ కార్యక్రమంలో లింగ రెడ్డి గారు,కార్యకర్తలు నంద కిశోర్, సాయి ప్రతాప్,సుబ్బారాయుడు,కేశవ మరియు వాలంటీర్స్ రాజా శేఖర్,మధు సుధన్,షైక్ మన్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు

జనసేన ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

లోకల్ టైమ్స్ కడపజిల్లా చెన్నూరు: మండలంలోని పేద ప్రజలకు సోమవారం నాడు జనసేన నాయకులు ఇందిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యం లో దాదాపు 1300 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన రాయలసీమ సంయుక్త కమిటీ జాయింట్ కన్వీనర్ మరియు కడప ఇంచార్జి శ్రీ సుంకర శ్రీనివాసులు మరియు మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జి పండిటి మల్హోత్రా లు పాల్గొనడం జరిగినది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరొనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం లాక్ డౌన్ నెలకొన్న కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రం లోని ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులు పేదలకు అండగా నిలవాలని పిలుపునివ్వడంతో రాష్ట్రంలో జనసైనికులు పెద్ద ఎత్తున పేదలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని చిన్నమాచుపల్లి,శేషయ్యగారి పల్లి , చెన్నూరు నందు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందనీ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గం కు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మండల జనసేన ఇంచార్జి విశ్వనాథ, పసుపు లేటి శ్రీనివాసులు,రామ సిద్దూ,సాయిపేట పవన్,యుగంధర్,బాబు,శ్రీకాంత్,సంపత్,షరీఫ్,రెడ్డయ్య ,అర్జున్,నాగేంద్ర లు పాల్గొన్నారు.

ఆపద సమయంలో చేయూత అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కార్యక్రమంతో ఉపాధి కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తున్న దాతలకు పేరుపేరునా ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం కందుకూరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చిన విరాళాలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా పంచాయతీ లో గల ఆపిస్ సంస్థ నిర్వాహకులు లక్ష రూపాయలు కందుకూరు పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు నాగేశ్వరరావు 50 వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ పదివేల రూపాయలు వెంకటేశ్వర్లు పదివేల రూపాయలు చక్రవర్తుల విజయకుమార్ ఐదు వేల రూపాయలుడబ్బు కొట్టు మాధవ 25 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో దాతలకు కొదవలేదని ఎలాంటి ఆపద సమయంలోనైనా ప్రజలను ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు మనసున్న మనుషులు నియోజకవర్గంలో అధికంగానే ఉన్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్మిక వ్యతిరేక ఆర్డినెన్స్ ను రద్దు చేయాలి..ఏ ఐ టి యు సి

లోకల్ టైమ్స్ ఒంగోలు: కార్మికుల హక్కులను కాలరాసే ఎందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం కందుకూరు సిపిఐ కార్యాలయంలో ఆర్డినెన్సు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కార్మికులకు ప్రయోజనం శూన్యం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వం కార్మికులను కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోవడమే నని అన్నారు .ఇలాంటి పరిస్థితుల్లో నూతన ఆర్డినెన్స్ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని తక్షణమే ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మాలకొండయ్య ఏఐటీయూసీ నాయకులు బాలకోటయ్యaiyf జిల్లా కార్యదర్శి ఆనంద మోహన్ స్వర్ణకారుల సంఘం నాయకులు బాలబ్రహ్మచారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు ముందుకు రావాలి.. ఎమ్మెల్యే మహీధర రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు; కరోనా నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గంలో గత నలభై రోజులుగా ప్రభుత్వం అధికారులు పోలీసులు వైద్య సిబ్బంది జర్నలిస్టులు ప్రజల అందరి సహకారంతో కరోనా వ్యాధి ప్రబలకుండా ఈ తరుణంలో నియోజకవర్గానికి సుమారు 15 వేల మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వచ్చాడని వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి చేతులెత్తి దండం పెడుతూ వారికి సూచించారు .విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ నరసరావుపేట హైదరాబాద్ చెన్నై ఇతర ప్రాంతాల నుంచి నియోజకవర్గానికి ప్రజలు వచ్చారని వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు .వారు అందరూ ఒక్కసారి ఆలోచించాలని వారి ఆరోగ్యం వారి కుటుంబం ఆరోగ్యంతో పాటు ఆ గ్రామం ఆరోగ్య నియోజవర్గం ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు వస్తే వారికి పరీక్షలు నిర్వహించడమే కాకుండా క్వారం టైంలో అవసరమైన ఆహారం వసతి కల్పిస్తామని ప్రజలందరూ ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించి స్వచ్ఛందంగా వివరాలు అందజేయాలని ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు.

ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు మండల పరిధిలోని పలుకూరు పంచాయతీ లో గల పత్తిపాటి వారి పాలెం గిరిజన కాలనీలో గిరిజనులకు ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో అందించిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో చేయూత నిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ నాయకులు వెంకటేశ్వర్లు మునీర్ భాష ఆర్ వెంకటేశ్వర్లు జంగాల సుధీర్ వెంకటేశ్వర్లు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

27వ పొగాకు వేలం కేంద్రంలో కొనుగోలు ప్రారంభం

బైక్ ర్యాలీలతో చర్చించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి..
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవటంలో కంపెనీల బాధ్యత..

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ లో గల 27వ పొగాకు వేలం కేంద్రంలో లాక్ డౌన్ సందర్భం గా నిలిచిన పొగాకు కొనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలం కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి వేలం కేంద్రం అధికారి లక్ష్మణ్ రావు మరియు ఆయా కంపెనీల బలగాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇతర రోజుల్లో ఎలా ఉన్న పరిస్థితుల్లో కంపెనీలు ఆదుకోవాలని రైతు మీకు చేయూతని అందిస్తుందని అన్నారు. సుదీర్ఘంగా చర్చించిన ఆయన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పదేపదే కోరారు.

వివాద స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు తొలగించాలి..ఎమ్మెల్యే మహీధర రెడ్డి

లోకల్ టైమ్స్ ఒంగోలు;కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వివాదాస్పద స్థలంలో ఉన్న మద్యం దుకాణాలు తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు ఎమ్మెల్యే మానుగుంట మహీధ రర్రెడ్డి అన్నారు. అధికారులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు తొలగించే దుకాణాల్లో రెండు కారణాలు ఉన్నాయని ఇదే సందర్భంలో పట్టణ నడిబొడ్డున టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం ఎదురుగా ఉన్న ఈ దుకాణాన్ని తొలగించాలని ఉన్న స్థలం కూడా వివాదంలో ఉందని ప్రభుత్వ భూమిలో దుకాణాన్ని నిర్మించారని అన్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించిన తొలగించాలని లేనిపక్షంలో ప్రజల పక్షాన నేనే అడ్డుకుంటాం అని ఆయన అన్నారు .ఏది ఏమైనా ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండదని ఊరి మధ్యలో ఉంటే అనేక వివాదాలు వస్తాయని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే అధికారులతో ఇంత కఠినంగా మాట్లాడటం ఆశ్చర్యం అనిపించింది.

తక్షణమే మద్యం దుకాణాలు మూసి వేయాలి..ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ అరుణ డిమాండ్

లోకల్ టైమ్స్ ఒంగోలు; ప్రజల ఆరోగ్యాన్ని ఆర్థిక వనరులను నాశనం చేసే మద్యం విక్రయించే మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఏపీ మహిళా సమాఖ్య మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ అరుణ డిమాండ్ చేశారు .సోమవారం కందుకూరు పట్టణంలోని కోటా రెడ్డి నగర్ ప్రాంతంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు మూసి వేయాలని భౌతిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుణ మాట్లాడుతూ ఒకవైపు ప్రపంచమంతా కరోనా తో భయంతో గజగజ వణికి పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాలు దురదృష్టకరమని అన్నారు. తక్షణమే తెలిసిన మద్యం దుకాణాలను మూసి వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని అన్నారు .ఏది ఏమైనా ప్రజల ఆరోగ్యం కన్నా ఖజానాకు ఆదాయం ప్రభుత్వానికి మిన్న అన్న విధంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్య అని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు శాంతి కుమారి మహిళా సమాఖ్య నాయకులు లక్ష్మి వి కోటేశ్వరమ్మ కె అంజమ్మ డీ శివమ్మ ఉషా రాణి g పద్మ డీ శారదతదితరులు పాల్గొన్నారు.

మాస్కులు లేకుండా దూరం పాటించకుండా చర్యలు కఠినంగా ఉంటాయి..పట్టణ ఎస్ఐ తిరుపతిరావు

లోకల్ టైమ్స్ ఒంగోలు; దుకాణాల వద్ద దుకాణాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు దుకాణానికి కొనుగోలు చేస్తున్న వ్యక్తులు మాస్కులు లేకుండా వచ్చిన భోతికదూరం పాటించకుండా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .సోమవారం 45 రోజుల అనంతరం తెరుసుకున్న దుకాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని దుకాణంలో ధరించాలని అదేవిధంగా దుకాణాల్లో కొనుగోలు వచ్చే ప్రజలు కూడా పాటించి మాస్కులతో బయట సంచరించాలనిి ఆయన సూచించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం కోసమేనని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పారిశుధ్య కార్మికులు ఏఎన్ఎం లు ఆశావర్కర్లకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు; సీమకుర్తి పట్టణంలో మాజీ మంత్రి బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యుల చేయూత తో పారిశుద్ధ్య కార్మికులు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లకు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగలు నిత్యావసర సరుకులు దుస్తులు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి బూచేపల్లి వెంకాయమ్మ వైసిపి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కార్మికులకు ఏఎన్ఎంలు ఆశ వర్కర్ల భోజనం ఏర్పాటు చేశారు.

పేదలకు ఆహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణం లో లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి రోజు పేదలకు ఆహారం అందజేస్తున్న వాసవి సేవాదళ్ నిర్వాహకులు 49వ రోజు దాత సోమిశెట్టి మధుసూదన్రావు రోడ్లోని 200 మంది పేదలకు సోమవారం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాల మధు బుచ్చయ్య గుప్తా వాస్తుశిల్పి కొచ్చర్ల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావుకు పితృవియోగం

శ్రీరాములు మృతికి సంతాపం తెలిపిన సిపిఐ ఎస్టియు నాయకులు

లోకల్ టైమ్స్ ఒంగోలు; ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు హై విసుబ్బారావు తండ్రి శ్రీరాములు మృతి చెందడం పట్ల ఆయనతో ఉద్యమాలతో మమేకమై ఉన్న సీపీఐ నాయకులు మరియు ఉపాధ్యాయులు సిపిఐ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్రీరాములు ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా అనేక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై ఉద్యమాలు నిర్మించడమే కాకుండా బలోపేతానికి శ్రమించారు. అదేవిధంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ప్రకాశం జిల్లాలో సిపిఐ ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నాయకులతో కలిసి తన బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. అదేవిధంగా ఆయన తనయుడు సుబ్బారావు తొలుత విద్యార్థి సంఘమైన ఏఐఎస్ఎఫ్ అనంతరంaiyf జిల్లా నాయకుడుగా ఉద్యమాల్లో చురుగ్గా వ్యవహరించారు అనంతరం విశాలాంధ్రలో విధులు నిర్వహించి పత్రిక బలోపేతానికి కృషి చేశారు .ఇదంతా శ్రీరాములు ఇచ్చిన స్ఫూర్తి తోనే ఆయన తనయుడు నెరవేర్చాలని సహచరులు పేర్కొంటున్నారు .ఈ క్రమంలోనే శ్రీరాములు మృతి పట్ల పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు కాకుండా సిపిఐ ఎస్టియు నాయకులు పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు .ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘం లో ఆయన చేసిన సేవలు బాధ్యతలు నెరవేర్చిన విధానం ఉద్యమాల కొనసాగింపు గుర్తుకు వచ్చి ఆయనతో ఉద్యమాలలో చురుకైన పాత్ర నిర్వహించిన ఆయన స్ఫూర్తితో ఉపాధ్యాయ సంఘం లో పనిచేసిన నేటి ఉపాధ్యాయులు గుర్తుతెచ్చుకొని ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.

కిలో 139 ,76 రూపాయలు సరాసరి పలికిన పొగాకు ధర

pogaku – Janam Mata

లోకల్ టైమ్స్ ఒంగోలు; కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ లో గల 27వ పొగాకు వేలం కేంద్రంలో రైతులు ఉత్పత్తి చేసిన పొగాకు వేలం పాటలో వ్యాపారస్తుల కొనుగోళ్ళు సరాసరి 139,76 రూపాయలు పలికినట్లు వేల నిర్వహణ అధికారి లక్ష్మణ్ రావు తెలిపారు. సోమవారం లాక్ డౌన్ సందర్భంగా నిలిచిపోయిన పొగాకు కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు 244 బే ళ్ళ ను పొగాకు బోర్డు తరలించగా 196 బే ళ్ళను వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా గరిష్ట ధర కిలోకు 173 రూపాయల కనీస ధర కిలోకు 120 రూపాయల పలికింది. 139 రూపాయల పైచిలుకు పొగాకు ధర పలికింది. ప్రారంభం రోజే 48 పోగాకు బే ళ్లు కొనుగోలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న కాలంలో రైతుల కష్టాలను గుర్తించి పొగాకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని రైతులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పేద ప్రజలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలిచిన ఘట్కేసర్ కౌండిన్య యువజన సంఘం

మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్

ఘట్ కేసర్ లోని గౌడ సంఘం కార్యాలయంలో పేద ప్రజలకు అన్నం వడ్డిస్తున్న మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్.

ఘట్ కేసర్(లోకల్ టైమ్స్); పేద ప్రజలను ఆదుకుంటూ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఘట్కేసర్ కౌండిన్య యువజన సంఘం సభ్యులు ఆదర్శంగా నిలిచారని మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, యాచకులను ఆదుకునేందుకు ఘట్కేసర్ కౌండిన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పంపిణీ చేశారు. లాక్ డౌన్ విధించిన్నప్పటి నుండి గత 45 రోజులుగా బాధితులకు నిత్య అన్నదానం చేసి తమ సేవా నిరతిని చాటుకున్నారని చెప్పారు. ఎంతో మంది పేదలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ రెండు పూటలా తినలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. సేవా స్ఫూర్తితో విరామం లేకుండా అన్న దానం చేస్తూ చేస్తున్న కౌండిన్య యువజన సంఘం అందరికీ ఆదర్శప్రాయం గా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి వసంత, బండారి ఆంజనేయులు గౌడ్, గౌడ సహకార సంఘం అధ్యక్షుడు మదనగిరి సురేష్ గౌడ్, కౌండిన్య యువజన సంఘం అధ్యక్షులు బండ్లగూడ కిషోర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు రాంపల్లి జగదీష్ గౌడ్, అబ్బగోని నాగరాజు, అబ్బగోని బాలకృష్ణ గౌడ్, పల్లె విజయ్ గౌడ్, బండారి కృష్ణ గౌడ్, గణేష్ గౌడ్, శ్రీనివాస్, రమేష్, కిరణ్, నంబియార్ తదితరులు పాల్గొన్నారు.

దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఏం ఐ ఎం నేతను కటినంగా శిక్షించాలి.

సీఐటీయు జిల్లా కోశాధికారి ఎన్ సబిత డిమాండ్

ఘట్ కేసర్ లో దళిత మైనర్ బాలికపై ఎం ఐ ఎం నాయకుని అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఐద్వా నాయకురాళ్లు

ఘట్ కేసర్(లోకల్ టైమ్స్); పాత బస్తీలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఎం ఐ ఎం నేత షకీల్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్ సబిత పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఘట్ కేసర్ మండల కేంద్రంలో ఆదివారం మైనర్ బాలిక అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
చాధర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ కు చెందిన మైనర్ ఎస్సీ బాలిక మహాలక్ష్మి పై అత్యాచారానికి పాల్పడిన షకీల్ ను ఎం ఐ ఎం పార్టీ నుండి బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. షకీల్ పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఫోక్సో యాక్ట్ తో పాటు నిర్భయ కేసు ను నమోదు చేయాలని తెలిపారు. బీజేపీ నేతలు హిందు, ముస్లిం మతం రంగు పులిమి అశాంతి సృష్టించడానికి కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో అసిఫా వంటి సంఘటనలు అనేకం జరిగాయన్నారు. అన్ని సంఘటనలను మతంతో ముడిపెట్టగూడదని తెలిపారు.
షకీల్ ను కటినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు సిహెచ్.అరుణ, అలివేల, బిహార్ సునీత, భారతి, వాణి, రామక్క, గంగ, జయ తదితరులు పాల్గొన్నారు.

అన్నార్తులకు ఆసరగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న వై ఎస్ రెడ్డి ట్రస్ట్ సేవలు

టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బైనగారి నాగరాజు

కొర్రెముల గ్రామంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న నాగరాజు తదితరులు

ఘట్ కేసర్ (లోకల్ టైమ్స్) లాక్ డౌన్ సమయంలో మండలంలోని అన్ని గ్రామాలు, పురపాలక సంఘాల పరిధిలోని పేద కుటుంబాలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని ఆదుకుని నిత్యావసర సరుకులు అందజేస్తున్న వైఎస్ రెడ్డి ట్రస్ట్ సేవలు అమోఘమని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బైనగారి నాగరాజు కొనియాడారు. మండల పరిధి కొర్రెముల గ్రామంలో కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ సందర్భంగా అనునిత్యం ప్రజలను కాపాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసినందుకు గాను పారిశుద్ధ కార్మికులు, పంచాయితీ సిబ్బందికి ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వై ఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా పంపించిన బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బైనగారి నాగరాజు, ఎంపీటీసీ వినోద నాగార్జున, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బాలు యాదవ్ లతో కలిసి పంపిణి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సందర్భంగా ఏ ఒక్కరు ఇబ్బందులు ఇబ్బందులకు గురికాకుండా ఆదుకోవడమే లక్ష్యంగా ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్నట్లు సమాచారం అందితే చాలు నిమిషాలలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అన్నార్తులకు అండగా పేద ప్రజలకు బాసటగా నిలిచిన ఎంపీపీ సుదర్శన్ రెడ్డి కి ప్రతి ఒక్కరూ జేజేలు పలుకుతున్నారని తెలిపారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసులకు వై ఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా సహకారాలు అందిస్తూ అందరి మన్ననలను పొందిన ఆదర్శప్రాయుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన లో భాగంగా ప్రతి సభ్యుడు తన వంతు కర్తవ్యంగా పని చేస్తున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా ఎవరికైనా ఆర్థిక ఆరోగ్య పరమైన ఇబ్బందులకు గురి అయితే వెంటనే సమాచారం ఇవ్వాలని, బాధితులకు వైయస్ రెడ్డి ట్రస్టు ద్వారా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర గుట్ట ఆలయ కమిటీ డైరెక్టర్ తరిణే మహీంద్రా చారి, వార్డు సభ్యులు యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, నాయకులు, వైఎస్ రెడ్డి ట్రస్ట్ మండల సభ్యులు తదితరులు.

మంత్రి కేటీఆర్ పిలుపు.. ప్రతి ఇల్లు శుభ్రతకు మలుపు

  • దోమల నివారణకు చెరువులో ఆయిల్ బాల్స్
  • పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి భగత్ సింగ్ నగర్ లో చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న మేయర్ జక్క వెంకటరెడ్డి

పీర్జాదిగూడ, లోకల్ టైమ్స్ 10: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు.. ప్రతి ఇల్లు శుభ్రతకు మలుపు అని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని చెరువులలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేశారు. ఒకటో డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, నీటి నిల్వలను తొలగించి శ్రమదానం తో శుభ్రం చేయించారు. కాలనీలలో ని పరిసరాలలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని స్థానిక కార్పొరేటర్లు, నెంబర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి తొలగించారు. పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులను తరిమి కొట్టవచ్చునని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కాలనీలలో ప్రతి ఇంట్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో శుభ్రతను పాటించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నిరంతరం పరిశుభ్రతను పాటించాలని, కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు నిర్మల, మనోరంజన్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

పీర్జాదిగూడ బుద్ధ నగర్ లో ఆక్రమణలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది

పీర్జాదిగూడ, లోకల్ టైమ్స్ 10: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. అనుమతి లేకుండా, అనుమతి ఉన్నా విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు. ఆదివారం పట్టణం పరిధిలోని బుద్ధ నగర్ రోడ్ నెంబర్ 6 లో అనుమతికి విరుద్ధంగా జరుగుతున్న ఇంటి నిర్మాణాలను టాస్క్ ఫోర్స్, పట్టణ ప్రణాళిక సిబ్బంది సంయుక్తంగా తొలగించారు. డివిజన్ల వారీగా అనుమతి లేకుండా, అనుమతికి విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి యజమానుల స్పందన లేకపోవడంతో కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. అనుమతులు ఉంటేనే నిర్మాణాలు చేపట్టాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు.

చెత్త డబ్బాలు..రోడ్డు ప్రమాదాలు

నల్ల చెరువు కట్ట జాతీయ రహదారిపై అధికారుల నిర్లక్ష్యమా..వాహనదారులు ఫైర్

ఉప్పల్, లోకల్ టైమ్స్ 10: ఉప్పల్ పట్టణంలోని నల్లచెరువు అవును కట్ట జాతీయ రహదారి లో చెత్త డబ్బాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రోడ్డు మధ్యలో డబ్బులు పెట్టడం వల్ల వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఢీకొట్టడంతో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జాతీయ రహదారి లోని సాయిబాబా గుడి సమీపంలో మురికి కాలువ పక్కన ఖాళీ స్థలం ఉన్నప్పటికీ రోడ్డు మధ్యలోనే చెత్త డబ్బాలు పెట్టడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాహనదారులు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం ఉన్నత అధికారుల నిర్లక్ష్యం తో రోడ్డు ప్రమాదాలు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త డబ్బాలు ఉన్న ప్రాంతం జిహెచ్ఎంసి లేదా పీర్జాదిగూడ కార్పొరేషన్ ఎవరిదైనా సరే ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న చెత్త డబ్బాలను పక్కన జరిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి కోరారు.

దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన ఎంఐఎం నేత ను అరెస్టు చేయాలని బోడుప్పల్ లో బీజేపీ మహిళా నేతలు దీక్ష

దీక్ష చేస్తున్న బిజెపి మహిళా మోర్చా నాయకులు

బోడుప్పల్ లోకల్ టైమ్స్ 10: దళిత సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఎంఐఎం నేత ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు పిలుపుమేరకు భేటీ బచావో బేటి పడావో అధ్యక్షురాలు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి మహిళా మోర్చా నాయకులు లీలావతి, రాధికా రెడ్డి, ప్రగతి, బిజెపి బోడుప్పల్ కమిటీ ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్ యాదవ్ ఆదివారం వారి వారి ఇంట్లో నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్ చాదర్ఘాట్ లో జరిగిన ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అతడిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేయాలని లేనిచో మహిళలతో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

రామంతపూర్ లో అధిక ధరలకు మద్యం విక్రయాలు..

డెకాయి ఆపరేషన్ లో పట్టుబడ్డ వైనం..లైసెన్స్ హోల్డర్ పై కేసు..

ఉప్పల్, లోకల్ టైమ్స్ : రామంతపూర్ మెయిన్ రోడ్ లోని దూరదర్శన్ ఎదురుగా ఉన్న
క్వాలిటీ వైన్ షాప్ లో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా ధర వసూలు చేస్తూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు డెకా యి ఆపరేషన్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రంగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ లో రూ.680 లిక్కర్ ను రూ.720కి విక్రయించినట్లు రుజువయింది. దీంతో వైన్ షాప్ లైసెన్స్ హోల్డర్ సత్యనారాయణ పై ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రంగస్వామి తెలిపారు.

నేను సైతం పరిశుభ్రతలో..సతీమణితో మంత్రి మల్లారెడ్డి శ్రమదానం

బోడుప్పల్, లోకల్ టైమ్స్ 10: మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి సతీమణితో కలిసి ఇంట్లో నీటితో చేశారు. పరిశుభ్రత తోనే వ్యాధులు మాయమవుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఇ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శ్రమదానం తో ఇంటిని శుభ్రం చేసుకోవాలని కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించాలని, రోడ్లలో లో చెత్త చెదారాన్ని తొలగించాలని పేర్కొన్నారు. ఇంట్లో, ఇంటి ఆవరణలో కలుషితమైన నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా పగిలిపోయిన గ్లాసులు, కొబ్బరి బోండాలు తొలగించాలని అని కోరారు.

ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదు..బత్తిని హరనాథ్ గౌడ్

కరోన వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న తరుణం లో ఎప్పుడు పూర్తిగా నయం అవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఉన్న ఈ సమయంలో తమ కుటుంబం వందల సంవత్సరాలుగా ఆస్తమా,దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరంవేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అన్ని ప్రచార సంస్థలకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
యావత్ ప్రపంచ మానవాళిని గృహ నిర్బంధం చేయిస్తూ అందినవార్ని అంతమొందిస్తున్న మహ్హమ్మారీ కరోనా ప్రభావానికి ఏమందూ లేదు…ప్రతి ఒక్కరూ దూరం పాటించడం తో పాటు, ప్రతి క్షణం పరి శుభ్రత పాటించడమూ, అత్యవసర మైతే తప్ప ఇంటి నుండి బయట కు రాకుండా ఉండటమే రక్షణ అని బత్తిని హరనాథ్ గౌడ్ అన్నారు.
ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది మా చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని.ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెల 29 తో ముగిసినా తరువాత పరిస్థితులను బట్టి జూన్ లో పొడిగించినా తాము మాత్రం ఈ సారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకఠిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని తక్షణం మాకు గానీ పోలీసు వారికి గాని తెలియచేయాలని బత్తిని హరనాథ్ గౌడ్ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల వారు ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇతర స్వచ్ఛంద సంస్థలు, బద్రివిషాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, అగ్రవాల్ సేవా సంగ్ సభ్యులు అందించే సహకారం ఎన్నడూ మరువలేనిది వారందరికీ ఈ ప్రకటన ద్వారా మరియు ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని తెలియచేస్తున్నట్లు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు.కావున ఈ సంవత్సరం బత్తిని చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని ప్రజలందరూ గ్రహించి గలరని కోరారు.

అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రవిరెడ్డి

లోకల్ టైమ్స్ కడపజిల్లా చెన్నూరు:కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు ఎస్ ఇ,ఏ ఇ, డి ఇ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో నియోజకవర్గం లోని ఆరు మండలాలలో ఈ వేసవిలో ఎక్కడెక్కడైతే త్రాగునీటి సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులతో సూచించారు,నియోజకవర్గ స్థాయిలో సచివాలయాల నిర్మాణాలు హెల్త్ కేర్ సెంటర్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని వారితో చర్చించారు,ఈ కార్యక్రమంలో అని మండలాల అధికారులు పాల్గొన్నారు.

బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న పిల్లలకు ఆపన్న హస్తం చారిటబుల్ ట్రస్ట్ చేయూత

క్యాన్సర్ తో బాధ పడుతున్న ఇద్దరు చిన్న పిల్లలకు ఆపన్న హస్తం చారిటబుల్ ట్రస్ట్ అత్యవసర మందులు అందించి వారి ప్రాణాలు కాపాడడం జరిగింది.


లోకల్ టైమ్స్ కడపజిల్లా చెన్నూరు: చెన్నూరు మండలం శివాల్ పల్లెకు చెందిన ఓబులేష్, కడపకు చెందిన మరొక పిల్లవాడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. మద్రాస్ లోని క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్నారు.కరోనా లాక్ డౌన్ పరిస్థితులలో ఈ పిల్లలకు నిత్యం వాడవలసిన అత్యవసర మందులు దొరకలేదు.వారికి మద్రాస్ కు వెళ్లలేని పరిస్థితి. ఈ విషయాన్ని శివాల్ పల్లె అన్నదానకేంద్రం నిర్వాహకులు సుదర్శన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ డా.శ్రీరామకృష్ణ దృష్టికి తీసుకొనిరాగా అయన వెంటనే స్పందించి హైదరాబాద్ నుండి తన మిత్రుడు సునీల్ సహకారంతో మందులు తెప్పించారు. ట్రస్ట్ ధర్మకర్తలు సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి, హరి వాటిని ఈ రోజు చిన్నపిల్లలకు అందజేసి మానవత్వమును చాటుకున్నారు. పిల్లల తల్లిదండ్రులు అత్యవసర మందులు అందించి తమ బిడ్డల ప్రాణాలు కాపాడిన ట్రస్ట్ చైర్మన్ మరియు ధర్మకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అద్దంకి విశ్వనాధ్
ట్రస్ట్ ధర్మ కర్త
ఆపన్న హస్తం చారిటబుల్ ట్రస్ట్

పేదలకు ఆహారం పంపిణీ

లోకల్ టైమ్స్ ఒంగోలు: కందుకూరు పట్టణం లో వాసవి సేవాదళ్ నిర్వాహకులు దాత దర్శి సతీష చేయూత తో్ 200 మంది పేదలకు ఆదివారం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో వాసవి సేవాదళ్ జిల్లా కోశాధికారి చక్కావెంకట కేశవరావు చలం చర్లసుబ్బారావు సీనియర్ హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్ పసుపులేటి పాపారావు శశాంక్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఆరుగురు జూదరులు అరెస్టు.. 5540 రూపాయల నగదు స్వాధీనం

లోకల్ టైమ్స్ ఒంగోలు: బేస్తవారిపేట మండలం పరిధిలోని అక్క పల్లి గ్రామ పొలాలలో అచ్చు బొమ్మ ఆడుతున్న ఆరుగురుజూడరులను ఎస్సై రవీందర్ రెడ్డి ఆదివారం అరెస్టు చేశారు .ఆ ఆరుగురు నుంచి 5 వేల ఐదు వందల నలభై రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

St కాలనీలో ఆహారం పంపిణీ


లోకల్ టైమ్స్ ఒంగోలు: లాక్ డౌన్ సందర్భంగానిరంతరం ప్రతిరోజు పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్న వాసవి సేవాదళ్ నిర్వాహకులు 48వరోజు రెడ్డిపాలెం గిరిజన కాలనీలో వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ.పొన్నలూరు si బి.బ్రహ్మనాయుడు కోరిక మేరకు నిరుపేదలైన గిరిజనులకులకు ద్రోణాదుల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలకు సేవచేసే ప్రతి ఒక్కరూ అదృష్టవంతులన్నారు.అదేవిధంగా 48రోజుల నుండి కరోనాను, ఎండను లెక్కచేయకుండా సేవచేస్తున్న మాటీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. గిరిజన కాలనీ వాసులకు ప్రజా tv రిపోర్టర్ మద్దాలి సుబ్బరా మయ్యా మాస్కులు పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో చలంచర్ల సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్, p. పాపారావు, శశాంక్,చక్కా బ్రహ్మయ్య,పుట్టా మల్లికార్జున, నల్లూరి రోశయ్య చౌదరి, పగడాల రమేష్ పాల్గొన్నారు.

Design a site like this with WordPress.com
Get started